Thursday, November 27, 2025

 కలియుగ ఆవు పులి కథ
     పాత కథ అందరికీ తెలిసిందే... కొత్త కథ ఏమిటంటే ఆవు అడవిలోకి వెళితే పులి ఎదురు పడి ఆవును తినడానికి ముందుకు వస్తె ఆవు పులికి పాత కథ చెప్పి దూడకు పాలు ఇచ్చి వస్తానంటే పులి కూడా ఆవును వదలి వేస్తుంది.
     పులి కోసం ఆవు ఎదురు చూస్తుంటే అటు వైపు వెళుతున్న ఒక నక్క ఏమిటి పులి మామ జరిగిన విషయం వివరంగా చెబుతుంది.
     అపుడు నక్క కిందా మీదా పడి విపరీతంగా నవ్వడం మొదలు పెట్టింది. అపుడు పులికి బాగా కోపం వచ్చి అసలు ఏమి జరిగిందో చెప్పు అని ఘాండ్రిస్తుంది.
     అపుడు నక్క ఏమీ లేదు పులి మామ అది ఆవు కాదు ఎద్దు... ఆవును అని చెప్పి పాత కథ చెప్పి మోసం చేసింది అని నింపాదిగా చెబుతుంది.
     పులి అవాక్కు అయిపోయింది.

No comments:

Post a Comment