Wednesday, November 26, 2025

 *మొద్దుబారిపోయిన మనసుపొరల్ని మౌనంగా మందలించే సినిమా*

*పొద్దంతా బీడీలు చుడుతూ  రాత్రంతా తాగుబోతు తిరుగుబోతు స్ర్తీలోలుడైన భర్తతో దెబ్బలుతింటూ ఇటు సంసారాన్ని సాగిస్తూ ,అటు తన కొడుకును చదివించుకుంటున్న ఒక సాధారణ వివాహిత యమున..*

*ఒకరోజు*
*యమునని తన భర్త వీపరీతంగా కొడుతూ బూతులు తిడుతూ తన చేతిగాజుల్ని లాక్కోడానికి ప్రయత్నిస్తుంటాడు*
*వొద్దండి నన్ను కొట్టకండి మన కొడుకు ముందు నన్నలా బూతులు తిట్టకండి మీకు దండంపెడతాను*
*ఇప్పడికైనా దాని దగ్గరికి వెళ్లడం మానేయండి దాని వాళ్ల ఊర్లో చాలామంది కాపురాలు* *కూలిపోయాయండి అని* *కాళ్లుపట్టుకొని బలిమాలుతుంటది అయినా వినకుండా ఆ గాజులు లాక్కొని  అదే స్త్రీ దగ్గరికి వెళ్తాడు భర్త*

*తెల్లవారి*
*తను బీడీలు చూట్టే పనిచేసే యజమాని దగ్గరికి వెళ్లి అయ్యా కొంత డబ్బుకావాలి అడ్వాన్సుగా మా అబ్బాయి స్కూల్ ఫీజ్క ట్టాలని అడుగుతుంది నీ భర్త నిన్ననే వచ్చి పట్టుకెళ్లాడని యాజమాని చెప్తాడు.*
*కావాలంటే మళ్లీ ఇస్తాను కానీ.... దానికి నువ్వేం ఇస్తావు తిరిగి అంటాడు.*

*ఇక చేసేదేమి లేక*
*ఆ స్త్రీ ఇంటికెల్లి తన భర్తని బయటికి రమ్మని పిలుస్తుంటది నా రెక్కల కష్టమంతా నా ఒంటిమీద బంగారమంతా దానికి దారపోసావని అరుస్తుంటది ఊరి జనమంతా నిలబడి చూస్తుంటారు.*
*కోపంతో బయటికి వచ్చిన  భర్త పహిల్వాన్*
*పాన్ నములుతూ యుమున ముఖమ్మీద కాండ్రించి ఉమ్మేస్తాడు.*
*యమున ముఖమంతా ఎర్రని జర్ధాతో నిండిపోతది.*
*కండలు బలిసిన మగవాళ్లంతా అచేతనంగా నిలుచుంటారు సాంప్రదాయాన్ని భర్తల* *భరితెగింపుతనాల్ని గౌరవంగా తొడుకున్న మహిళలంతా నెత్తిన కొంగుకప్పుకొని చూస్తుంటారు.*

*యమున అలాగే వెళ్లి. ఒక బ్రిడ్జిమీద నుండి చెరువులో దూకి తన భర్త ఉమ్మేసిన జర్ధాని కడుక్కొని*
*తడిసిన బట్టలతో ఊరి మధ్యలోనుండి నడుచుకుంటు ఇంటికి వెళ్తుంటది.*
*ఊరు ఊరంతా పక్షవాతంతో పడిపోయిన నోరులా మౌనంగా ఉండిపోతది.*

*ఆరోజు*
*ఊరుని భర్తని వదిలేసి  తన కొడుకుని తీసుకొని బస్సు ఎక్కి వెళ్లిపోయిన యమున ముంబాయి చేరుకుంటది.*
*25 ఏళ్లుగా ముంబాయిలో కాపురముంటున్న తన అక్క బావ దగ్గరికి వెళ్లిపోతది.*
*యమున అక్క తనని ఓదార్చి ధైర్యంచెప్పి ఇక నీ భర్త చనిపోయాడనుకో ఉన్న నీ కొడుకే జీవతమనుకోని బతుకు అని చెప్తది.*
*ఏదో ఒకపని చేసుకొని కొడుకుని బాగా చదివించుకోవాలనే ఆలోచనతోఉన్న యమున పనికోసం చాలా చోట్ల తిరుగుతుంటది కాని ఎక్కడా పని దొరకదు.*

*ఒకరోజు.... పొద్దున్నే   రెడీ అయి పనికి వెళ్తున్న తన అక్క ని ఫాలో అవుతు తన వెనకాలే వెళ్తుంది యమున.*
*నగరంలో ఒక ఆర్ట్స్ కళాశాల లోపలికి వెళ్తుంది యమున వాళ్ల అక్క*
*అక్కకి కాలేజీలో ఏంపని అక్కడ ఏంచేస్తుందని చాటుగా ఒక కిటికిగుండా చూస్తుంటది.*
*చుట్టూ కొందరు విద్యార్థులు, మధ్యలో తన అక్క నగ్నంగా కదలకుండా కూర్చొని ఉంటది.*
*ఒక్కసారిగా షాక్కి గురైన యమున ఇంటికి పరిగెత్తుకొని వస్తది.*

*తెల్లవారి....*
*యమున: అలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా అక్క అంతమంది మధ్యలో ఒంటిమీద బట్టలు లేకుండా ఎలా కూర్చున్నావు*

*అక్క: సిగ్గేందుకు వాళ్లంతా చదువుకునే పిల్లలు*
 *వాళ్లు మనని వేరే ద్రుష్టితో చూడరు*
*మన శరీర ఆక్రుతికి వాళ్లొక రూపాన్నిస్తారు ఆ రూపానికి రంగురంగుల మాటలద్దుతారు.*  

*యమున: ఈ పని ఎందుకు చేస్తున్నావు*

*అక్క: మీ బావ తాగుడికి బానిసై పనిచేయడం మానేసాక*
*నాకు వేరే పని దొరక్క ఇలా చేస్తున్నాను*
*ఇందులో ఏలాంటి ఇబ్బంది లేదు ఆ విద్యార్థుల వల్ల ఏ ప్రమాదమూ లేదు.*
*ఆడవాళ్లవే కాదు మగవాళ్లవి కూడా బొమ్మలు వేస్తారు అదే వాళ్ల చదువు.*

*యమున : మరి బావకి తెలుసా ఈ విషయం*
*అక్క: లేదు కాలోజీలో ఊడ్చే పనిచేస్తానని తెలుసూ*
*వాస్తవానికి మొదట్లే ఊడ్చేదాన్ని తరువాత ఎవరు సమయానికి దొరక్క నన్ను అడిగారు నేను ఒప్పుకున్నాను*

*అక్క చెప్పిన మాటలు, చేస్తున్న పని తప్పుకాదని ఆలోచించుకున్న యమున*
*ఏ పనైతేంటి అన్నింటికంటే నా కొడుకు చదువే నాకు* *ముఖ్యమనుకొని. తను కూడా (న్యూడ్ పోజ్) పనిలోకి  వెళ్లడానికి సిద్ధపడుతుంది.* *కొడుకు చదువుకోసం బడి వెతుకుతుంటది రోజులు గడిచిపోతుంటాయి*

*ఒకనాడు ఇద్దరు కలిసి కాలేజిలో  చెత్త ఊడుస్తుండగా యమునకి వాళ్లిద్దరు నగ్నంగా గీయబడున్న కొన్ని పేపర్లు దొరుకుతాయి*
*వాటీని  భద్రంగా తన జాకెట్ లో దాచుకుంటది యమున  అది చూసిన అక్క వాటిని బయటికి తీసి మంటల్లో వేస్తుంటది.*
*అప్పుడు ఆలోచనలో పడ్డ యమున ఇవి ఎవరికి దొరకకూడదు ముఖ్యంగా తన కొడుక్కి కనపడకూడదు అని ఈ సంఘటనతో ఆలోచనలో పడ్డ యమున*
*ఇక కొడుకుని ఈ దారిదాపుల్లో చదివించకూడదని నిశ్చయించుకుంటది*
*ఎందుకంటే తన కొడుక్కి కూడా ఆర్ట్ వేయడం ఇష్టమని అందువల్ల ఇక్కడుంటే ఏదో ఒకరోజు ఈ కాలేజి గురించి తెలుసుకుంటాడని తను చేస్తున్న పని తెలిసిపోయే అవకాశముందని ఆలోచించి*
*తనని ముంబాయి కి దూరంగా వేరే నగరంలో చదివిస్తుంటది.*
*కొడుకు చదువుకోసం గంటల తరబడి  (న్యూడ్ పోజ్)  లు ఇస్తూ  తన కొడుక్కి డబ్బులు పంపిస్తూ ఉంటది.*

*ఒకరోజు....*
*కాలేజి నుండి తిరిగివచ్చిన కొడుకు యమున ని నాకు  ఇంకా డబ్బులుకావాలని అడుగుతాడు*
*ఇంకా ఎన్నేళ్లు ఉంది నీ కోర్స్ ఎపుడైపోతది అని అడుగుతుంది.* 
*కోర్స్ లేదు ఏంలేదు నేను చదువుకోను దుబాయ్ కి వెళ్తాననుకుంటున్నానని  చెప్తాడు.*
*ఒక్కసారిగా ధిగ్ర్భాంతికి గురైన యమున ఏం* *మాట్లాడుతున్నావురా నేను ఎంత కష్టపడి పైసా పైసా పోగుచేసి నీకు పంపించానో తెలుసా అని ఏడుస్తూ తిడుతుంటది.*

*నువు కష్టపడి డబ్బులు పంపించావా*
*అసలు నీకు అన్ని డబ్బులు ఎక్కడివి నాకు పంపించడానికి*
*నువ్వు కష్టపడి సంపాదించలేదు ఎక్కడపడితే అక్కడ పడుకొని నాకు డబ్బులు పంపించావు*
*మీ అక్కాచెల్లెల్లు ఇద్దరు అదే పని చేస్తున్నారు మీరిద్దరు లం#Jలు అని తిడుతుంటాడు.*

*సినిమా క్లైమాక్స్ లో ....*
*యమున సముద్రతీరాన వర్షంలో నుంచొని ఉంటది*
*బహుశా ఆమె దుఖ్ఖం* *కనిపించకూడదని కాబోలు కాసేపటి అదే సముద్రంలో కలిసిపోతది*
*బహుశా సముద్రానికున్నంత భీకర దుఖ్ఖమున్నందుకు కావొచ్చు..*

*____కొన్ని సంవత్సరాల తరువాత....*

*యమున కొడుకు మరియు అతని స్నేహితులు ఆర్ట్స్ కాలేజి పక్కనుండి నడుచుకుంటూ వెళ్తుంటారు*
*ఆ కాలేజి గోడమీద  ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఉందని ఒక పోస్టర్ చూసి లోపలికి వెళ్తాడు యమున కొడుకు....*
*లోపల అన్ని నగ్నంగా ఉన్న ఆర్ట్స్ చూస్తుంటాడు*

*ఒక ఫోటో దగ్గర మాత్రం అలాగే ఆగిపోతడు ఆ ఫోటో కాలినుండి భుజాల వరకి కసిగా చూసిన అతడు తల చూడగానే అసహ్యించుకొని ఉమ్మేస్తాడు.*

*తన తల్లిని అలా గీసిన చిత్రకారున్ని కొడతాడు..*
                *______THE END_____*

*ఎవరికోసం యమున ఆ పని చేయాల్సివచ్చింది అది తప్పని ఈ సమాజం ఎలా నిర్ణయించుకుంది*
*ప్రాపంచిక ద్రుక్పథం కలిగిన వాళ్లకి యమున చేసిన పని తప్పని అనిపించకపోవచ్చు ఎందుకంటే అది తప్పే కాదు కాబట్టి. కానీ కన్నకొడుకే నువు లం#Jవని ఎలా అనగలిగాడు*
*అతనిచేత ఎవరనిపించారు ఎక్కడ విన్నాడు ఎవరిని చూసి నేర్చుకున్నాడు తను తల్లి ఒక లం#J అని ఎలా నిర్ణయించాడు* 

*ఆనాడు యమున జీవితాన్ని తనభర్త ఎలా ధ్వంసంచేసాడో ఈనాడు కొడుకే జీవితమని బతికిన యుమన ని తన కొడుకు కూడా అలాగే ధ్వంసం చేసాడు.*
*యమున చేసింది తప్పు కాదని చెప్పడానికి ఈ సమాజానికి ఇంకెన్ని శతాబ్ధాలు పడుతుందో....*

No comments:

Post a Comment