Wednesday, November 26, 2025

 [11/20, 19:07] +91 94918 93164: ```
ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…```


          *నా ప్రథమ దర్శనం:*
               ➖➖➖✍️```
-శ్రీ శ్రీ జయేంద్రసరస్వతీస్వామి.

(శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి ఆరాధన దినోత్సవ సందర్భంగా)

నేను విల్లుపురం పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, ఆచార్య స్వామివారు కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయ కుంభాభిషేకానికి వెళుతున్నారు. 

అప్పుడే నేను వారిని మొదటిసారిగా దర్శించడం.
 “ప్రతి కుటుంబం నుండి కనీసం ఒక్క పిల్లవాడైనా వేదం చదవాలి” అని అన్నారు. అందుకే, నా తల్లితండ్రులు స్వామివారితో,    “నా కుమారునికి ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చింది, ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసి, వేదాధ్యయనానికి తయారు చెయ్యవలసింది” అని ప్రార్థించారు.

వెంటనే ఆచార్య స్వాములవారు, “కాంచీపురంలో శ్రీ కామాక్షి అమ్మవారి కుంభాభిషేకం జరగబోతోంది. ఉపనయనం చేసి ఈ పిల్లవాడిని అక్కడకు తీసుకునిరండి. అక్కడే ఈ పిల్లవాడికి వేద విద్య బోధన ప్రారంభిద్దాము”  అని ఆశీస్సులను అందించారు. 
ఇదే మొదటి దర్శనం.

శ్రీ కామాక్షి అమ్మవారి కుంభాభిషేకం అయిపోయింది. తరువాత ఒక మంచి రోజున, అమ్మవారి సన్నిధిలోనే, శ్రీ మహాస్వామి వారు తమ పూర్వాశ్రమ తమ్ముడైన శ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారి ద్వారా వేద పాఠాలను మొదలుపెట్టారు.

తరువాత వారు నన్ను ‘తిరువిడైమరదూర్’ కు పంపారు. మార్గమధ్యంలో చిదంబరంలోని నటరాజ స్వామి దర్శనం చేసుకుని నా గురువు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారితో కలిసి తిరువిడైమరదూర్ చేరుకున్నాను.  నా తల్లితండ్రులు విల్లుపురంలోనే ఉండిపోయారు.

నాకు పదమూడు సంవత్సరముల వయస్సు వచ్చేదాకా తిరువిడైమరదూర్ లో వేదం చదువుకున్నాను. కాంచీపురం యాత్ర తరువాత ఆచార్య స్వాములవారు తిరువిడైమరదూర్ కు వచ్చారు. అక్కడే ఒక సంవత్సర కాలంపాటు ఉన్నారు. అప్పుడే నా వేదాధ్యయనం పూర్తవుతోంది. ఆ సమయంలో స్వామివారు నా ఊరు, పేరు, అప్పటిదాకా ఏం చదువుకున్నాను అన్న విషయాలన్నీ అడిగేవారు.

ఒకరోజు స్వామివారు తిరువిడైమరదూర్ దగ్గర్లోని గోవిందాపురం వెళ్లారు. అక్కడ 
శ్రీ భోదేంద్ర సరస్వతీ స్వామివారి సమాధి ఉంది. ఆ సమాధి కాంచి పీఠం అధిరోహించిన గొప్ప సన్యాసిది. ఆచార్య స్వామివారు తరచుగా అక్కడకు వెళ్తుంటారు. నేను కూడా స్వామివారికి తోడుగా వెళ్తుండేవాణ్ణి.

అలాంటి ఒక సందర్భంలో ఆచార్య స్వామివారు అకస్మాత్తుగా అడిగారు, “నువ్వు శ్రీమఠానికి వస్తావా?”. 

“నేను ఇప్పటికే మీతో వస్తున్నాను కదా!” అని జవాబిచ్చాను.

“అలా కాదు, నువ్వు నాలాగా అవుతావా?” అని అడిగారు.

స్వామివారి మనస్సులో ఉన్న ఆలోచన అప్పుడు నాకు అర్థమయ్యింది.   “నేను నా తల్లితండ్రులను అడగాలి” అని చెప్పాను. 

వెంటనే స్వామివారు ఊరినుండి 
నా తల్లితండ్రులను పిలిపించి వారి సమ్మతిని అడిగారు.

వెంటనే నా తల్లితండ్రులు, “స్వామివారు నా కుమారుడిని వేదవిద్యకు పంపమన్నారు. మేము అంగీకరించాము. ఇప్పుడు మీరు అతణ్ణి శ్రీమఠానికి స్వామిగా నియమించాలని అనుకుంటున్నారు. మీ చిత్తం మా భాగ్యం” అని చెప్పారు.

ఆచార్య స్వామివారు విల్లుపురంలో మొదటగా నన్ను చూడగానే, ఈ పీఠానికి నన్ను తరువాతి ఆచార్యులుగా చెయ్యాలని వారి మనస్సులో ఆలోచన చేశారు అని నాకు అర్థం అయ్యింది.

నా పదునాల్గవ ఏటనే నేను శ్రీమఠంలో ప్రవేశించాలని స్వామివారు నిర్ణయించారు. కనుక నాకు శ్రీమఠంలో అవసరమైన పాఠాలను ఏర్పాటు చేశారు.
శ్రీమఠంలో పదిహేడవ సంవత్సరం వరకు నా శిక్షణ సాగింది. తరువాత స్వామివారు నన్ను ఒకరోజు పిలిచి, “సంపూర్ణ భారతదేశ యాత్ర చేసి తిరిగిరా” అని ఆదేశించారు. 
నా తల్లితండ్రులతో కలిసి భారతదేశంలోని అన్ని క్షేత్రాలు, ప్రాంతాలు రైలుమార్గం ద్వారా పర్యటించాను.

నాకు పద్దెనిమిదవ సంవత్సరం ముగియగానే, “ఇక్కడే నాతోపాటు కొంతకాలం ఉండు” అని చెప్పి, నన్ను కాంచీపురంలోనే ఉంచుకున్నారు స్వామివారు. ఇలా ఒక సంవత్సరం గడిచింది.

నాకు పంతొమ్మిదో ఏడు మొదలవగానే, స్వామివారు నన్ను కాంచీపురంలోనే సన్యాసం స్వీకరించమని చెప్పారు. 1954, మార్చి 22న సర్వతీర్థం గట్టున ఉన్న ముక్తిమండపంలో ప్రాథమిక వైదిక క్రియల తరువాత, దాదాపు ఉదయం పదిగంటలప్పుడు కొలనులోని నీటిలో నిలుచుండచేసి సన్యాస దీక్ష,        శ్రీ విశ్వేశ్వర సన్నిధిలో మహావాక్యోపదేశం చేశారు.

ఇలా పెద్ద స్వామివారితో ఉన్న     నా అనుబంధం నన్ను కాంచి మఠానికి రప్పించి, నన్ను స్వామిని చేసింది.

నా సన్యాసాశ్రమ స్వీకారం ముందు రోజు, ఆచార్య స్వామివారు కవులు, పండితులను సమావేశపరచి, నన్ను పక్కనుంచుకుని, నాకు చక్కని పేరు కోసం వారిని సంప్రదించారు.

శ్రీమఠంలో అయిదారు తరాలుగా చంద్రశేఖర, మహాదేవ అన్న పేర్లు వెంటవెంటనే వస్తున్నాయి. ఈ పేర్లతోనే ముందుకు వెళ్లాలా లేక పూర్తిగా కొత్త పేరు ఉంచాలా అన్న విషయమై ఈ సమావేశం.

నేను శ్రీమఠానికి పంగుని నెలలో వచ్చాను. తరువాత వచ్చే చిత్తిరై, వైకాసి నెలల్లో పరమాచార్య స్వామివారి జన్మదినం వస్తుంది. అంతేకాక, ఈ సంవత్సరంతో స్వామివారికీ అరవై ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సంవత్సరం పేరు జయ.
జయ నామ సంవత్సరం పంగుని నెలలోనే వస్తుంది, చాంద్రమానం ప్రకారం తెలుగు నూతన సంవత్సర ఆరంభంలో. సౌరమానం ప్రకారం పదిహేను, ఇరవై రోజులలో తమిళ సంవత్సరాది వస్తుంది. ఈ సందర్భంలో నాకు ‘జయ’ అన్న పేరు స్ఫురించింది.

జయ నామ సంవత్సరానికి మరొక్క ప్రాధాన్యత కూడా ఉంది. అది స్వామివారి జన్మ సంవత్సరం కూడా. కనుక నాకు జయ అన్న పేరుతో జయేంద్ర సరస్వతీ అన్న సన్యాస నామంతో శ్రీమఠానికి అరవైతొమ్మిదవ పీఠాధిపతిని చేశారు.
ఆరోజు తెలుగు నూతన సంవత్సరాది. వారు శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. పదిరోజులపాటు యజ్ఞాలు, పూజలు చేసి, కన్నులపండువగా శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. శ్రీమఠంలో కూడా ప్రత్యేక పూజ జరుగుతుంది. ఇప్పుడు పెద్దగా ఉన్న కంచి మఠంలో శ్రీరామ అభిషేకం జరిగే చోట నన్ను కూర్చోబెట్టారు. అభిషేక జాలం బయటకుపోయే చోట నేను కూర్చున్నాను. పెరియవా తమ స్వహస్తాలతో శ్రీరామునికి అభిషేకం చేయగానే, ఆ నీరు నా తలపై పడేటట్టు జాగ్రత్త వహించారు స్వామివారు.

ఆచార్య స్వామివారు, తమ అమృత హస్తాలతో ఆ అభిషేక జలాలను నాపై ప్రవహింపజేసిన రోజే, నన్ను శ్రీమఠానికి పీఠాధిపతిని చేసిన రోజు. నేను మఠానికి వచ్చిన పది పదిహేను రోజులలోనే, శ్రీరామ పట్టాభిషేకం అనంతరమే నాకు పట్టాభిషేకం చేశారు. ఆరోజు సాయంత్రమే నాలుగు రాజా వీధులలోనూ నన్ను ఊరేరిగింపు చేశారు. దీన్నే పట్టణ ప్రవేశం అంటారు.

మరొక్కమాటలో చెప్పాలంటే నేను ఇక్కడకు వచ్చిన పదిహేనురోజులలోనే నాకు సర్వాధికారాలు ఇచ్చారు స్వామివారు.

కాంచీపురం పెద్ద పట్టణం మరియు యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో మహాస్వామి వారు నా బసను దగ్గర్లోని పాలార్ నది ఒడ్డున ఉన్న ఒరిరుక్కై అన్న గ్రామంలో పెద్ద కుటీరాన్ని ఏర్పాటు చేయించి, రెండు భవనాలను అద్దెకు తీసుకుని నా పూజలు, చదువులు సాగేటట్టు చేశారు.
పరమాచార్య స్వామివారు అరవై సంవత్సరాలు పూర్తిచేసుకున్న సమయం. దీన్ని షష్ట్యబ్ధిపూర్తి అని అంటారు. నేను దీన్ని నిర్వహించడం నా అదృష్టం.

శ్రీవారు సన్యసించినా, స్వామివారి షష్ట్యబ్ధిపూర్తి మహోత్సవాన్ని వేదపండితుల సమక్షంలో ప్రత్యేక యజ్ఞాలతో ఎంతో వైదికంగా ఉత్సవం జరిపాము. నేను ఈ విషయం ప్రస్తావించడానికి కారణం, శ్రీరామ పట్టాభిషేకం రోజున అభిషేక జలాలను నాపై పడేటట్టు చేశారు స్వామివారు. ఈ షష్ట్యబ్ధిపూర్తి మహోత్సవంలో జలాలు నిండిన కలశాలతో పూజలు, యజ్ఞాలు చేసి ఆ పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించే భాగ్యం నాకు దొరికింది.

అలా మేము స్వామివారి అరవై సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్నాము. ఆనాటి నుండి నన్ను వారివద్దనే ఉంచుకుని జతగా చదువుకోవడం, పూజలు, మఠం నిర్వహణ మొదలైన విషయాల్లో నాకు శిక్షణనిచ్చారు. 1970 దాకా నేను పక్కనే ఉండి అన్నీ చేసేవాడిని, రాత్రుళ్లు పొద్దుపోయేదాకా.

1970 నుండి స్వామివారు దేవాలయాల్లో గాని, దేవాలయ కొలను గట్టున ఏర్పాటు చేసిన పర్ణశాలల్లో ఏకాంతంగా గడపాలని కోరుకున్నారు.

1976 తరువాత, 1980 దాకా నాలుగు సంవత్సరాల పాటు మొత్తం తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర పర్యటనలు చేశారు. 1980లో నేను వారిని సతారాలో కలిసినప్పుడు, “మీకు వయస్సు మీదపడుతోంది. మీరు ఒక్కరే ఇక యాత్రలు చెయ్యరాదని వేడుకుంటున్నాను. దయచేసి తిరిగిరండి” అని స్వామివారిని వేడుకున్నాను. 
నా కోరికను మన్నించి 1983లో స్వామివారు కాంచీపురానికి చేరుకున్నారు.


ఆ సమయంలో ఒక్కడినే నిత్య పూజలు, మఠం నిర్వహణ చూసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కనుక, స్వామివారి అనుమతితో 1983 మే 29, ఆదివారం, తెల్లవారుఝామున అయిదున్నర గంటలప్పుడు బాల పెరియవాకు శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ కోనేరులోని పవిత్ర జలాలతో సన్యాస దీక్షను ఇచ్చి, శ్రీ కామకోటి పీఠం డెబ్బైయవ పీఠాధిపతిగా పట్టం కట్టాను. బాల పెరియవా నా శిష్యుడిగా నేను కర్నూలుకు వెళ్ళి, మేము ముగ్గురము అక్కడే ఉండి, మా చాతుర్మాస్య వ్రత అనుష్టానానికి వ్యాస పూజను నిర్వహించాము. తరువాత పరమాచార్య స్వామివారిని మాతోపాటు కాంచీపురానికి తీసుకునివచ్చాము.

అప్పటి నుండి స్వామివారు శ్రీమఠంలోనే ఉంటూ వారి కరుణా కటాక్ష వీక్షణాలను, ఆశీస్సులను అందరికీ అందిస్తున్నారు. ఇతర మఠాల పీఠాధిపతులకి, పరమాచార్య స్వామివారికి పెద్ద తేడా ఉంది. పీఠంపైన పీఠాధిపతిగా కూర్చుని ఆశీస్సులని ఇవ్వడమే కాక, ఎందరో వ్యక్తుల జీవితాల్లోని ఆనందాలు, బాధలలో స్వామివారు స్వయంగా పాలుపంచుకుని వారిని అనుగ్రహించి, వారి జీవితాలను ఉన్నత స్థితికి చేర్చారు.

ఈ కారణం వల్లనే వారు భౌతికంగా లేకపోవడాన్ని ఈనాటికీ ఎందరో జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నట్టుగా చింతిస్తున్నారు.

వారు ఒక సాధారణ పీఠాధిపతి అయ్యుంటే అది వేరే విషయం. కానీ వారు కొన్ని వేలమంది జీవితాలలో కలిసిపోవడం వల్ల వారు లేని లోటు అందరినీ కలచివేసింది. దేశం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ ప్రత్యేకత వేరే ఏ పీఠాధిపతికి లేదు.

నేను వారితోనే ఉండడంవల్ల నాకు కూడా వారి స్వభావం వచ్చింది. జనంతో కలిసి, వారి సాధక బాధలను తెలుసుకుని, పీడిత జనుల జీవితాల్లో వెలుగునింపి వారికి మంచి చేయగలిగాను. ఈ పనికి నాకు నిర్దేశకులు పరమాచార్య స్వామివారే. వారు చూపిన మార్గలోనే ఇప్పటికీ నడుస్తున్నాను.

వారు ఏమి చేసినా అది వారి సంకల్పం అనేవారు. సంకల్పం అంటే మనస్సులో కలిగిన ఆలోచన అంటే ఇఛ్ఛా శక్తి. ఆ సంకల్ప మూర్తి ఇఛ్ఛా శక్తి. నేను క్రియాశక్తిగా వారి సంకల్పాలను నెరవేర్చాను. మా ఇరువురి స్థితి ఇదే.

కేవలం పీఠాధిపతిని చేయకుండా, ఈ పీఠం ప్రజల కోసం స్థాపించబడింది, సామాన్య ప్రజల కోసం. ధర్మం కోసం - ఆస్తికమ్ కోసం - ఆన్మీహమ్ కోసం మరియు వాటి ఉద్ధరణ కోసం. అందులో వారు నాటిని విత్తు, పెంచిన చెట్టుకు నేను కేవలం సహాయంగా ఉండి, ఇన్ని సేవలతో, అది పెద్ద వృక్షంగా ఎదగడం చూశాను.

ఈ వృక్షం పెద్దదై, ఫలాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో స్వామివారి శరీరం వెళ్లిపోయింది. ఒకవైపు ఈ ప్రభావం ఎన్నో లక్షలమందిపై ఉంది. వ్యక్తిగతంగా నేను వారు ఇంకా నా చుట్టూనే ఉన్నారన్న భావనతో ఇన్ని సేవలను చెయ్యగలుగుతున్నాను. వారు ఊహించినవి నేను చెయ్యగలిగాను.

ఎందరో మహాత్ములు జన్మించారు. వారందరూ పీఠాధిపతులు కారు. ఎందరో పీఠాధిపతులుగా ఉన్నారు. వారందరూ మహాత్ములు కారు. ఎందరో మహాత్ములు పీఠాధిపతులుగా ఉన్నారు. కానీ ఇందరి జీవితాలోకి వెళ్ళి వారిని ఉద్దరణ చెయ్యడం చిన్న విషయం కాదు. మఠాధిపతి, మహాత్ముడు అయిన కేవలం మన మహాస్వామివారే ఎందరో జీవితాలను ఉద్ధరించారు. అదే సాంప్రదాయాన్ని మేము కూడా రక్షించి, పాటిస్తున్నాము.

కనుక సామాన్యులు కూడా మా సంప్రదాయాన్ని, పారంపర్య పీఠాన్ని, ఆ పరంపరలో వచ్చిన పీఠాధిపతులను అవగాహన చేసుకోవాలి. గురు అనుగ్రహంతో మన జీవితాలను సార్థకం చేసుకోవాలి.✍️
```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
[11/20, 19:07] +91 94918 93164: Cont..👇2```
నేను వారితోనే ఉండడంవల్ల నాకు కూడా వారి స్వభావం వచ్చింది. జనంతో కలిసి, వారి సాధక బాధలను తెలుసుకుని, పీడిత జనుల జీవితాల్లో వెలుగునింపి వారికి మంచి చేయగలిగాను. ఈ పనికి నాకు నిర్దేశకులు పరమాచార్య స్వామివారే. వారు చూపిన మార్గలోనే ఇప్పటికీ నడుస్తున్నాను.

వారు ఏమి చేసినా అది వారి సంకల్పం అనేవారు. సంకల్పం అంటే మనస్సులో కలిగిన ఆలోచన అంటే ఇఛ్ఛా శక్తి. ఆ సంకల్ప మూర్తి ఇఛ్ఛా శక్తి. నేను క్రియాశక్తిగా వారి సంకల్పాలను నెరవేర్చాను. మా ఇరువురి స్థితి ఇదే.

కేవలం పీఠాధిపతిని చేయకుండా, ఈ పీఠం ప్రజల కోసం స్థాపించబడింది, సామాన్య ప్రజల కోసం. ధర్మం కోసం - ఆస్తికమ్ కోసం - ఆన్మీహమ్ కోసం మరియు వాటి ఉద్ధరణ కోసం. అందులో వారు నాటిని విత్తు, పెంచిన చెట్టుకు నేను కేవలం సహాయంగా ఉండి, ఇన్ని సేవలతో, అది పెద్ద వృక్షంగా ఎదగడం చూశాను.

ఈ వృక్షం పెద్దదై, ఫలాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో స్వామివారి శరీరం వెళ్లిపోయింది. ఒకవైపు ఈ ప్రభావం ఎన్నో లక్షలమందిపై ఉంది. వ్యక్తిగతంగా నేను వారు ఇంకా నా చుట్టూనే ఉన్నారన్న భావనతో ఇన్ని సేవలను చెయ్యగలుగుతున్నాను. వారు ఊహించినవి నేను చెయ్యగలిగాను.

ఎందరో మహాత్ములు జన్మించారు. వారందరూ పీఠాధిపతులు కారు. ఎందరో పీఠాధిపతులుగా ఉన్నారు. వారందరూ మహాత్ములు కారు. ఎందరో మహాత్ములు పీఠాధిపతులుగా ఉన్నారు. కానీ ఇందరి జీవితాలోకి వెళ్ళి వారిని ఉద్దరణ చెయ్యడం చిన్న విషయం కాదు. మఠాధిపతి, మహాత్ముడు అయిన కేవలం మన మహాస్వామివారే ఎందరో జీవితాలను ఉద్ధరించారు. అదే సాంప్రదాయాన్ని మేము కూడా రక్షించి, పాటిస్తున్నాము.

కనుక సామాన్యులు కూడా మా సంప్రదాయాన్ని, పారంపర్య పీఠాన్ని, ఆ పరంపరలో వచ్చిన పీఠాధిపతులను అవగాహన చేసుకోవాలి. గురు అనుగ్రహంతో మన జీవితాలను సార్థకం చేసుకోవాలి.✍️
```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment