కొయ్యగుర్రం……!!
విజయనగర సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలించిన కృష్ణదేవరాయలు ఒకనాడు అడవికి తన సైన్యం మంత్రి తో వేటకి వెళ్ళాడు. వేటాడి అలసిపోయి ఒక పెద్ద మర్రి వృక్షం కింద నీడలో సే ద తీరుతున్నాడు.
అలా సేద తీరుతున్నప్పుడు కొంచెం దుారంలో ఎదురుగా ఒక తాటి చెట్టు కింద ఒక బాటసారీ తల మీద తను వాయించే డప్పు పెట్టుకొని నిలబడ్ధాడు..!! ఆ దృశ్యం కృష్ణదేవరాయలు వారు చుాసారు...!!ఆనక పెద్దగా పక పక నవ్వారు.
మంత్రి!! ఇలా రా! అనిపిలిచి...ఇప్పుడు నేను ఎందుకు నవ్వానో చెప్పు....చెప్పలేదో నీతల తీయుంచివేస్తాను..నా మనసులోని మర్మాన్ని కనిపెట్టి నాకు అత్యంత శ్రేయెాభిలాషి అయిన మంత్రి తిమ్మరుసు ఇప్పుడు వుండి వుంటే చెప్పగలిగేవాడు...!! వారు లేనందున నీవే మంత్రివి నీవు కుాడా తిమ్మరుసు లా ఆలోచించి నేను ఎందుకు నవ్వానో చెప్పాలి....!!
ఇక కొత్త గా విధుల్లోకి చేరిన మంత్రి కి రాజు గారు ఎందుకు నవ్వారో ..ఏమి గుర్తు కు వచ్చి నవ్వారో అది తెలుసుకోవడం నా వల్ల కాదు...చెప్పలేను...కనీసం ప్రాణాలైనా దక్కించుకోవాలనీ సైన్యం కన్నలు కప్పి రహస్యం గా అక్కడనుండి తప్పించుకొని ఏటు వెళుతున్నాడో కుాడా తెలియక పరుగు లంఖించుకున్నాడు.అలా పరిగెత్తి పరిగెత్తి....ఒక గుహ దగ్గరకు చేరాడు.ఆ గుహలో దాక్కుందామనీ పోతుంటే అక్కడ మునుపటి మంత్రి తిమ్మరుసు తారసపడ్డాడు...మహాత్మా!! మీరు ఇక్కడ వున్నారేమిటి? మన ప్రియమైనమహారాజు "మీరు రాణి గారి మేలి ముత్యాల హారం దొంగిలించి తీసుకుపారీపోయారనీ రాజ్యం లో ప్రకటించి....న న్ను మంత్రి గా నియమించారు"..కానీ రాజావారు..ఈదినం వేటకి వచ్చి పక పక నవ్వి నేను ఎందుకు నవ్వానో చెప్పమన్నారు.చెప్పకుంటే తలతీయిస్తాన ని అన్నారు...అందుకే ఇటువైపుగా పారిపోయివచ్చాను..గుహలో దాక్కోవాలని...!! అని మంత్రి చెపుతున్నాడు...అంతా విని తిమ్మరుసు..నీవు చెప్పింది నిజమే! " రాణి వారు ఒకరోజు నాకు ముత్యాలహారం మెరుగు పెట్తీంచమనీ నా చేతికి ఇచ్చారు..నేను దాన్ని ఒక దగ్గర వుంచాను..పని నిమిత్తం వేరే చోటికి వెళ్లి వచ్చి చుాసేసరికి హారం లేదు...!! నాకు జాతకం లో నింద అవమానం అపవాదు పడుతుంది .అని వుంది. ఆసమయం వచ్చేసింది..ఆ సమయానికి రాణి వారు నాకు ముత్యాల హారం ఇవ్వడం, అది మాయమై పోవడం సంభవించాయి..మనకు కాలం బాగలేదని ఇలా చెప్పాపెట్టకుండా గుహలో దాక్కున్నాను. ఇప్పుడు నాకు అవమాన కాలం అయిపోయింది ..నేను రాజు గారు ఎందుకు నవ్వారో నేను చెపుతాను...నీవు కుాడా జరిగిన దంతా రాజు గారికి చెప్పు.. ఒక రోజు సభ ఏర్పాటు చేయించు. నా మీద పడ్ధ నిందను, మరియుా రాజు గారు ఎందుకు నవ్వారో అంతా చెపుతాను.."! కాన నీవు వెళ్లి నేను చెప్పిన రోజు కి అందరుా హాజరు అవ్వండి .రాజస్థానంలో .అనిమంత్రి తిమ్మరుసు వెళ్లి పోయాడు.
*************
కొత్త మంత్రి రాజు కి జరిగిన విషయం చెప్పాడు...అప్పుడు * రాజు...అవునా! తిమ్మరుసు అలా అన్నాడా? ఒకవేళ తిమ్మరుసు కి ముత్యాల హారాలు కావాలంటే ...ఇస్తాను కదా...ఒక హారం కోసం న న్ను రాజ్యాన్ని వదిలి పారిపోవాలా?అని తిమ్మరుసుని తలుచుకొని బాధపడ్డాడు...
ఆ రోజు రానే వచ్చింది .రాజస్టానంలో సభికులు మంత్రులు సామంతులు , ప్రజలు మహారాజు , మహారాణి అందరుా సమావేశమైనారు..మహామంత్రి తిమ్మరుసు రాజస్థానంలోకి అడుగుపెట్టాడు.భటుల్ని ఫలాన చోట వుంచిన కొయ్యగుర్రం బొమ్మ తెమన్నాడు.వాళ్ళు దాన్ని తెచ్చిపెట్టారు.సమయం చుాసుకున్నాడు..అందరుా కొయ్యగుర్రం వైపు చుాడమన్నాడు..అది ముత్యాల హారం నోట్లోనుండి బయటకు వదలతా..వుంది .ఇక అప్పుడు చెప్పాడు తిమ్మరుసు....ఒకనాడు మహారాణి నా చేతికి ముత్యాల హారం ఇచ్చారు...నేను ఈ గుర్రం దగ్గర పెట్టి పని మీద వెళ్ళాను.నేను తిరిగి వచ్చేసరికి ఈ గుర్రం ముత్యాల హారం మింగు తుంటే చుాసాను...నా జాతకం లో నింద అవమాన ఘడియలు వచ్చేసాయి...అప్పుడు నేను ఏమి చెప్పిన ఎవరు నమ్మరు..అందుకే కొంత కాలం రహస్యం గా గుహలో దాగాను...అదే సమయంలో మంత్రి పరిగెత్తుతుా గుహలోకి వచ్చి జరిగినదంత చెప్పాడు...ఇక ఈదినం ఈ ఘడియకి నాకు నింద పోయెాసమయం వచ్చింది .అందుకే ఈ గుర్రం ముత్యాల హారం నోట్లో నుండి వదులుతుావుంది. ఇక రాజుగారు నవ్వింది ఎందుకంటే
....
మర్రివిత్తు ఆవగింజంత....కాని ఎంతోమంది కి నీడనిచ్చి సేదతీరుస్తుంది..కాని తాటి విత్తు చాలా పెద్దది ..కానీ ఒక్క మనిషి కి నీడ నివ్వలేదు..కదా...అని..నవ్వువచ్చింది..తమరికి... అనగానే....శ్రీకృష్ణ దేవరాయులు సింహాసనం దిగివచ్చి తిమ్మరుసు ని గట్టిగా కౌగిలించుకున్నాడు...!!
No comments:
Post a Comment