[11/25, 08:59] +91 94945 49969: మనః భావం కడా
మనో భావం
మనసస్సులో
లేదా మెదడులో
వేళ్ళూనుకుని
బలంగా పాతుకుపోయిన
ఒకానొక నమ్మకం విశ్వాసం లేదా భావం
*********
ఊహ
తెలిసిన నాటి నుండీ
అమ్మా...
నాన్నల నుండీ
మామ్మా తాతల నుండీ
రక్త సంబంధీకులు
ఇరుగు పొరుగు నుండీ
ఉపాధ్యాయులు సమవయస్కుల నుండీ
చూసిన సంఘటనలూ
తానూ భాగమైపోయిన సన్నివేసాలూ
చదివిన సాహిత్యం చూసిన కళల నుండీ
మనకు తెలియకుండానే
అప్రయత్నంగానే అనివార్యంగానే
సంక్రమించేస్తాయి నిలువెల్లా ఆవహించేస్తాయి
ఈ మనోభావాలు
*********
మనదైన
మనోభావాలకు
పూర్తిగ భిన్నమైన భావాలను
విన్నప్పుడూ కన్నప్పుడూ
భిత్తరపోయి బెంబేలు పడిపోవడం
సహజాతి సహజం
అవి అసత్యమనీ
పూర్తిగా అవి అవాస్తవమనీ
మనని మనమే నమ్మించుకోవడమూ సహజమే
*********
మన నమ్మకాలలోని
అమానవీయతను మానవీయత అనీ
సంకుచిత్వాన్నేమో విశ్వజనీనత అనీ
మనవైన విశ్వాసాల్లోని
అశాస్త్రీయతను శాస్త్రీయత అనీ
అజ్ఞానాన్నేమో జ్ఞానం అనీ
మనవే అయిన
సంప్రదాయాలు ఆచారాలు
కట్టుబాట్లు ధర్మాలలోని మూఢత్వాన్ని
వైజ్ఞానికత అనీ
భ్రమ పడడం
ఇతరులను భ్రమ పెట్టడం
అలా నిరూపించాలని నమ్మించాలనీ
తంటాలు పడడమూ సహజమే
మనోవైజ్ఞానిక పరిభాషలో
ఈ మానసిక భౌతిక చర్యల సమ్మేళనాన్నే
రక్షక తంత్రాలు అని అంటారు
********
అదేం చిత్రమో
వివేకం విచక్షణ సంయమనం
ఉన్నవారెవరికీ ఉండవు ఈ మనోభావాలు
అవి ఇసుమంతైనా లేనివారికే
పదే పదే గాయపడిపోతుంటాయీ మనోభావాలు
దేవుడు ఉన్నాడు
అని విశ్వసించేవారితోనూ
ప్రచారం చేసే వారి కారణంగానూ
మా మనోభావాలు గాయపడిపోయాయని
ఏ నాస్తికుడూ మరే తార్కికుడూ హేతువాదీ
ఎప్పుడూ ఎక్కడా గగ్గోలు పెట్టడు
దానికి పూర్తి భిన్నంగా
మతం పేరుతో జరిగే దోపిడీనీ పీడనని ఆణచివేతనూ
భక్తి పేరిట జరిగే కపటం వంచన మోసం ద్రోహాలనూ
దేవుడి పేరుతో విస్తరించే అశాస్త్రీయతా అమానవీయతా సంకుచిత్వాలనూ
ఆథ్యాత్మికత నెపంతో వెదజల్లే మానసిక మాదకద్రవ్యాలనూ బానిస భావజాలాలు నూ
భౌతిక వాదులు ప్రశ్నించినపుడు మాత్రం
అమాయక భక్తుల మనోభావాలు
తీవ్రాతి తీవ్రంగానే గాయపడిపోతాయి మరి
*********
సంయమనంతో
వినడమూ
వివేకం విచక్షణతో
ఆలోచించడమూ
హేతుబద్ధంగా తార్కికంగా
విశ్లేషించడమూ
సాధనతో
అలవరచుకున్నప్పుడు మాత్రమే
మనోభావం
గాయపడడం అనే ఈ రుగ్మత నుండి
బయటపడగలం
ఆ అంటు జాడ్యం
నుండి ప్రయత్నపూర్వకంగానే
బయట పడగలిగినప్పుడు మాత్రమే
అభివృద్ధీ పురోగమనం సుసాధ్యమౌతుంది
- రత్నాజేయ్ (పెద్దాపురం)
[11/25, 09:49] +91 94900 99167: బాగుంది. అయితే, సాధారణ, సామాన్య, అమాయక భక్తులు కొత్త విషయం తెలిసినప్పుడు మనోభావాలను గాయపర్చుకోరు. గగ్గోలు పెట్టరు. మనోభావాలు పేరిట ద్వేషాన్ని రగిల్చేవాళ్ళు, ప్రజల అమాయకతని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపాలని పథకం ప్రకారం ప్రశ్నను, వివేకాన్ని చంపేవాళ్ళు మాత్రమే మనోభావాలు గాయపడటం పేరిట ఉద్వేగాలను, ఉద్రేకాలను పండిస్తారు. సాధారణ ప్రజలు సహజంగా దైనందిన జీవితంలోని ఆచరణకు బద్దులుగా ఉంటారు.
No comments:
Post a Comment