Wednesday, September 18, 2024

 గరికపాటి ఈ పేరు వింటేనే 1800 భాగాలతో మారుమోగిన ఆంధ్ర మహాభారతం గుర్తొస్తుంది.

మరికొందరికి సాగరఘోష వినిపిస్తుంది. ఇంకొందరికి  కళ్లెదుట్ట మహా సహస్రవధానం గుర్తొస్తుంది. 

ఆయన కేవలం మహాసహస్రవధాని, ప్రవచనకర్త మాత్రమే కాదు ఎంతోమందికి గురువు కూడా.

 ఆయన ప్రవచనాలో భక్తి మార్గం ఉంటుంది. చమత్కారం కూడా ఉంటుంది. తప్పు చేసినప్పుడు చురుకులు ఉంటాయి.

 భక్తి మార్గం ముసుగులో కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యంలోకి వచ్చిన మూఢనమ్మకాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు.

అయిన ప్రవచనాలు ఎందరినో సన్మార్గంలో నడిపించాయి. 

తెలుగు జాతి చేసుకున్న అదృష్టం ఈ ధారణా బ్రహ్మరాక్షసుడి జననం.

వారి ప్రవచనాలతో తెలుగు నేలను పర్వశించిపోయేలా చెయ్యాలని. ఆ ఈశ్వరుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసుపూర్తిగా కోరుకుంటూ.

పూజ్య గురుదేవులు, మహా సహస్రావధాని పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

            --✍️నిఖిల్ अक्केनापल्ली

No comments:

Post a Comment