Wednesday, November 5, 2025

 *ఓం నమో శ్రీ శివ కేశవాయ నమః*🙏🙏🙏

             *భక్తి అంటే ఏమిటి..?*
                  ➖➖➖✍️

*భగవంతుని మనసా స్మరిస్తూ, ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి.* 🙏🙏🙏

*ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుణ్ని స్మరించడమే భక్తి.*🙏🙏🙏

*రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి.* 

*శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి.* 

*గురువుపై శిష్యునికి ఉండేది భక్తి.* 

*భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి  అంతర్లీనంగా ఉంటుంది.*🙏🙏🙏 

*ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవడమే అనే ధ్యాసలో భక్తులున్నారు.* 

*కోర్కెల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్ధించాలనుకునేవారికి అసలు భక్తి తత్వపు పరమార్ధం బోధపడనట్లే.* 

*ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వవ్యాపకునికి మన కోర్కెలు తెలిపి, ఇదీ నా ఫలానా    నా అవసరం,  దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా.* 

*మనతో పాటు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన        ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..? సరిగ్గా ఆలోచిస్తే, భగవంతునితో మనం కోర్కెలు మొర పెట్టుకోవడం ఎంత హాస్యాస్పదపు పనో అర్ధమవుతుంది.* 

*భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి.     వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికీ, భక్తుడికీ అక్కడే తేడా ఉంటుంది.*

*భక్తికి సరైన ఉదాహరణ, కృష్ణార్జునుల అనుబంధం*

*కృష్ణుడు అర్జునునికి రథసారథి. ఇది భౌతిక అర్ధం కాదు. జీవితమనే యుద్ధరంగంలో మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా      ఆ సర్వేశ్వరునికే వదిలేస్తే,    విజయగీత వినిపించి కార్యోన్ముఖుణ్ని చేస్తాడు ఆ అంతర్యామి.* 🙏🙏🙏

*యుద్ధానికి ముందు దుర్యోధనుణ్ని ‘నేను కావాలా నా సైన్యం కావాలా?’ అని అడుగుతాడు కృష్ణుడు.* 

*’ఈ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, సైన్యం ఉంటే సరిపోతుంది!’  అన్న విషయ వాంఛాలోచనలో, సైన్యాన్నే కోరుకున్నాడు దుర్యోధనుడు.* 

*అర్జునుడు మాత్రం, ‘నీవే నా రథసారథి పరమాత్మా’ అని శరణువేడాడు. ఫలితం కురుక్షేత్ర విజయం.*🙏🙏🙏

*ఆ అనంత శక్తిని శరణువేడి ‘నా జీవితమనే కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రీ!’ అని మనసా వాచా కర్మణా వేడిన నాడు, మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా, మాతృవాత్సల్యం లాంటి భగవంతుడి ప్రేమ మనపై అజరామరంగా కురుస్తుంది.* 

*భగవంతుణ్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అచంచల భక్తి మాత్రమే.*✍️

         
   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment