Monday, September 23, 2024

 *_మనిషికి మనశ్శాంతి కరువవడానికి కారణం ఎక్కడలేని దిక్కుమాలిన మన కోరికలే..._*

*_ఆశ ఉండాలి తప్పులేదు కానీ, అది మరి అత్యాశ కాకూడదు. మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతి చోటూ స్వర్గమే._* 

*_లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగూ నరకమే. పైగా నిన్ను తప్పు చేసే దిశగా నీ మనసును ప్రేరేపిస్తుంది._* 

*_ఒక్కోసారి మన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించలేన్నప్పుడు... ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించగలవు. నీకున్నదాంట్లోనే సంతృప్తి పడు... జీవితం ప్రశాంతంగా ఉంటుంది._* 

*_మనం చేసిన మంచి పనిని అందరూ స్వీకరించకపోయినా, అవసరము, అర్హత ఉన్నవాళ్లు స్వీకరిస్తారు._*

*_నీ యొక్క గొప్పతనం ఈరోజు తెలియకున్నా ఏదో ఒక రోజు... ఈ సమాజానికి తెలియ వస్తుంది. తొందరెందుకు..?_* 

*_మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది._* 

*_ఆత్మాభిమానం పణంగా పెట్టి ఎవరికి దగ్గరగ కాకు... మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎపుడూ అందనంత ఎత్తులో ఉండాలి._*

*_ఎవరో ఒకరు చులకన చేసారు అని నీవు చతికిలబడకు. వారెవరు నా జీవితాన్ని ప్రశ్నించడానికి అని తలెత్తుకొని గర్వంగా జీవించు. ఎవరి స్థాయి వారిదే. నీ స్థాయి నీదే... నీవు నీవే... నీలా మరొకరు ఉండరు.☝️_*

No comments:

Post a Comment