🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 61
శ్లో॥ నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తి రుపజాయతే | ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగినీ ॥
మూడునికి "నిర్వృత్తి" వృత్తిరాహిత్యం కూడా శ్రమకలిగించే కర్మే అనిపిస్తుంది. జ్ఞానికి కర్మలు కూడా శాంతాన్నే కలిగిస్తాయి.
కర్మ, ఆకర్మ.----సుఖంగా జీవిచండం కోసం ఐశ్వర్యాన్ని సంపాదించే ప్రయత్నమూ, సర్వాన్నీ విసర్జించి సన్యాసిగా జీవించడమూ రెండూ కూడా శారీరిక కదలికమీదా విశ్రాంతిమీదా ఆధారపడి ఉండవు. ఈ రెండూకూడా ఆహం-కారం మీదా అదికోరే కోరికలమీదా ఆధారపడి ఉంటాయి. నేను కర్తనని కానీ, భోక్తనని కానీ అనుకున్నప్పుడే కర్మలు శ్రమతో కూడినవిగా అశాంతి నిచ్చేవిగా అనిపిస్తాయి. ఈ భ్రమాజన్యభావాలు నశించిన జ్ఞాని కర్మలను సమర్థవంతంగా సంతోషంగా నిర్వర్తించగలుగుతాడు. సహజంగా ఆ విధంగా కర్మల నాచరించ డంలోనే జ్ఞానికి కర్మ ఫలత్యాగమయిన పరమ శాంతి లభిస్తుంది. సామాన్యు అందరికీ నిర్వృత్తిలో, మనస్సు అంతర్ముఖం అవుతున్నకొద్దీ శాంతి లభిస్తూ, బాహ్యాభిముఖమయిన కొలది (ప్రవృత్తి) అశాంతి అధికమవుతూ ఉంటుంది.
తెలివిహీనుడు ఆహంకారంతో ధ్యానాన్నభ్యసిస్తూ సర్వకర్మలనూ విసర్జించి గంగాతీరంలో ఏకాంతంగా జపతపాదుల నాచరిస్తున్నా అతని అంత రంగం అశాంతితో ఉండే ఉంటుంది. కోరికే అశాంతికి పుట్టినిల్లు. జీవన్ముక్తుడు ఊపిరి సలపని కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ అహంకారవర్ణితుడు కావడంతో సదా శాంతంగా ఆనందంగా ఉంటూ మానవాళిని సేవిస్తూ వారికి మార్గదర్శకంగా ఉండగలుగుతాడు. నిజానికి మార్గమూ గమ్యమూ కూడా అతడే.🙏🙏🙏
No comments:
Post a Comment