Wednesday, September 18, 2024

 *హిందువూ నేనెవరిని?*

 *లెక్కలేనన్ని సంవత్సరాల చరిత్ర గల సంస్కృతికి వారసుడిని  అయిన నేను హిందువుని...!?*

*నా ధర్మంపై అవగాహనా, తెలుసుకోవాలన్న తపనా రెండూ లేని వాడిని  నేను… కాస్తంత వినసొంపుగా చెబితే, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాను అయిన నేను హిందువుని*

*… ఎవరైనా ఇట్టే సొమ్ము చేసుకోకోగలిగిన బద్దకం, అసమర్థత, అశక్తతలున్నవాడిని … అయిన నేను హిందువుని....*

 *సినిమాలలో ఏది చూపెడితే, అదే నా సంస్కృతి అని నమ్మేవాడిని … అయిన నేను హిందువుని....*

*ఐశ్వర్యం తాండవించే ఆలయంలో ప్రసాదాన్ని కొనుక్కోవలసిన దరిద్రాన్ని అనుభవించేవాడిని నేను…అయిన నేను హిందువుని*

 *క్రీస్తు పూర్వాలు, క్రీశ్తు శకాలే కానీ శాలివాహన శకం అర్థంకాని నేను…అయిన నేను హిందువుని*

 *పురాతనాలయాలలోని విగ్రహాలను విదేశాలకు మళ్ళిస్తుంటే, ‘నాకేంటీ?’ అని మీనమేషాలు లెక్కిస్తుంటాను నేను… అయిన నేను హిందువుని*

*రాజకీయ శక్తులు నా మతం విశ్వాసం పేరిట ఒక్కక్క గుళ్ళు గోఫురాల స్థలాన్ని కూల్చి తమ పబ్బం గడుపుకున్న పాపానికి, చెరగని కళంకం ఆపాదించబడినవాడిని నేను…  అయిన నేను హిందువుని*

 *రోమన్ మృతవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రేమికుల పండుగగా జరుపుకోవాలని తెలిసినా – గురు పౌర్ణమి, మహాలయ పక్షాల వంటి విషయాలు పట్టనివాణ్ణి నేను…అయిన నేను హిందువుని*

 *నా దేవాలయాలలోని ధర్మాధికార పదవులు ‘రాజకీయ కుక్క బిస్కెట్లు’ అన్న నిజానికి ముఖం చాటేస్తూ తిరుగుతుంటాను నేను…అయిన నేను హిందువుని*

 *ఆయన ఏడుకొండలవాడు కాదు, రెండు కొండలవాడే అని చెబితే ‘నమ్మి ఊరకుంటాడు’ అని తలపించే వాడిని నేను…అయిన నేను హిందువుని*

 *చదువులతల్లి నెలవులో – ఏ మాంసం తినాలో ఏ మాంసం తినకూడదోనన్న మీమాంశలో సతమతమవుటూ ఉండే భావిభారత పౌరుణ్ణి నేను…అయిన నేను హిందువుని*

 *ఎందరినో ఊచకోత కోసిన టిప్పూసుల్తాన్ కత్తి మీద చూపినంతగా – శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ వంటి వారు కట్టించిన గోపురాల మీద ఆసక్తి కనబరచను నేను…అయిన నేను హిందువుని*

 *హుండీలలో సొమ్ము చేసుకొన్న భక్తిని దేనికి వాడుతున్నారో తెలుపమని ప్రశ్నించడం చేతకానివాడిని నేను…అయిన నేను హిందువుని*

 *వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలోనిదైతేనేమి, ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని  గోపురమైతేనేమి? కూలిపోయినా నిమ్మకు నీరెక్కనట్టుండే వాడిని నేను…అయిన నేను హిందువుని*

*అధిక సంఖ్యాక వర్గానికి చెందిన అల్ప జీవిని నేను…అయిన నేను హిందువుని*

  🚩 *జై శ్రీరామ్  జై జైశ్రీరామ్* 🚩

No comments:

Post a Comment