5 Signs మీ చేతుల్లో 'చీ' HEALING POWER ఉందని | Qi Energy Test You Can Try NOW! #energyhealing
https://youtu.be/LdK-zGfpYA8?si=VOxAIvg7cH8Hrj5w
Default Title
https://www.youtube.com/watch?v=LdK-zGfpYA8
Transcript:
మీ చేతుల్లో ఒక అద్భుత శక్తి దాగి ఉండొచ్చు. అది మీకే తెలియదు ఇంతవరకు. తెలిస్తే అండి నాలాగే మీరు ఎన్నో చిన్న చిన్న అద్భుతాలు చేస్తూ జీవితాన్ని మెరుగు చేసుకోగలరు. ఇప్పుడే క్షణాల్లో మీ చేతిలోని ఈ శక్తిని మీరు టెస్ట్ చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఆసక్తిగా ఉంటే వీడియో పూర్తిగా చూసేయండి. ఒక ఆరు ఏడు నిమిషాలు మాత్రమే తీసుకుంటాను.
రెడీ? మిత్రమా మీకు సంస్కారంతో వంశీ నమస్కారం. జగమంత కుటుంబం నాది ఛానల్ లో బైరాగి ఆదేశంతో మీకు ఎంతో పనికి వచ్చే మైక్రో లెసన్స్ అందిస్తుంటాను నేను. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పిన రహస్యాన్ని ఈరోజు క్వాంటం సైన్స్ నిరూపిస్తోంది. ఈ ఛానల్ లో మనం పురాతన సనాతన ధర్మ రహస్యాలను ఆధునిక క్వాంటం ఫిజిక్స్ తో అనుసంధానించి అన్వేషిస్తాం.
మిత్రమా సైన్స్ అయినా స్పిరిచువాలిటీ అయినా ఒకే ప్రశ్నను శోధిస్తున్నాయి. మీలో నాలో విశ్వమంతా ప్రవహిస్తున్న ఆ శక్తి ఏంటి అని. ఋషులు చేతులతో నిమరగానే రోగాలు పోయేవి. ఇతర నాగరికతల్లో కూడా ఇలాంటి హీలర్లు ఉండేవారు ఈరోజుకి అద్భుతమైన చికిత్సలు చేస్తున్న వారు ఉన్నారు. మనిషి చేతుల్లోని ఈ శక్తిని చైనాలో క్యూ ఐ ఛీ అంటారు.
అసలు చీ అంటే ఏంటి ఇది అందరికీ ఉంటుందా మీకు ఉందా ఉపనిషత్తుల ఉవాచ సర్వం కల్విదం బ్రహ్మ అంతా శక్తి అంతా అనుసంధానమై ఉన్నదే క్వాంటం ఫిజిక్స్ ఇప్పుడు దాన్నే నిరూపిస్తోంది. మిత్రమా పరమాణువులు ఘన పదార్థాలు కావు అవి కంపించే శక్తి క్షేత్రాలు ఈ శక్తి మీవంటి ఒక చైతన్య శోధకురాలు శోధకుడి కొరకు వేచి ఉంది. ఋషులు దీనినే ప్రాణశక్తి అన్నారు. సైన్స్ ఏమో క్వాంటం ఫీల్డ్ అంటుంది.
ఇక దాన్ని మీరు మీ చేతుల్లో చీగా అనుభవించొచ్చు. సెన్సేషన్ టెస్ట్ ఇప్పుడు చిన్న పరీక్ష చేద్దాం. మీ అరచేతులు వేగంగా 10 సెకండ్లు రుద్దుకోండి. బాగా రుద్దండి. తర్వాత మెల్లిగా అరచేతులను రెండు అంగుళాల దూరం జరపండి. ఏమనిపిస్తోంది ఒక వెచ్చదనం లేదా చేతుల మధ్య ఒక అయస్కాంతం లాంటి లాగుతున్న ఫీలింగ్ ఏమన్నా ఉందా? ఆ ఆ అనుభూతే మీ జీవశక్తి మీ చీని బహుశా మొదటిసారి పలకరించారు మీరు ఇప్పుడే.
ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ తెలియకపోయినా భయపడకండి కొన్నిసార్లు ఈ శక్తి నిశశబ్దంగా పనిచేస్తుంది. అభ్యాసంతో మరింత స్పష్టంగా తెలుసుకుంటారు. అసలు ఏంటి ఈ శక్తి. హీలర్లు చేతిలో వేడి గురించి చెప్తారు. అదే ఈ శక్తి. ధ్యానంలో కొందరికి అరచేతుల్లో, ఒంట్లో వైబ్రేషన్, స్పందనలు, తరంగాలుగా తెలుస్తూ ఉంటాయి. అది కూడా ఈ శక్తే.
ప్రాచీన భారతీయులు నాడులుగా మ్యాప్ చేశారు ఈ శక్తి తిరిగే మార్గాలను. ఈ శక్తే అన్నింటికీ మూలం. ఈ శక్తినే జగన్మాతగా వర్ణించారు. క్వాంటం ఎంటాంగిల్మెంట్ కి మూలము ఇదే. ఈ చీ మీ చేతుల్లో ఉంది అని చెప్పే ఐదు సంకేతాలు ఇప్పుడు వినండి. టెస్ట్ ఒకటి. అరచేతులు రెండు రుద్దుకొని రెండింటిని 2 inల దూరం ఉంచండి. అప్పుడు చేతులలో ఒక తిమ్మిరి చిమచిమ లేదా చేతుల మధ్య వేడి మీకు తెలుస్తుంది.
అంటే మీ చేతిలో చీ ప్రవాహం ఉంది. మిత్రమా ఈ టెస్ట్లని వీలైతే వీడియోని పాజ్ చేసి ట్రై చేసి మళ్ళీ వెనక్కి రండి. టెస్ట్ టూ ఇప్పుడు మీ అరచేతులను ఒకదానికొకటి ఇంకొద్దిగా దూరం జరిపి ఒక అదృశ్య బంతిని పట్టుకుంటున్నట్టు భావన చేయండి. రెండు చేతుల మధ్య ఏదో వెచ్చటి కనెక్షన్ మీకు తెలుస్తూ ఉంటుంది. అలా అలా చేతులు ఆడిస్తూ ఉండండి బాల్ ని పట్టుకున్నట్టు.
చేతుల్లో ఒక ఎనర్జీ బాల్ ఉన్నట్టుగా మీకు ఫీలింగ్ వస్తూ ఉండొచ్చు. కొందరికీ ఇది చీకటి గదిలో చేస్తే ఒక పారదర్శకమైన బంతి కూడా కనిపిస్తుంది. నిజం కళ్ళకి కనిపిస్తుంది. నేను ఈ ఎనర్జీ బాల్ ని విసిరి పట్టుకునే ఆటను నా స్నేహితులతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటానండి. టెస్ట్ త్రీ స్వతహాగా కొంతమందికి ధ్యానం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి అరచేతులు ఎక్కువగా సున్నితం అవుతుంటాయి. అంటే సెన్సిటివ్ అవుతుంటాయి.
ఏదో మామూలు వస్తువే ఉంటుంది అది పట్టుకోగానే ఏదో మంచి ఫీలింగ్ రాదు ఒక్కసారిగా వదిలేస్తాం. లేదా ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకాసేపు పట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగేనండి కొన్ని వస్తువులు ముట్టుకున్నప్పుడు మీ చేతులు మీ మైండ్ కి కొన్ని సంకేతాలు పంపుతాయి. ఆ వస్తువు గురించి దీన్నే ఆకల్ట్ శాస్త్రాల్లో సైకోమెట్రీ అంటారు.
వస్తువుని పట్టుకోగానే దాని చరిత్ర అంతా చెప్పే శక్తి అది. ఈ సైకోమెట్రీ ప్రాణశక్తి చీనే మాధ్యమంగా చేసుకునే విద్య. ఈసారండి కొత్త వస్తువులు ఏమైనా పట్టుకొని మీ లోపల సెన్సేషన్స్ ఏమవస్తాయో గమనించి చూడండి. టెస్ట్ నాలుగు రేఖీ హీలింగ్ ప్రాణిక్ హీలింగ్ అనేవి వినే ఉంటారు. కేవలం ఈ ప్రాణశక్తినే విశ్వం నుంచి తీసుకొని రుగ్మత ఉన్న అవయవానికి పంపుతారు ఈ చికిత్సకులు నేనే దీనికి సాక్షి అండి చిన్న చిన్నవి ఎన్నో నా చేతులతో నయం చేశనండి అది పనిచేస్తుంది.
సరే మీరు చేయాల్సిన టెస్ట్ ఏంటంటే మీకు తెలిసిన ఎవరికైనా కాలు నొప్పో చెయ్యి నొప్పో ఉన్నాయి అనుకోండి ఆ నొప్పి ఉన్న ప్రదేశానికి ఒక రెండు మూడు ఇంచుల పైన మీ అర చెయ్యిని అలా పెట్టి కళ్ళు మూసుకోండి. మీ చేతికి ఆ రుగ్మత వెచ్చగా తగిలినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ చేతిని ఆ స్థలం నుంచి నొప్పి లేని వైపు జరపండి. ఆ వేడి ఉండదు అక్కడ.
ఈ హీట్ సెన్సేషన్ ఇది కొందరికి చల్ల సెన్సేషన్ కూడా అవ్వచ్చు. ఈ సెన్సేషన్ మీకు తెలిస్తే మీకు చీత్ చక్కగా పని చేస్తున్నట్టే లేదంటే ప్రాక్టీస్ తో తెచ్చుకోగలరన్నమాట. టెస్ట్ ఫైవ్ ఇది ఇందాకటి టెస్ట్ కి కొనసాగింపు టెస్ట్. మీరు నొప్పి ఉన్న చోట చెయ్యి పెట్టినప్పుడు మీ చేతిలోంచి ఒక తెల్లటి వెలుగు తరంగాల్లా ఆ నొప్పి ఉన్న చోటికి అటు లోపలికి వెళ్లి నొప్పి మాయం అవుతున్నట్టు భావన చేయండి.
ఒక 10 సెకండ్లు చేయండి అంతకంటే వద్దు ఒక్క నిమిషం ఆగి ఆ మనిషికి నొప్పిలో ఏదైనా తేడా కనిపించిందేమో అడగండి కనిపిస్తే మీరు చక్కగా రేఖియో ప్రాణిక హీలింగో నేర్చేసుకోవచ్చండి మీ చీ హ్యాపీగా పని చేస్తుంది మిత్రమా న్యూరో సైన్స్ చెప్తోంది మీ ఆలోచన శరీరంలో మార్పులు తేగలదని క్వాంటం ఫిజిక్స్ చెప్తోంది కేవలం సాక్షిగా గమనించడం వల్ల వస్తువుల్లో స్థితుల్లో మార్పులు వస్తాయని మరి సనాతన ధర్మం ఎప్పటినుంచో ఇది చెప్తోంది మీ చైతన్యమే మీకు మాస్టర్ స్విచ్ అని మన ఋషులు ప్రాణాయామం ధ్యానం కారుణ్యం నేర్పినప్పుడు అవన్నీ మీలోని ప్రాణశక్తిని వృద్ధి చేసే మార్గాలేనండి క్వాంటం ఫీల్డ్
ని యక్సెస్ చేసే టెక్నిక్స్ే సరే ఈ చీ అంటే హీలింగ్ శక్తి మీలో మేలుకుంటే ఏమవుతుంది ఒంట్లో రిలాక్సేషన్ పెరుగుతుంది మైండ్ కి క్లారిటీ వస్తుంది అంతర్దృష్టి మెరుగవుతుంది ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కాసేపు ఉన్నా కాసేపు మాట్లాడినా అరే నేను ఎంతో చికాగగా వచ్చాను నీతో మాట్లాడగానే అంతా తీసినట్టు వెళ్ళిపోయిందే ఒక్కసారి హాయిగా ఉంది అంటారు.
మిత్రమా యోగులు హీలర్లు ఈ స్థితిని అనుభవిస్తున్నారు. ప్రాణశక్తిని సాధన చేసి ప్రతి ఒక్కరు తమలో ఇంకా తమ చుట్టూ మార్పులు అనుభవిస్తున్నారండి. గుర్తుంచుకోండి మీరు ఈ సృష్టిలో భాగస్వాములు. ఈ ఎగ్జిస్టెన్స్ అంటే విశ్వ ఉనికిలో ఒక లోతైన భాగం మీరు మీ చేతులకు ఒక ప్రాచీన వరం ఉంది. దానితో మీ జీవితాన్ని మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అందంగా హాయిగా మలచండి.
పుట్టినందుకు మంచి ఫీలింగ్ వస్తుందండి ఇలాంటివి చేస్తే లైఫ్ లో. సున్నితమైన మీ స్పర్శతో అద్భుతాలే సాధ్యం ఇది నమ్మండి. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే మీరు చాలా శక్తి కలిగినవారు. మిత్రమా ఈ వీడియో మీతో వైబ్రేట్ అయి ఉంటే క్యూఐ అని కామెంట్ చేయండి. మన ఐదు టెస్టులతో మీ అనుభవాలను కామెంట్ లో రాసి బైరాగికి నాకు చెప్పండి. చెప్తారుగా వంశీకి మరి వాళ్ళకి సెలవిప్పించండి. జై శ్రీరామ్ జై భారత్.
No comments:
Post a Comment