Wednesday, September 4, 2024

 కేంద్ర హోమ్‌మంత్రి మౌనం? కారణం?? 
=====================

గత కొన్ని వారాలుగా హోంమంత్రి అమిత్‌షా గారి ఉనికి అంతగా మనకెవరికీ తెలియలేదు. అతను మౌనంగా ఎందుకున్నారని మనం ఆశ్చర్యపోతుంటే.. అతను నిశ్శబ్దంగా జమ్మూకాశ్మీర్‌లో క్రింది చర్యలను అమల్లోకి తెచ్చాడు..

అవేంటో చూద్దాం..  

1. 5 లక్షల హిందూ-సిక్కు కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ స్థిరనివాసాన్ని జారీ చేసింది కేంద్ర హోమ్‌శాఖ.

2. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీతో సహా.. మాజీ ముఖ్యమంత్రులందరి నివాసాల వద్ద నుండి.. ప్రభుత్వ వాహనాలు మరియు ఇతర అన్ని ప్రభుత్వ సౌకర్యాలు ఉపసంహరించబడ్డాయి.

3. జమ్మూకాశ్మీర్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నేరుగా కేంద్రప్రభుత్వం నియంత్రణలోకి తీసుకురాబడ్డాయి. ఈ అన్ని విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలు కాశ్మీర్-సెంట్రిక్‌గా ఉండవు. NEP, అంటే కొత్త విద్యా విధానం ప్రకారం సవరించబడతాయి/నిర్ణయించబడతాయి. 

4. ఇప్పటివరకు హిందూ దేవాలయాలు జమ్మూకాశ్మీర్ రాష్ట్రప్రభుత్వ  పుణ్యక్షేత్రాల బోర్డుచే నియంత్రించబడ్డాయి. ఇప్పుడు ఈ బోర్డులన్నీ నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. జమ్మూ కాశ్మీర్ వక్ఫ్ బోర్డు (ఔకాఫ్) కూడా న్యూఢిల్లీ నియంత్రణ క్రిందికి తీసుకురాబడింది. ఇప్పటివరకు కాశ్మీరీ ముస్లింలు, నియాజ్‌లచే నిర్మించబడిన అన్ని ఆస్తులు కూడా న్యూఢిల్లీ స్వాధీనం చేసుకుంది.

5. కాశ్మీరీ హిందువుల నుండి స్థానికి ముస్లింలు బలవంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల నుండి వారిని తొలగించే హక్కును న్యూ ఢిల్లీ స్థానిక అడ్మినిస్ట్రేషన్‌కి ఇచ్చింది. కావాలంటే ఆ సేల్ డీడ్ లను రద్దు చేసుకోవచ్చు. అంటే, కాశ్మీరీ హిందువుల నుండి అతితక్కువ ధరలకు సేకరించిన/ఆక్రమించిన భూముల రిజిస్ట్రేషన్‌ను ఇప్పుడు రద్దు చేయవచ్చు మరియు ఆ ఆస్తిని తిరిగి కాశ్మీరీ హిందువులకు అప్పగించఒచ్చు.

6. గోల్ఫ్ కోర్సులు, అటవీ భూములు మరియు అన్ని పర్యాటక అభివృద్ధి సంస్థలు నేరుగా న్యూఢిల్లీ నియంత్రణలోకి తీసుకురాబడ్డాయి. భూమి లేదా ఇతర సౌకర్యాలను భారతదేశం లోని ఎవరికైనా కేటాయించఒచ్చు, లీజుకు ఇవ్వఒచ్చు.  

7. వారెంట్ ఆఫ్ ప్రిసీడెన్స్‌లో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి స్థానం 7 నుండి 15 కి తగ్గించబడింది. 

8. యూనివర్సిటీ బోర్డులు లేదా వక్ఫ్ బోర్డులకు నామినేషన్లు చేసే అధికారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి నుండి తొలగించబడింది.

9. కాశ్మీరీ IAS అధికారులందరూ ప్రాముఖ్యత అంతగా లేని పోస్టులలో నియమించబడ్డారు. అయితే స్థానికేతర IAS అధికారులు జమ్మూ నుండి పరిపాలనను కొనసాగించొచ్చు. 

10. కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న వేలాది కెనాల్ ల్యాండ్ బ్యాంక్‌లు "పెట్టుబడి మరియు పరిశ్రమల" ఏర్పాటు కోసం రాష్ట్రేతరులకు కేటాయించడానికి గుర్తించబడ్డాయి.

అంటే.. జమ్మూకాశ్మీర్లో ఎవరు ముఖ్యమంత్రి ఐనా.. ఒక పంచాయతీ బోర్డ్ మెంబర్‌కు ఉండే అధికారాలు కూడా ఉండవన్నమాట. నియంత్రణ అంతా న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానిదే. కేంద్రానికి తెలియకుండా, కేంద్రం అనుమతి లేకుండా.. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒంటేలుక్కూడా పోలేడు..!🚩🚩🚩సత్యమేవ జయతే 🌹🌹🌹

No comments:

Post a Comment