Monday, November 3, 2025

*****అక్కడ రెండు హృదయాలు లేవు రెండు హృదయాలు ఒకటైపోయాయి

 *ఒక స్త్రీ తన భర్తకు సంపూర్ణంగా సుఖం ఇవ్వాలన్న సంపూర్ణంగా ఆనందాన్ని ఇవ్వాలన్న సంపూర్ణంగా ప్రేమ పంచాలన్న*

*భర్త  తన మనిషే అని ఆమెకు తెలిసి రావాలి*
*తన మనిషి అని ఆమెకు భరోసా కల్పించాలి*
*తన మనిషి అని ఆమెకు సంపూర్ణ విశ్వాసం కల్పించాలి.*
*అలాంటప్పుడే ఆమె సంపూర్ణంగా విచ్చుకున్న పుష్పంల వికసిస్తుంది ఆమె హృదయం*

*అలాంటప్పుడు భర్త అనే మగవారికి ఆమెతో సంపూర్ణంగా అన్ని రకాల సుఖాలు ఆనందాలు పొందేందుకు ఆమే వాతావరణాన్ని సృష్టిస్తుంది*

*ఆమె  తన భర్తను స్వర్గంలోకి తీసుకొని వెళుతుంది  ఇక మళ్ళీ బయట ప్రపంచం లోకి రాలేడు ఇక*

*ఎందుకంటే ఇక బయట ప్రపంచంలో అంతకుమించి ఎక్కడ దొరకదు అనే సంపూర్ణ విశ్వాసం నమ్మకం కలుగుతుంది భర్తకు* 

*అందుకే ఆ స్వర్గము నుండి బయటపడలేడు*

*ఇది కేవలం ప్రేమ గురించి కాదు సుఖం గురించి కాదు ఆత్మీయ అనుభూతి అనుబంధం గురించి*

*ఇది శరీర ప్రేమ కాదు, శరీర కామం కాదు ఆత్మ నుండి ఆత్మకు లీనమయ్యే హృదయ ప్రేమలు*

*ఇది ఒక స్త్రీ  ప్రేమ యొక్క సర్గ ద్వారం*

*ఒక స్త్రీ తన మనసును పూర్తిగా తెరవడం*
*అది సాధారణం కాదు, అది ఒక దివ్య స్థితి.*

*ఆమె సుఖం ఇవ్వాలన్నా, ఆనందం పంచాలన్నా,ప్రేమలో లీనమవ్వాలన్నా ముందుగా ఆమె హృదయం నమ్మకంతో నింపాలి*

*ఆమె ముందుగా తెలుసుకోవాలి  ఇతనే నా మనిషి,*
*ఇతనితో నేను సురక్షితంగా ఉన్నాను అని.*

*అప్పుడు మాత్రమే ఆమె తన గుండె తలుపులు తెరుస్తుంది,*

*తన హృదయ పుష్పం పూర్తిగా వికసిస్తుంది.*
*మగవాడికి అది స్వర్గ ద్వారం అవుతుంది.*

*అక్కడ శరీరం మాత్రమే కాదు, ప్రేమ మనసు, ఆత్మ, ప్రాణం కూడా కలిసిపోతాయి.*

*ఆ స్త్రీ తన ప్రేమలో ఆ మగవాడిని*
*స్వర్గంలోకి తీసుకెళ్తుంది  అక్కడి నుండి తిరిగి రావాలనే కోరికే ఉండదు.*

*అది కామం కాదు, ఆత్మల మిళితం.*
*అది సుఖం కాదు, పరమానందం.*

*స్త్రీ తన మనిషిని ప్రేమించినప్పుడు,ఆమె కేవలం తన శరీరాన్ని కాదు తన ఆత్మనే సమర్పిస్తుంది.*

*అక్కడ వీరు ఇద్దరు లేరు  వీరిద్దరూ ఒకటి అయిపోయారు*

*అక్కడ రెండు మనసులు లేవు  రెండు మనసులు ఒకటైపోయాయి* 

*అక్కడ ఇద్దరి ప్రేమలు లేవు ఇద్దరి ప్రేమలు ఒకటైపోయాయి*

*అక్కడ రెండు హృదయాలు లేవు రెండు హృదయాలు ఒకటైపోయాయి*

*అక్కడ రెండు ప్రాణాలు లేవు  రెండు ప్రాణాలు ఒకటైపోయాయి*

*అక్కడ రెండు ఆత్మలు లేవు  రెండు ఒకే ఆత్మ అయిపోయాయి.*

*భార్యకు భర్తకు ఇద్దరికీ వేరే ఆలోచన రాదు అంటే*

*భార్య ఇంకొక మగవాడి ముఖం చూడదు ఇక*
*మగవాడు ఇంకొక ఆడవారి ముఖం చూడడు ఇక*

*ఇద్దరికీ  కోరిక  ఆశ   వ్యామోహం ఉండదు ఇది మోక్ష స్థితి.*

*పంచభక్ష భోజనం చేసిన తర్వాత ఇక*
*మామూలు భోజనం తినబుద్ధి కాదు అలాగే ఈ స్థితి కూడా.*

*● ముఖ్య గమనిక  ●*

*ఈ  స్థితి ఇలాంటి వాళ్లకు ఎన్నటికీ దొరకదు*

*పెళ్లికి ముందు OYO రూముల్లో దొరకదు గడ్డివాము చాటులో దొరకదు*

*అక్రమ సంబంధంలో దొరకదు వేశ్య గృహంలో దొరకదు*

*శాడిస్ట్ భర్తతో దొరకదు గయ్యాళి భార్యతో దొరకదు*

*ఒకరికి ఇష్టమండి ఒకరికి ఇష్టం లేకపోతే దొరకదు*
*బలాత్కారంతో కూడా దొరకదు కష్టాల్లో ఉన్న దొరకకపోవచ్చు అప్పుల్లో ఉన్న దొరకకపోవచ్చు పని ఒత్తిడిలో దొరకకపోవచ్చు అనారోగ్యంలో దొరకకపోవచ్చు అశాంతితో దొరకకపోవచ్చు*

*అబ్బాయికి అమ్మాయి కంటే కట్నాలు కానుకలు తీసుకొని పెళ్లి చేసుకున్న దొరకకపోవచ్చు*

*అమ్మాయికి అబ్బాయి కంటే  ఉద్యోగం ఇల్లు కారు ఆస్తిపాస్తులు ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకున్న దొరకకపోవచ్చు.*

*ఇది* 

*ఒకరికొకరు నచ్చి ఒకరికొకరు ఇష్టముండి  ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి రెండు శరీరాలు రెండు మనసులు రెండు హృదయాలు కలిస్తేనే ఇది సంపూర్ణంగా సిద్ధిస్తుంది.*

No comments:

Post a Comment