Friday, September 6, 2024




నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడన్న వార్తతో ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేశారు. ఎన్నో చిత్రహింసలకు గురిచేశారు. నేతాజీ నీ దగ్గర్నుంచి చూసిన నీరా ఆర్యను మాత్రం అండమాన్ నికోబార్లోని కాలాపానీ జైలుకు పంపించారు.

నిరా ఆర్య కాళ్ళకూ చేతులకూ బలమైన ఇనుప గొలుసులు తగిలించారు. కాలా పానీ జైలు అత్యంత చీకటిని కలిగి ఉండేది. ఇరుకు గదులు. ఒక ఖైదీ ఇంకో ఖైదీతో మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. ఎవరైనా సాహసంతో జైలు గోడలుదాటి బయటపడ్డ......... చుట్టూ ఉప్పునీటి సముద్రం...దాంట్లోకి దూకిన...... సముద్ర జీవులకు ఆహారం కావాల్సిందే. ఒకవేళ వాటి నుంచి తప్పించుకున్న ఆ ఉప్పునీటిలో ఈదలేక శవమై తేలాల్సింది..

ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం అయినా ఝాన్సీ లక్ష్మీబాయ్ రెజిమెంట్లో శిక్షణ తీసుకుని కీలక బాధ్యతలు నిర్వర్తించిన నీరా ఆర్యకు ఈ కాలాపానీ జైలు వాతావరణం ఏమీ భయాన్ని కలిగించలేదు. గుండెల నిండా దేశభక్తిని నింపుకుని ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ ఆమెకు చూపించిన జైలు గదిలోకి ప్రవేశించింది.ఆ జైల్లోకి అడుగుపెట్టడం అంటే నరకకూపంలోకి అడుగు పెట్టినట్లు ఉంటుంది 

నీరా ఆర్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగత్ జిల్లా లోని khekada అనే నగరంలో 1902లో జన్మించింది. పుట్టుకతోనే ఆమెది సంపన్న కుటుంబం. తండ్రి వ్యాపారరీత్యా కలకత్తాలో స్థిరపడ్డాడు.

ఆమె చిన్నప్పట్నుంచి తెలివైనది. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేది. బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో.... భరతమాత దాస్య శృంఖలాలను తెంచాలనే ఆలోచనతో...... నరనరాన దేశభక్తి ని నింపుకొని ఉండేది.

బ్రిటీష్ ప్రభుత్వంలో పని చేస్తున్న సిఐడి పోలీస్ ఇన్స్పెక్టర్ అయినా శ్రీకాంత్ జోయ రంజన్ దాస్ తో వివాహం జరిగింది . బ్రిటీష్ ప్రభుత్వం శ్రీకాంత్ కు నేతాజీ కదలికలను గుర్తించడం వీలైతే నేతాజీని హతమార్చే పనిని అప్పజెప్పింది.

ఒకరోజు నేతాజీ డ్రైవర్తో కారులో వెళ్తున్నాడు. ఆ వార్త తెలుసుకున్న శ్రీకాంత్ దాస్ వెంటనే తుపాకీని నేతాజీ వైపుకు గురిపెట్టి కాల్చాడు. తృటిలో ప్రమాదం తప్పింది. ఆ గుండు డ్రైవర్కు తాకింది. శ్రీకాంత్ దాస్ నేతాజీని అనుసరిస్తున్నాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి నీరా ఆర్య పెద్ద సాహసమే చేసింది.

భరతమాత సంకెళ్లు తెంపడానికి భారతీయులంతా ప్రయత్నిస్తుంటే.... తన భర్త లాంటి మూర్ఖులు ఇక్కడే పుట్టి కూడా బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చే అధికారానికి హోదాకు ఆశపడి తోటి భారతీయుల్ని చంపుతున్నారు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో భర్త అయిన శ్రీకాంత్ దాసు గుండెలను చీల్చిన వీరవనిత నీరా ఆర్య.ఆ విధంగా ఆమె తన దేశభక్తిని చాటుకుంది. తర్వాత నీరా ఆర్య నాగిని అనే మారుపేరుతో స్వాతంత్య్రోద్యమ కార్యకలాపాలను నిర్వహించింది.

ఆ చీకటి గదిలో మగ్గుతున్న నీరా ఆర్య దగ్గరకు బకం జు ఒక జైలు ఉద్యోగి వచ్చాడు.

రోజుకో రకమైన చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమెకు ఈరోజు ఏ నరకమో...... మౌనంగా...... నీరా ఆర్య కాళ్లకు చేతులకు కట్టిన బరువైన గొలుసులను లాగుతూ ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తోంది. అలా కొన్ని గదులు దాటాక జైలర్ పక్క గది ఖాళీ ప్రదేశంలో ఆగింది.ఒక అధికారి పెద్ద సుత్తి, గొలుసులను తొలగించడానికి మరో పరికరాన్ని తెచ్చాడు.

"నీ సంకెళ్లను తొలగిస్తా" అంటూ.... వాడు గొలుసులతో పాటు నీరా ఆర్య చర్మాన్ని కూడా కోస్తున్నాడు. చేతిమీద రంపపుకోతను తట్టుకోలేక బాధతో విలవిల్లాడింది. చేతుల నుండి రక్తం ధారాపాతంగా కారుతున్నది. కొంత లోతు వరకు కోసి ఆపాడు. క్రమంగా కాళ్ల దగ్గరకు వచ్చి "సంకెళ్లు బద్దలు చేస్తా" అంటూ..... కాలివేళ్లపై సుత్తి తో

కొడుతున్నాడు.వేలు చిట్లి రక్తం చిమ్మింది. "ఏంటి నువ్వు చేసే పని" అంటూ అరిచింది నీరా ఆర్య. దానికి వాడు.....

"ఎక్కడైనా కొడతాను... ఏమైనా చేస్తాను.....నీ వక్షస్థలంపై కూడా కొడతాను" అన్నాడు. నీరా ఆర్య ప్రతిఘటించింది. వాడు ఇంకొంచెం క్రూరంగా ప్రవర్తించాడు.

చివరకు నీరా ఆర్య వాడి ముఖాన ఉమ్మి వేసింది. దానితో వాడు గట్టిగా అరుస్తూ..... సుత్తితో కాలి మీద బలంగా మోదాడు.

ఆ అరుపులకు జైలర్ తన గదిలోంచి బయటికి వచ్చాడు. "ఇన్ని బాధలు ఎందుకు పడతావు బ్రిటీష్ రాణిని శరణు కోరుకో నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు. నువ్వు ఈ చెరనుండి విముక్తురాలు అవుతావు" అన్నాడు.

"నా దేశానికొచ్చి మమ్మల్ని బానిసలుగా మార్చిన మిమ్ముల్ని శరణు అనను. అంతకంటే నేను నా ప్రాణాలను తృణప్రాయంగా వదిలివేస్తాను" అని ధీటుగా సమాధానం చెప్పింది  నీరా ఆర్య

ఇక నేతాజీ సంగతంటావా .......

బయట ఉన్న నీకు ఎంత తెలుసో...... జైల్లో ఉన్నా నాకు కూడా అంతే తెలుసు......అన్నది.

"లేదు నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేతాజీని దగ్గర్నుంచి చూసిన దానివి. ఆయన ప్రతి విషయం నీకు తెలిసే ఉంటుంది" అని గద్దిస్తున్నాడు జైలర్.
కాళ్ల నుండి చేతుల నుండి రక్తం ఏరులై పారుతుంది. వాడు నీరా ఆర్య పొట్టపై కాలుపెట్టి

కర్కశంగా తొక్కుతున్నాడు. అప్పుడు నీరా ఆర్య......

"ఆ తెలుసు" అన్నది.

జైలరు ఉత్సాహంతో " ఎక్కడ ?"అని వెర్రిగా అరుస్తున్నాడు. "నా గుండెల్లో" కటువుగా సమాధానం చెప్పింది నీరా ఆర్య. "ఓహో! అలాగా అయితే ఆ గుండెల్ని చీల్చి చూస్తాను. ఉంటే బంధించి తీసుకుపోతాను" అని కోపంతో ఊగిపోయాడు.

పక్కనే ఉన్న జైలు అధికారులతో జైలర్.....

"ఆమె గుండెలు చీల్చి ఆ నేతాజీని బయటికి రప్పించండి" అన్నాడు. కొంత మంది పనివాళ్లు ఇనుప చిమిటి లాంటి పరికరాన్ని తెచ్చారు.

నిరా ఆర్య చీరకొంగును తీసేశారు. జాకెట్ తొలగించారు. వక్షస్థలంపై ఆయుధా నుంచి కుడి రొమ్మును కోయటం ప్రారంభించారు. పాణం కొద్దికొద్దిగా పోతున్నట్టుంది. రక్తం కాలువలా ప్రవహిస్తుంది. నీరా ఆర్య బాధతో అరుస్తుంది. కాళ్ళూ చేతులూ కొట్టుకుంటుంది.దేహమంతా రక్తసిక్తమైంది. క్రమంగా కళ్ళు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. తర్వాత రెండు మూడు రోజులకు కానీ నీరా ఆర్య స్పృహలోకి రాలేదు.

అన్నీ చిత్రహింసలు అనుభవించిన..... నేతాజీ గురించి ఏ ఒక్క విషయం బయటికి రప్పించలేకపోయారు జైలు అధికారులు ఆమె నుండి....... ఇలా ఎన్నో చిత్ర హింసలు అనుభవించి చివరకు జైలు నుండి విడుదల అయ్యింది. భారత దేశ స్వాతంత్య్రం అనంతరం కూడా ఆమె అజ్ఞాతంగానే ఉంది . ప్రాణం పోతున్నా..... దేశభక్తిని చాటిన వీర వనిత నీరా ఆర్య.. నీకు జోహార్లు జోహార్లు జోహార్లు.......
🙏🙏🙏🙏

No comments:

Post a Comment