Thursday, November 20, 2025

 *భగవాన్ స్మృతులు- 8*
🪷

​రచన: గుడిపాటి వెంకట చలం

*​సాధుని శాంతమ్మ అనుభవాలు -5*


లక్ష్మీకి అప్పుడు నిండు చూలు. మధ్నాహ్నం రెండు గంటలకి భగవాన్ పత్రిక చదువు తున్నారు. బి. వి. నరసింహ స్వామిగారు తాము రాయబోయే భగవాన్ జీవిత చరిత్ర కోసమై భగవాన్ని ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు. ఆవు లక్ష్మి హాలులో ప్రవేశించి భగవాన్ చదువుతున్న పత్రికను నాకుతోంది. భగవాన్ లక్ష్మి వంక చూచి “కొంచెం ఆగు" అని పత్రిక చదువుకుంటున్నారు. కాని, లక్ష్మి వినలేదు, మళ్ళీ పత్రిక నాకుతోంది. భక్తవత్సలుడైన భగవాన్ పత్రికను అవతల పడేసి తన చేతిని లక్ష్మి కొమ్ముల మధ్యపెట్టి తన తలను కూడ తన చేతిమీదికి వంచారు. ఇద్దరూ కదలకుండా అట్లా వుండిపోయినారు.

నేను చూస్తూ పక్కన నుంచున్నాను. పది నిమిషాలయింది. భగవాన్ నా నైపు తిరిగి “లక్ష్మి ఏం చేస్తుందో నీకు తెలుసునా? లక్ష్మి సమాధిలో ఉంది" అన్నారు. నేను లక్ష్మి వంక చూసాను. ఒళ్లూ, కళ్లూ అన్నీ నిశ్చలంగా ప్రాణం లేనట్టు నుంచుని ఉంది, భగవాన్ కేసి గున్లు నిలిపి, కళ్ల వెంబడి ధారలగా నీళ్లు కారుతున్నాయి.

"ఏం, లక్ష్మీ! యెట్లా ఉంది?" అని అడిగారు భగవాన్. లక్ష్మి అట్లానే భగవాన్ కి తోక చూపడం ఇష్టం లేనట్టు వెనక్కి వెనక్కి జరిగి గుమ్మంలోంచి వెళ్లి, హాలుకి ప్రదక్షిణం చేసి వెళ్లిపోయింది.
📖

నాలుగు రోజుల తరువాత లక్ష్మి దూడని కన్నది. లక్ష్మిని పెంచుతున్న మనిషి పరిస్థితులు బాగుండక ఆ అవుల్ని పెంచలేక లక్ష్మినీ, మూడు దూడల్నీ ఆశ్రమంలో వదిలి కన్నిళ్లతో వెళ్లిపోయాడు. లక్ష్మి మూడు దూడలతో హాలులో భగవాన్ సోసా ప్రక్కని పడుకుంది. దానిని చూసి భగవాశ్ అన్నారు, "ఇన్నాళ్లూ లక్ష్మి స్వామిని వదిలిపోవాలా ' అని సాయంత్రాలు ఏడుస్తూనే ఇంటికి పోయేది. ఇక తన స్వంత యింటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుంది తన సంసారమూ, తానూ, 'నేను, నా బిడ్డలు నీకు శరణాగతి, ఇంక నీదే భారం' అని పడుకుంది, అన్నారు.
📖

*ముష్టి అయింది*

ఒక రోజు ఒక సన్యాసి వచ్చి మూడు పక్షాలు ఆశ్రమంలో వుంటానన్నాడు. భగవాన్ అనుజ్ఞ యిచ్చారు. ఆయన్ని బాగా చూసారు ఆశ్రమంవారు. చివరి రోజున ఆయన భగవాన్ దగ్గరికి వచ్చి "స్వామీ! ఇన్ని రోజులు ఆశ్రమములో నన్ను చాలా ప్రేమతో చూచారు. సర్వవిధాలా తృప్తి అయింది. ఇంక నాకు ఆత్మ తృప్తిని ప్రసాదించండి” అని అడిగారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
భగవాన్ సోఫా మీద నుంచి లేచి నుంచుని ఆయన చేతుల్ని పట్టుకున్నారు. అట్లా ఇద్దరూ నిశ్చలంగా నుంచున్నారు చాలా సేపు. చివరకు "తృప్తి ఆయింది ధన్యోస్మి" అంటూ వెళ్లిపోయినారు. ఈ విధంగా స్పర్శతో, మాటతో, మానంతో, చూపుతో, చూపుకూడా లేకుండా ఎందరికి దీక్ష ఇచ్చారో భగవాన్ !

ఆశ్రమంలో ఆ రోజులలో భగవాన్ భోజనానికి కూర్చుంటారనగా ముందుగా ఆశ్రమంలో ఆశ్రయం తీసుకున్న జంతువుల కి ఆహారం పెట్టారో లేదో చూస్తారు, పిల్లులు, కుక్కలు, పిట్టలు మొదలైన వాటికి భోజనం అయిందో, లేదో - స్వయంగా చూస్తారు. తరువాత పశువులకి ఇడ్డేన్లతో సహా పెట్టవలసిందే! యెక్కువమంది వచ్చి ఆశ్రమములో వండిన ఇడ్డేన్లు పశువులకు మిగలకపోతే భగవాన్ కి జడిసి వూళ్ళోకి మనిషిని పరుగెత్తించి ఇడ్డెన్లు కొని తెప్పించేవారు.

మృగాలకి అయిన తరువాత బిచ్చానికి వచ్చిన మనుష్యులకి భోజనం పంచి పెట్టాలి ఎంత వుంటే అంతా ఇవ్వవలసిందే, వాళ్ల తరువాతనే తన భోజనం, ముష్టివాళ్లు కదా అని వాళ్లకి, ముక్కల పులుసు చేసేదాన్ని. రోజుకి ఒక పులుసు వాళ్ళకి, ఆశ్రమానికి సాంబారు వండేదాన్ని. ఆ పలచని పులుసు బీదవాళ్లకు పొయ్యడం భగవాన్ చూచారా, "సాంబారు నాకెందుకు? ఆ పప్పు సాంబారు వాళ్లకి పోసి, వండిన పెళ్ల పులుసు నాకు పొయ్య" మని పట్టుపుట్టేవారు. ఆయనతో పడ 'క' చారుకట్టు తియ్యగా, మిగిలిన పప్పు వాళ్ల పులుసులో వేసి కాచేదాన్ని.
📖

కార్తీక దీపం రోజుల్లో ఉత్సవానికి వచ్చిన ముష్టివాళ్లు చాలామంది ఆశ్రమానికి తప్పక వచ్చేవారు. జయంతికి చెప్పునక్కర్లేదు. ఒక ఏడు సుబ్రహ్మణ్యస్వామి భోజనం పంచి పెడుతూండగా గలాటా జరిగింది. తనకు అలవికాక అన్నం గిన్నెని అక్కడే పారేసి వచ్చేశారు. ఆ మరునాడు ఇక నుంచి వారికి భోజనాలు లేవన్నారు, ఆశ్రమాధికారులు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ రాత్రే నాకు కల వచ్చింది: భగవాన్ హాలులో భక్తులందరు కూర్చుని వున్నారు. భగవాన్ సోఫామీద చిన్నది, మృగం మాదిరి ది ఒకటి వుంది. ఆ చిన్న మృగం వెంటనే ఒక అద్భుతమైన ఎర్రని మహాశ్వంగా ఎదిగింది. అది వచ్చి ప్రతి భక్తుణ్నీ వాసన చూస్తోంది వరుసగా, నా దగ్గరకు వస్తుందేమో అని నా గుండె దడదడ లాడుతూంది. ఆ గుర్రం వెళ్ళి భగవాన్ ని వళ్ళంతా నాకి, మాయమైంది. భగవాన్ నన్ను దగ్గిరికి పిలిచి యెందుకట్లా భయపడతావని అడిగి, గుండెల పైన చెయ్యి వేశారు, నా వణుకు వెంటనే ఆగింది.
భగవాన్ దేహంలోంచి ఒక దేవతా పరిమళం బైలుదేరింది. అట్లాంటిది నేనెన్నడూ వాసన చూచి ఎరుగను.

అప్పుడు అన్నారు: "అది మామూలు గుర్ర మనుకోకు. కార్తీక ఉత్సవానికి అరుణాచలే శ్వరాలయంలో ధ్వజమెత్తగానే ఆ ఉత్సవం లో పాల్గొనటానికి పై నుండి దిగివచ్చి. అనేక దేవతలు అనేక రూపాలలో ప్రజలతో కలిసి తిరుగుతుంటారు. ముష్టికి వచ్చిన గుంపులో ఎవరు కలిసి ఉంటారో ఎట్లా తెలుసుకో గలరు? ముష్టివాళ్లకీ, సాధువులకీ భోజనం వెయ్యడం ఆపకండి. ఎంత ఉంటే అంత లోనే పెట్టండి. లేదు పొమ్మనకండి” అన్నారు.

నాకు మెలకువ వచ్చింది. పొద్దున్నే ఆ కల చిన్నస్వామికి చెప్పాను. నా కల విని ఏడు పళ్ళు బియ్యం వార్చమన్నారు. ఆ రోజున మరల బీదవాళ్ళకి భోజనాలు సాగించారు. నాకు ఎట్లా వచ్చేదో ఆ బలం - పెద్ద పెద్ద గుండిగలు వార్చి అవలీలగా యెత్తిపెట్టె దాన్ని!
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment