🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(264వ రోజు):--
స్వామీజీ ఎక్కడకు వెళ్లినా యువకులతో కొంతసేపు గడిపి వారిని ప్రోత్సహించ డానికి కొంత సమయం తప్పకుండా కేటాయించే వారు. దేశమంతటా నెలకొల్పిన వంద లాది బాలవిహార్ కేంద్రాల్లో బాలలు వారం వారం సమావేశమౌ తున్నారు. పాఠ్యoశాలలో హిందూ మతానికీ, సంస్కృతికీ సంబంధిం చిన విషయాలను కూడా చేర్చే ఉద్దేశంతో ముఖ్య పట్టణాల్లో చిన్మయ విద్యాలయాలు నెలకొల్ప బడ్డాయి. కాలేజీ విద్యార్థుల కోసం ఏర్పరచిన చిన్మయ యువకేంద్రాలు వేగంగా విస్తరిల్లు తున్నాయి. చాలా రాష్ట్రాల్లో యువకులు సేవాకార్య క్రమాలు చేపడుతున్నారు ; సభలు నిర్వహిస్తున్నారు.
సహజంగానే, యువకులు మిషన్ కార్యక్రమాలపై ఆసక్తి చూప డం అధికం కాసాగింది. బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వారి సంఖ్య కూడా పెరగసాగింది. వారు పనిచేస్తున్న మిషన్ కేంద్రాలు అభివృద్ధి చెంద సాగాయి. పఠన బృందాలు కూడా ఎప్పటిలానే అందరి అభిమానాన్నీ చూర గొంటు న్నాయి. వేదాంత భావాలను కొత్త సాధకులకు పరిచ యం చేయటానికి తపాలా సౌకర్యం ద్వారా తరగతులు నిర్వహించే పద్దతి ఉపయోగ పడింది. వృద్ధా ప్యాన్ని అర్ధ వంతంగా గడపటానికి వీలుగా ఆశ్రమ పరిసరాల్లో వృద్ధా శ్రమాలు నిర్మించబడ్డాయి.
సభ్యుల సామర్థ్యా ననుసరించి చేపట్టే సేవా కార్యక్రమా లతో మిషన్ కేంద్రాలు అభివృద్ధి చెంద సాగాయి. స్వామి బ్రహ్మానంద గారి ఉత్తేజపూరి తమైన ప్రోత్సాహంతో బెంగుళూరు కేంద్రం అభివృద్ధి పథంలో చురుకు గా ముందడుగు వేసింది. ఆయన నాయకత్వంలో నర్సులకు శిక్షణ తరగతులు, పేద గ్రామీణులకు వైద్య సదుపాయం వంటి కార్యక్రమాలను బెంగుళూరు లోని చిన్మయ మిషన్ కేంద్రం చేపట్టింది. దీనబంధు దేవా లయాన్ని విస్తరించారు; కార్యనిర్వ హణలో శిక్షణ నిచ్ సంస్థను స్థాపిం చారు. శ్రీమతి లీలా నంబియార్ నాయకత్వం లో మద్రాసు కేంద్రం విద్యా విషయాల్లో ముందంజ వేసింది. మద్రాసు సమీపంలో ఒక శివాలయం నిర్మించబడింది ; తమిళ భాషలో వేదాంత తరగతు లు నిర్వహించడానికి ఒక ఆశ్రమం స్థాపించారు; గ్రామీణులకు వైద్య సదుపాయం కల్పించబడింది. ఢిల్లీ లో స్వామి జ్యోతిర్మయా నంద పర్య వేక్షణలో పెద్ద మిషన్ కేంద్రం, పాఠ శాల నిర్మించబడ్డాయి. స్వచ్చందం గా, నిస్వార్థంగా పనిచేసిన ఎందరో కార్యకర్తలవల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.
మిషన్ కు చెందిన మిగిలిన స్వాములతో పాటు స్వామీజీ కూడా హిమాలయాల లోని ఉత్తరకాశీ, సిద్ద బరిల నుంచి దక్షిణాన మధురై, కొచ్చిన్ ల వరకూ ఆధ్యాత్మిక శిబిరాలను నిర్వహించడం మొదలు పెట్టారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమావేశాలను 1983 లో ముంబై లోనూ, 1987 లో మిషిగన్ (అమెరికా) లోనూ, 1988 లో కొచ్చిన్ లోనూ నిర్వహించారు. ఈ శిబిరాలూ, సమావేశాలూ మిషన్ సభ్యులందరూ ఒకచోట చేరి వారి వారి ఊహలను ఒకరితో నొకరు పంచుకోడానికి తోడ్పడ్డాయి. అంతే కాకుండా స్వామీజీ బోధించిన భగవద్గీత, ఉపనిషత్తుల లోని వివే కాన్ని ఆకళింపు చేసుకోడానికి కూడా ఇవి ఉపకరించాయి.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment