జీవుడు.....
విత్తనం లాగానే క్షేత్రమనబడే ఈ శరీరం కూడా అనాది, కాని అంతం? *ఎప్పుడైతే జీవుడు తన వాసనలను క్షయం చేసుకొని, కర్మఫలాలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటాడో అతడి జీవభావం నశించి పురుషుడుగా - క్షేత్రజ్ఞుడుగా - ఆత్మగా మిగిలిపోతాడు*. కనుక పురుషుడు అనాది - అనంతం.
కొన్నిమతాలవారు చెప్పినట్లు అసలు జన్మలే లేవు; జీవుడు పుడతాడు - చస్తాడు; అంతే - అనే వారి మాటను తీసుకుందాం. పూర్వజన్మ పాపపుణ్యాలు - కర్మఫలాలు లేకపోతే ఈ జన్మలో పాపం చేసినా పుణ్యం చేసినా ఈ జన్మలోనే అనుభవించాలి. అనుభవించక పోతే రద్దై పోవాలి. మరి పాపాలు చేసిన వారు దుఃఖాలు అనుభవిస్తూ - పుణ్యాత్ములంతా సుఖాలు అనుభవిస్తూ ఉన్నారా? లేదు. ఇది మన అనుభవం. సరే ఏమిచేసినా మరణంతో రద్దై పోతాయనుకుందాం. అలాంటప్పుడు ఎలాగూ రద్దై పోతాయి గనుక పుణ్యకర్మలే చేయాల్సిన పనిలేదు. ఎంతటి పాపాలకైనా ఒడిగట్టవచ్చు. స్వార్థంతో హత్యలు, అన్యాయాలు, అక్రమాలు ఏవైనా చేయవచ్చు. దీనిని ఏ మతమైనా అంగీకరిస్తుందా? లేదు. కనుక జన్మలున్నవి. చేసిన కర్మలు ఊరికే పోవు, అనుభవించి తీరాల్సిందే. ఈ దేహంతో కాకపోతే మరో దేహాన్ని ధరించినప్పుడైనా అనుభవించాలి.
|| ఓం నమః శివాయ ||.
No comments:
Post a Comment