*బాల్యదశ నుండి మీ పిల్లలకు భగవద్గీతామృతాన్ని రుచి చూపించండి... గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే...*
*మీ పిల్లలను హిందువులుగానే పెంచండి. కేవలం చెప్పుకోడానికి హిందువుగా కాదు. ఆచరణాత్మక హిందువులం కావాలి. మన ఉనికిని కోల్పోవద్దు. మన వేష భాషలు, కట్టూ బొట్టూ వదిలివేయొద్దు. మన సంస్కృతి, సంప్రదాయాలను, మన ధర్మాన్ని మరిచిపోవద్దు.*
*హిందూయిజానికి మించిన ధర్మ మార్గం మరియొకటి లేదు. ఇది సర్వజనామోదయోగ్యమైనది. ఆచరణకు సులభసాధ్యమైనది. ఈ ధర్మానికి బలమైన పునాది భగవద్గీత. ఇది సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మం నుండి సర్వ మానవాళిని ఉద్ధరించడానికి బోధించబడిన కర్తవ్య బోధ. దీనికి సర్వ శాస్త్రమయి అని పేరు.*
*భగవద్గీత ఒక్కటి చదివితే సర్వశాస్త్రాలూ చదివినట్టే. భవరోగాలకు 'భగవద్గీత' కు మించిన దివ్య ఔషధం మరొకటి లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ప్రతీ శ్లోకమూ సకల మానవాళికి ఉపయోగపడే ఒక్కో జీవిత పాఠం.!*
*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁📖🍁 🙏🕉️🙏 🍁📖🍁
No comments:
Post a Comment