Thursday, November 27, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

     శంకరాచార్యుల 'ఆత్మబోధ' ను తమిళంలో అనువదించడమే మహర్షి చివరి రచన. బలహీనపడిన కళ్ళతో రాత్రంతా తదేక దీక్షతో కొవ్వొత్తి వెలుగులో కూర్చుని ఎలా వ్రాసేవారో ఒక భక్తుడు ( టి.రామచంద్ర అయ్యర్ ) వివరించారు. 

   అసలు ఈ అనువాదం ఏ విధంగా ప్రారంభమైనదో మహర్షి సేవకుడు ( కుంజుస్వామి ) ఆసక్తికరంగా ఈ విధంగా వివరించారు ....

    కొంతకాలం క్రితం (1920 కి ముందే కాబోలు) మహర్షిని అరుణగిరి మీద ఉన్న స్కందాశ్రమంలో కలిసాను. 
    
    మహర్షి శిష్యగణంతో స్కందాశ్రమానికి పైన ఉండే ఏడు నీటిపాయల దగ్గర గడుపుదామని అనుకొని గిన్నెలు, వంట సరుకులు మొదలగు వాటితో అరుణగిరి పైకి చేరుకున్నారు. అరుణగిరి కొన వరకూ ఎక్కి తిరిగి ఏడు నీటిపాయలను చేరుకొన్నాము. సామాన్లతో తీరా చూస్తే అగ్గిపెట్టె లేదు. 
    
   ఆ క్షణాన శంకరుల ఆత్మబోధలోని శ్లోకాన్ని మహర్షి ఇలా సెలవిచ్చారు ...
   
    అని మార్గాలూ విముక్తిని కోరడానికే ఉన్నాయి. కానీ వాటిలో జ్ఞానం ప్రత్యక్ష మార్గం. నిప్పు లేకుండా వంట ఎలా చెయ్యలేమో జ్ఞానం లేకుండా ముక్తి సాధించలేం.

No comments:

Post a Comment