Thursday, September 5, 2024

 ఏది ముఖ్యం  ?!
.....
తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గక పోగా మరింత ఎక్కువై వూరిని ముంచేస్తుంది .
అప్పటికే అయిదు రోజులు దాటిపోయింది. అరచి మొరపెట్టుకున్నా ఆదరించే వారు కరువైపోయారు .
అప్పటికే వాగులు వరదలకు మా వూరంతా పొంగే నదులను తలపిస్తోంది .
గ్రామంలోని అపార్ట్ మెంట్లు అన్నీ క్రింద గల ఇండ్కన్ని నిండుకుని పై అంతస్తులను తాకుతున్నాయి .
అందుకే నేను పిల్లా పాపలతో మా పై ప్లోర్ లోకి వెళ్ళిపోయాను.
పైకి వెళ్ళేటప్పుడు ఇంట్లో బీరువాలో ఉన్న రెండు కిలోల బంగారు నగలతో పాటు ఇంట్లోనే దాచి పెట్టుకున్న కోటి రూపాయలు పైగా ఉన్న సూట్ కేస్ ని మరికొన్ని బాండ్స్ వగైరాలన్నీ పైకీ పట్టుకెల్లాను.
మమ్మల్ని ఆదుకునేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారులు గూడా ఆదుకోలేక పోతున్నారు.
తూఫాన్ ప్రభావం భయంకరంగా ఉంది. 
ఈదురు గాలులు.
చెట్లు గట్లు , పశువులు ,మామూలు గుడిసెలు , కార్లు బండ్లు అన్నీ అప్పటికే నేల తుడుచుకు పోయాయి.
వూరు సముద్రాన్ని తలపిస్తోంది.
పైనుండి చూస్తూ ఉన్నాను. గ్రామం అంతా క్రింద అపార్ట్ మెంట్లు అన్నీ నిండుకుని నీరు ప్రవహిస్తోంది .
ఆ తూఫాన్ తగ్గెలోగే మళ్ళీ మరొక తూఫాన్ మొదలైంది.
అప్పటికే వారం రోజులు.
ఎడతెరపి లేకుండానే వర్షం దారలై కురుస్తోంది.
కళ్ళముందు కదలాడుతున్న నీళ్లు ఎన్ని ఉన్నా తాగేందుకు పనికొచ్చేలా లేవు.
వరదల్లో ఎందరివో ఆర్తనాదాలు , భయంకర శబ్ద తరంగాలు.
మెల్ల మెల్లగా మా ఇంటి కృంది భాగం పూర్తిగా నిండుకుని మేమున్న అపార్ట్ మెంట్ ని తాకుతున్నాయి .
మరి కాసేపట్లో మేము గూడా అందులో కొట్టుకు పోయే సమయం ఆసన్నమైంది .
నా చేతిలో మాత్రం పెద్ద డబ్బు సంచి , మరియు నగల బ్యాగ్ అవి నీటిలో కొట్టుకు పోకుండా జాగ్రత్తగా బిగ్గరగా పట్టుకుని ఉన్నాను.
కానీ కడుపులో ఏమీ లేదు.
వారం రోజులుగా తిండి లేదు ,
ఆకలి నా శరీరాన్ని దహించి వేస్తుంది.
అలాగే మా ఫ్యామిలీ .
ఆకలికి అలమటించి పోతున్నాము.
ఇంకా ఇంకా ఇంకా.
ఆకలి తీరే మార్గం కనిపించడం లేదు.
చేతినిండా డబ్బు నగలు. వున్నాయి. కానీ వాటిని తినలేము గదా ,.
అమ్ముకుందామన్నా  అది సమయం కాదుగా ,
ఏమీ చేయాలో అర్దం గావడం లేదు.
సచ్చిపోబోతున్నామా ,
మా ఘోష ఎవరికీ అర్దం గాదు.
దగ్గర ఎంతో విలువైన బంగారం , డబ్బు ఉంది.
అవి ఎవరికైనా ఇచ్చి అన్నం కొనుకుందామన్నా ఊహు ,
పరిస్తితి విషమించిన వేల ,
అది చావుబ్రతుకుల సమయం .
చేతిలొ ఎంత డబ్బు ఉంటే ఏమి లాభం. ఆకలి తీరే మార్గం లేదు.
ఆకలి తీరకపోతే బ్రతికే మార్గం లేదు.
ఆ సమయంలో తాము చనిపోతే ఈ డబ్బు నగలు ఎవరి పాలు, అనే మీమాంస .
ఇక రాను రానూ మరింత దిగజారుతున్న ఓపిక.
శక్తి తగ్గిపోయి ఒంట్లో అలసట ఎక్కువై పోతోంది.
ఇక నిలబడే ఓపిక గూడా లేకపోతుంది.
అప్పటీకే పిల్లలు నా భార్య నేలకు వొరిగి చావు బ్రతుకులతో పోరాటం చేస్తున్నారు. ఎవరికీ చెప్పే మార్గం గానీ , హెల్ప్ అడిగే పరిస్తితి గానీ లేకపోయింది.
మెల్ల మెల్లగా నీరు పైకి చేరుతోంది. ఇక ఎలాగూ తాము బ్రతికే పరిస్తితి ఉన్నట్టు కనిపించడం లేదు.
ఏమీ చేయలేని స్థితి.
ఒక్కసారి నేనూ నాభార్య మా చేతిలో పట్టుకున్న కోట్ల విలువైన డబ్బు సంపద వైపు చూస్తూ ఉన్నాము.
అప్పుడు అనిపిస్తోంది మాకు , " చేతిలో మోయలేని డబ్బు ,!!
కడుపుకు మేయలేని అన్నం !
మనిషి బ్రతుకాలంటే ఆహారం ముఖ్యం .
ఎంత కష్టపడి కోట్లు సంపాదించినా కడుపుకు పిరికెడు అన్నం లేకపోతే, ఆ డబ్బు ధనం మనిషిని బ్రతికించ గలవా , ఈ డబ్బే గదా మనిషిని పశువుగా మార్చేది ?
ఈ డబ్బే గదా మనుషుల మధ్య వైషమ్యాలు పెంచేది.
ఈ డబ్బే గదా అయినవారిని విడగొడుతుంది .
ఎన్ని కోట్లు ఉన్నా పిరికెడు మెతుకులే విలువైనవి గదా ,
కోట్లాది సంపద వేటకు వెళ్ళినా మధ్యలో ఆహారం కోసం నిరీక్షణ తప్పదు గదా ,
మరీ అలాంటి ఆహారాన్ని అందించేది, అందించి బ్రతికించేది రైతే గదా ,
ఆ రైతే లేకపోతే ,
ఇలా ఏదేదో ఆలోచనలు నాలో సుడిగుండాలుగా తిరుగుతూ ఉండగా , ఇంతలో ఊహించని విధంగా రెండు ఆహార పొట్లాలు వచ్చి మా ముందు పడిపోయాయి.
ఆశ్చర్యం.
నేను అటు ఇటూ చూసే లోపుగానే మా వైపు ఆహార పాకెట్స్ విసిరి వేసిన ఆ రిమోట్ రోబో మరో వైపు వేగాంగా వెళ్ళిపోతోంది.
అంతే బిత్తరగా చూస్తూ ఉన్న మాకు ఆ ఆహారపాకెట్స్ గూడా మా పైదాకా వచ్చేసిన నీటిలో కొట్టుకు పోసాగాయి.
వాటిని అందుకోబోయే ముందు లోపుగానే నారెండు చేతులలో ఉన్న కోట్లాది విలువైన సంపద కనిపించింది.
అటు వైపేమో ఆహార పొట్లాలు నీటిలో కొట్టుకు పోతున్నాయి. ఇటు వైపేమో సంపద... కనిపిస్తు ఉంది. చేతిలోని డబ్బు మూటలు వదిలితేనే ఆ ఆహార పాకెట్స్ లభిస్తాయి. లేకపోతే అవి నీటిలో వెళ్లిపోతాయి.
కానీ ఆసమయంలో డబ్బా, ఆహారమా ముఖ్యం . ఇక 
ఏమాత్రం ఆలస్యం అయినా ఆహార పాకెట్స్ కొట్టుకు పోవడం ఖాయం.
అంతే వెంటనే చేతులలో ఉన్న డబ్బు మూటలు వదిలేసి వెంటనే ఆ ఆహార పొట్లాలను అందుకున్నాను .
అలా చూస్తూ వుండగానే స్వార్థంతో ఎందరెందరినో దోచుకుని సంపాదించుకున్న విలువైన నగలు డబ్బు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
కానీ బ్రతికించే ఏదో ఒక ఆశ మదిని తట్టి ఊపిరి పోసుకుంది అనే బరోసా నన్ను ఆనందింప చేసింది.
అప్పుడు అనిపించింది నాకు.
ఏ మనిషికి అయినా ఉందేటంతే ఉండాలి.
అది గూడా ఎంత సంపాదించినా అంటినంతే అంటుతుంది అనీ. 🙏

No comments:

Post a Comment