🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(274వ రోజు):--
27. స్వామీజీ ఆశయాలు
దూరదృష్టి ఉంటే - ఒక్క వ్యక్తైనా ఆ దూరదృష్టి ఆధారంగా జీవించే ధైర్యపరాక్రమాలను అలవరచుకొని అభివృద్ధి చేసుకొంటే - సంస్థ ఎన్నటికీ నశించదు.
-స్వామి చిన్మయానంద,1993
ఐకమత్యం తోనూ, పటిష్ఠమైన నైతిక విలువలతోనూ, ఆధ్యాత్మిక ఆదర్శాలతోనూ జీవించే సమాజ వ్యవస్థను పునరుద్దరించాలనే స్వామీజీ ఆశయాన్నే గమ్యంగా చేసుకొని చిన్మయమిషన్ కేంద్రాలు తమ పయనాన్ని ముందుకు సాగిస్తు న్నాయి. ఈ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులందరూ స్వామీజీ లక్ష్యాన్ని తమదిగా చేసుకొన్నవారే. ఈ ఉమ్మడి లక్ష్యం సమాజ సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసే శక్తిని వారికిస్తుంది.
వివిధ అంశాలపై స్వామీజీ వెల్ల డించిన తన ఆశయాలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందు పరచడం జరిగింది .
చిన్మయ ఉవాచ :
చిన్మయ కుటుంబం
చిన్మయమిషన్ సభ్యులమైన మనమందరం కోరేది మన దేశానికీ, మన సమాజానికీ, మన కుటుంబా నికీ మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిం చే అవకాశం మనకు లభించాలని మాత్రమే. విధుల నుంచే మనకు హక్కులు జనిస్తాయి. మన విధుల విషయంలో మనం పూర్తి మెలకువ తో ఉండాలి; మన విధి నిర్వహణ కోసం మనం చేస్తున్న పనులు సరిగా చేస్తున్నామో లేదో గమనించటం మీదనే మన దృష్టి అంతా ఉండాలి. మనం చేసే పనుల నాణ్యతను పెంచడానికీ, ప్రయోజనాన్ని పెంచ డానికీ, మన ప్రయత్నాల వేగాన్ని పెంచడానికీ మనం నిరంతరం శ్రమిస్తాం. జీవితానికి సమగ్రమైన, ధీరోదాత్తమైన అర్థమూ, విజయ వంతమైన లక్ష్యమూ కావాలనే హక్కు మనకుంది.
ఈవిధంగా సేవిస్తూ జీవించడమే వేదాంతపు సారం. ఉపనిషత్తులు కీర్తించేదీ దీనినే ; ఋషులు గొంతెత్తి పదేపదే చెప్పేదీ ఈ విషయాన్నే. వేలాది సంవత్సరాలు నిరాఘాటం గా సాగిన భారతీయుల ఆధ్యాత్మిక చరిత్రలో మన ఆచార్యులందరూ మాటి మాటికీ మనకు వేలెత్తి చూపి నది ఈ సత్యాన్నే. ఆధ్యాత్మికతకు సారమైన ఇటువంటి జీవితం గడప డంలో ఏ శక్తీ మనలను ఎదిరించ లేదు; ఏ అడ్డూ మనలను ఆపలేదు. నిశ్శబ్దంగా, ధీరోదాత్తంగా మన విధు లను నిర్వర్తిస్తూ ముందుకు సాగుదాం ; మనకు ఏ హక్కులూ అవసరం లేదు ; ఏ బహుమతులూ అవసరం లేదు. మన మిషన్ సభ్యు లందరూ అటువంటి విశాల హృదయం, త్యాగశీలత, విశ్వాసం కలిగిన సేవకులు భగవంతునికి.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment