ఒక గుడ్డివాడికి చూపు రాగానే,
మెట్టమొదటగా విసిరేసేది ఏంటో తెలుసా?
అప్పటివరకు అతడికి తోడుగా నిలిచిన,
దారి చూపిన,
ఆసరా ఇచ్చిన కర్రనే!
చూపు రాకముందు
చీకటి లోకంలో జీవనం
సాగింది,
అడుగు తీసి అడుగు వేయాలంటే భయం,
ప్రతి దారి మలుపులో సందేహం ఉండేది...
ఆ సమయంలో
ఆ చేతిలోని కర్రే...
కళ్లై నడిపింది,
ధైర్యాన్ని ఇచ్చింది...
వెలుగు వచ్చిన తరువాత
కనులకు వెలుగు సోకి,
లోకం కనిపించగానే,
తన ప్రయాణంలో సహాయం చేసిన దానిని,
ఒక్క క్షణం ఆలోచించకుండా వదిలేశాడు...
ఎందుకంటే,
అతడికి
దాని అవసరం లేదు...
తానే నడవగలడు,
తానే చూడగలడు.
అవసరం తీరాక,
ఉపయోగం లేదనుకుంటే,
అప్పటివరకు.. తోడున్నదైనా
విసిరేస్తారు...
కృతజ్ఞత కన్నా,
స్వార్థమే కొన్నిసార్లు...
ముందుంటుంది,
మరి ఇది న్యాయమా?
Bureddy.
No comments:
Post a Comment