Tuesday, November 4, 2025

 "సమైక్యత  వర్ధిల్లాలి"

మనుషుల్లో ఐక్యత వర్ధిల్లాలి!..
దిక్కులు పిక్కటిల్లేలా అరువాలి
జిందాబాద్ జిందాబాద్ మనిషితనాన్నికి..
మనషులుగా పుట్టినందుకు.. 
సమైక్య జీవనం సాగించాలి
సమూహంతోనే సమస్యలు తొలగును
మనిషికి మనిషితోనే మనుగడ
మనిషిని వంచించే మనసు
నిత్యం ఆశ్చర్యార్థంలోకి నెట్టుతుంది!..

మనిషి మనసులోయలలో 
ఎన్ని ఉపద్రవాలు పారుతాయో
ఎప్పుడు ఎక్కడ విధ్వంసం పుట్టిస్తుంది
ఎన్ని మానవత్వపు కొండల్నిడీకొడుతుందో
అందుకే మనిషిలోని మొండితనం మారాలి!..

మనుషుల మొండి తనం నశించాలి
ఆకాశమే హద్దుగా స్వార్థమే ముద్దుగా
దిగిన ఆశలలోతులోకి వీడని స్వార్థం మైకం
జీర్ణించుకోలేని పొడిమాటల పొడుపులు
తనకు తానే ఎదగాలనే ఆలోచన దోరణి
నశించాలి మనుషుల్లోని మొండి తనం!.. 

విశ్వాసాన్ని కూల్చేసి విషపుజ్వాలలు నింపుకొని
మానవీయ సౌధాలు ఒక్కసారి కుల్చేస్తారు
కుళ్ళు కుతంత్రాలతో కూరుకు పోతున్నారు!..
ఈ వైఖరులు నశించాలి!..

మోసాలతో మీసాలు దువుతారు
పగలతో తల పాగను చుట్టుకుంటారు
ఏరూపంలో ఉన్న మనిషి తనం మారాలి!..
మనిషితనమనే దీపాన్ని ఆర్పెస్తే
చివరికి మీకుమీరే కాలిబూడిదవవుతారు!..
మనిషిలోని నిజమైన ప్రతినిధిని కోల్పోతారు!..

అందుకే మీలో పాతుకుపోయిన...
మానవీయత లేని 
చీకటి శాసనాలను తొలగించుకోవాలి
కరుడుకట్టిన స్వార్తపు పొరలను తొలగించాలి
కక్ష సాధించటం కంచే కట్టుకోవడం మానుకోవాలి!..

మీ చూపులతో అమాయకుల 
బతుకు రాతలు తెగిపోతుంది..
భవిష్యత్ బతుకు బూడిదవుతుంది!..
మనసు లోతులు మనిషి ఎత్తులు 
బవుషా ఎవరికి అర్థం కావు
ఎన్ని ప్రమాదాలు పోటెత్తిన
అన్నిటికీ మనిషే ప్రమాణం..
అందుకే మనిషి తనం మార్చుకోవాలి!..
సమైక్యతతో సాగాలి మనుగడ సాగించాలి!..

జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా

అంబటి నారాయణ
నిర్మల
9849326801

No comments:

Post a Comment