వైకుంఠం అనే పేరు విష్ణుమూర్తికి సంబంధించింది కదా. మరి శివుడు కొలువుంటాడని చెప్పే స్మశానాలకు కొన్ని చోట్ల వైకుంఠధామం అని ఎందుకు పేరు పెడతారు?
భగవంతుడు సర్వాంతర్యామి(అన్నింటి లోపల ఉండేవాడు).సర్వ వ్యాపకుడు(అంతటా వ్యాపించి ఉండేవాడు). అయితే శరీరం అంతా మనదే అయినా కూడా కాలు పని కాలుదే,చెయ్యి పని చెయ్యిదే.గుండె పని గుండే చేస్తుంది.భగవంతుని ఏ రూపంలో ఎలా కొలవాలో అలానే కొలవాలి.
మనం మానవులం. జనన మరణాలు మనకు తప్పవు. ఈ చక్రం నుండి బయటపడి మోక్షం పొందడం చాలా దుర్లభం. అందుకే ఉన్నదాంట్లో భక్తితో,ధర్మంగా జీవించమని,దానివల్ల మరు జన్మలో మంచి ప్రాణిగా జన్మిస్తామని శాస్త్రం చెప్పింది. అందుకే ప్రతీ దాంట్లో భగవంతుని చూసే ప్రయత్నం చేస్తాం. కానీ…..
స్మశానం స్మశానంమే. అది అటు వైకుంఠ ధామం కాదు ఇటు కైలాస ధామం కాదు.వాటిని సనాతన స్మశాన వాటిక అనికానీ , వైదిక స్మశాన వాటిక అనికానీ,హిందూ స్మశాన వాటిక అనికానీ సంబోధించాలి. హిందూ అనేది మనకు ఇస్లాం, క్రిస్టియన్ ల కన్నా ముందే పుట్టిన గ్రీకులు,పారసీకులు మనను సంబోధించిన పేరు.
అసలు వైకుంఠ ధామం అంటే ఏమిటి?. ఎక్కడైతే ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందో,ఎక్కడైతే దుఖం ఉండదో,ఎక్కడైతే దేవతలు,ఋషులు నిరంతరం నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో,ఎక్కడైతే మృత్యువు అనేది దగ్గరకు కూడా రాలేదో,ఎక్కడైతే నిరంతరం వేద స్మరణ జరుగుతూ ఉంటుందో,ఎక్కడైతే అష్టలక్ష్మీ ఎల్లవేళలా వెలుగొంతుతూ ఉంటుందో, ఏ స్థానమైతే మన మేధస్సుకు అందనంత గొప్పగా,మన ఊహకు వర్ణించలేనంత అందంగా ఉంటుందో దాన్ని వైకుంఠం అంటారు.
అంతేకాని స్మశానాలను వైకుంఠ ధామాలు అనమని ఏ గ్రంథంలో లేదు. స్మశానం స్మశానమే.చనిపోయిన వ్యక్తి చేసిన కర్మలను బట్టి కర్మ ఫలం అనుభవించాల్సిందే. గరుడ పురాణం ప్రేత కాండంలో ఏ కర్మలు చేస్తే ప్రతిఫలం ఏమిటి,శిక్షలు ఏవి అనేది చాలా క్లియర్ గా చెప్పబడింది.
వైకుంఠం కానీ, కైలాసం కానీ అంత సులభంగా దొరికితే ఇన్ని పూజలెందుకు? ఇన్ని యజ్ఞ యాగాలు ఎందుకు?జప తపాలెందుకు? ఇన్ని యాత్రలు ఎందుకు?.
No comments:
Post a Comment