Wednesday, November 26, 2025

 *అంతకు ఇంతే ఇంతకు అంతే*

అది బాగా ఎండాకాలం .. ..సుార్యుడు మిణ మిణ కిరణాలు భుామిని తాకుతున్నాయి. ఆ ఎండ తాపానికి అడవిలో మేతకి వెళ్లి న ఆవులు దాహానికి అల్లాడుతున్నాయి..ఒకామె ఆ ఆవులు దాహానికి అల్లాడిపోవడం చుాసింది… చుాసి అయ్యెా ...ఈ ఆవులకి చాలా దాహం వేసిందె అనుకుంటుా ..ఒక కడవ తీసుకొని ఊర్లోని బావి నుంచి నీళ్ళు తెచ్చి ఒక చెట్టు కింద తొట్థి పెట్టి ఆ తోట్టిలోకినీరు పోసింది .ఆవులు ఆ తోట్టె లోని నీళ్ళు తాగి ప్రాణం నిలుపుకున్నాయి..

కొన్ని సంవత్సరాలకి...చాలా ధనవంతురాలు అయింది. ధనం ధ్యానం సంపద బంగారం నౌకర్లు కోట వంటి ఇళ్లు ఇలా అష్ట ఐశ్వర్యము తో తులతుాగుతుంది..అది చుాసి అందరుా గొప్ప గా చెప్పుకునేవారు.కాని అంత అష్ఠైశ్వర్యం ఆమెకు సడన్ గా ఎలా వచ్చిందో తెలియదు..ఎక్కడ చిన్న పనికి చేయి పెట్టిన అది అఖండ లాభం కలిగేది..అలా సంపద అంతా నిక్షిప్తం అవుతుండేది...కొంత కాలానికి అది నిదానించి....ఇప్పుడు మాములుగా వచ్చేసింది… .ఇప్పుడు ఏ వ్యాపారం లో చేయి పెట్టిన లాభం లేదు నష్టం లేదు .మాములుగా వుంది..అంతా అదృష్టం కాలం భలే సాగింది .నాకు..ఇప్పుడు ఏమి ఏ లాభం లేకుండా వుందె ఎందుకు ఇలా అవుతుంది ...గతంలో ఏది తాకితే అది బఁగారం అవుతుండేది..ఇప్పుడు ఎంతగా శ్రమించిన శ్రమ ఫలమే వుందే...అనుకుంటుా వుండేది..

ఒకరోజు ఒక త్రికాలజ్ఞాని బిక్షాటనకు వచ్చి ఈమెను చుాసి" అమ్మా నీవు అడవిలో దాహానికి అల్లాడుతున్న ఆవులకి తొట్టె పెట్టి కడవతో నీళ్ళు పోసి వాటి దాహార్తి తీర్చావు..దానికి నీకు పరమాత్మ మెచ్చుకొని సకల సంపదలు ఇచ్చాడు..ఆ పుణ్యఫలం అయిపోయెాదాక నీకు పట్టుకుంటే బంగారం అవుతున్నది..ఇప్పుడు ఆ పుణ్యం అయిపోయిందమ్మా. అందువలనే ఇప్పుడు మాములు గా వుంది.అనిచెప్పి వెళ్లి పోయాడు ఆ త్రికాలజ్ఞాని.

అప్పుడు ఆమె ఒక్క తొట్టి పెట్టి ఆవులకినీళ్ళు పోస్తే ఇంత ఐశ్వర్యము లభించింది...ఉారంతా అడవంతా తొట్టెలు పెట్టి వాటి నిండా నీళ్ళు పోయిస్తాను .ఇక నాకు తిరుగులేని ఐశ్వర్యము వస్తుంది ..నేనే మహారాణి ని ఇక్కడంతా నేనే పాలన చేస్తాను అనుకుంటుా..అడవంతా ఊరంత ఆవులకి తొట్టెలు ఎర్పరిచి వాటినిండా నీళ్ళు వుండేలా చేసింది....ఆనకా వచ్చే సంపద కోసం ఎదురు చుాస్తా వున్నది...ఎంత కాలం గడిచిన ఏ పని మెుదలు పెట్టిన అస్సలు లాభం రావడం లేదు ..ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లు .ఎంత కష్టపడినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే....

ఎందుకు ఇలా అవుతుంది అని ఆమె గతంలో వచ్చిన త్రికాలజ్ఞాని దగ్గర వెళ్లి అడిగింది...అప్పుడు ఆ మహాత్ముడు దివ్య దృష్టి తో చుాసి" అమ్మ నీవు ఆనాడు అడవిలో ఆవులకి నీళ్ళు నిస్వార్దంగా వాటి దాహం చుాసి పుణ్యం వస్తుంది అని తెలియక మంచిపని చేసావు.అది నీకు కోట్లు పడగలు అయి సంపదలు అయినాయి...కాని ఇప్పుడు తెలిసి చేస్తున్నావు...తెలిసి ఆశించి చేసావు.." .అంతకు ఇంత ఇంతకుఅంతే..." అని చెప్పగానే ఆమెకు జ్ఞానోదయం కలిగి అప్పటినుండి ఆశించి కాకుండా ...నిస్వార్దంగా సేవ చేసి స్వర్గానికి  పోయింది ...!!

No comments:

Post a Comment