🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(276వ రోజు):--
చిన్మయ ఉవాచ :-
-బాలలు-
భగవంతుని నుంచి మనం ఈ ప్రపంచంలో అడుగిడినపుడు, మన మందరం మంచి పిల్లలమే, తెలివైన వారమే. కాని, అందరితోనూ కలిసి జీవిస్తున్నపుడు మనలో కొన్ని జంతు ప్రవృత్తులు ఉత్పన్నమై, చెడు పిల్లలు గా మారతాం. ఈవిధంగా దిగజార కుండా ఉండటానికి మనం దైవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. బాల విహార్ ఏర్పాటు చేసినది మనం అతనిని గుర్తుంచు కోడానికి, సాయం చెయ్యటానికే. దేదీప్య మానంగా ప్రకాశించే భగవంతుని మహిమను కీర్తించే గానాలను మదిలో నిలుపుకుని, మీరందరూ పెద్దయి, భారతదేశపు మహా పురుషు లూ, స్త్రీలూ కావాలి ; దేశానికి సేవ చెయ్యాలి ; మన జనుల సంక్షేమం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వీటన్నిటికీ సామర్థ్యం, మంచి నడవడి, బలం, భగవంతుని దయ కావాలి. వీటిని సంపాదించ డం కోసం మీరు కృషి చేయాలి. ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందూ, ఉదయం లేవబోయే ముందూ భగవంతుని మహత్తును గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడు, మీరు చేసే పనులు కూడా మీ మనసులో నింపు కొన్న భావాల్లాగే మంచిగా ఉంటాయి.
---
పిల్లల విషయంలో ఆయనకున్న ఆసక్తి వల్ల, దేశంలో చిన్మయ విద్యా లయాలను స్థాపిస్తున్న మిషన్ సభ్యులను స్వామీజీ చాలా ప్రోత్స హించేవారు. పాఠ్యoశాలలో సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాల గురించి కూడా బోధించే ఈ పాఠ శాలలు దేశంలో ఉన్నత విలువలను పునరుజ్జీవింప జేయ టానికి ఆవశ్యక మైన ముఖ్యమైన పునాది.
చిన్మయ ఉవాచ :-
--విద్య--
మన సంస్కృతి ఆధారంగా ఉన్న విద్య కావాలి. అటువంటిదే నిజమైన విద్య అవుతుంది. ఈ రోజుల్లో విద్యాలయాల్లో నేర్పుతున్న ది విద్య కాదు, శిక్షణ మాత్రమే. పాఠ శాలలూ, కాలేజీలూ సంస్థలు గానూ అధ్యాపకులూ, ఆచార్యులూ శిక్షకులు గానూ మాత్రమే వ్యవహరిస్తు న్నారు. ఈ సంస్థల్లో శిక్షకులు పనులు ఎలా చెయ్యాలో, బ్రతుకు తెరువుకు డబ్బు ఎలా సంపా దించాలో నేర్పుతున్నారు. ఈ నాడు మనం కోరేదంతా బ్రతుకు తెరువుకు డబ్బు సంపాదించడమే. ఉదాత్తమైన గుణాలను మనం మర్చి పోయాం. మన నడవడి నీచస్థితికి దిగజారింది. మంచి ఉద్యోగం కావాలంతే - తక్కువ పని తోనూ, ఎక్కువ జీతం తోనూ ...
చిన్మయమిషన్ నడిపే పాఠ శాలల్లో పనిచేసే అధ్యాపకులకు పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దే ఆదర్శంతో శిక్షణ నీయటం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్యoశాలే కాక, ఇక్కడ నైతిక విద్య కు కూడా ప్రాధాన్య మిస్తాం. చదువు లో ముందుండ డమే కాక, భవిష్యత్ లో ఆదర్శ ప్రాయమైన పౌరులుగా కూడా విద్యార్థులను తయారు చేయ టమే ఈ పాఠశాలల ఉద్దేశం. మంచి నడవడి, పెద్దలపై గౌరవం, భగవంతునిపై భక్తి, సత్యవాక్కు, క్రమ శిక్షణ - వీటన్నిటికీ ఇక్కడ ప్రాధాన్యత నిస్తారు.
---
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment