*ఆలోచనతోనే అద్భుత సృష్టి...!!*
మీ ఆలోచనలతోనే అద్భుత సృష్టి
సరి కొత్త అధ్యాయనానికి అంకురం
నిన్ను నీవు తెలుసుకుంటే
నూతన ఆవిష్కరణలు నేలపైన చేస్తావు..
నీ తెలివి నీకే సొంతం మిత్రమా
నింగిని శోధించే శక్తి
నేలపై ఏలగల యుక్తి
నీ మేధస్సుపైనే ఆధారపడింది...!!
చిన్న మెదడే అనంతం
చిరు ఆలోచనలోనే అద్భుతం
వినియోగిస్తే నూతన సృష్టి
ఆచరిస్తే నీవే ఒక ప్రయోగం...!!
నీ కలల ప్రపంచమే
నీ జీవనయానంలో తోడుంటే
నీ స్వప్నమే నిజమై
నేలంతా పరిచయం చేస్తుంది...!!
పాతాళం శోధిస్తూ
నింగిని అన్వేషిస్తూ
విశ్వమంతా వ్యాపిస్తూ
జయకేతనం ఎగరేయి..!!
గెలుపు రుచిని ఆస్వాదిస్తూ
చప్పట్లు హోరులో
ప్రపంచపు జోరుగాలిలో
నీ సువాసనలు వెదజల్లు...!!
నీ విలువైన సంతకం
నేలపై చిరస్థాయిగా నిలిచేందుకు
ఈ చిరునామే ఆదర్శంగా
యువత ముందుకు అడుగులేస్తుంది..!!
మేధస్సును ఉపయోగించకుంటే
అవయవం కోల్పోయిన దివ్యాంగుడవే
మంద బుద్ధితో సంచరిస్తూ
చీకటి నీడలో జీవితం ముగిస్తావు...!!
ఇతరులకు నీవు ఒక నిచ్చెనై
వారి అడుగులు మోస్తూ
నీ గమ్యాన్ని మరిచి
పరాజయంతో జీవితం చాలించాలి..!!
గెలుపు గుర్రమై నిలిస్తే
గర్వంగా చెప్పుకుంటూ
నీ మాటే ఒక వేదంలా
జనాలలో కావ్యమై కలకాలం ఉంటావు..!!
నీ చేతిలోనే నీ భవిష్యత్తు
సాధించగలిగితే మరో జన్మకు గుర్తు
తరతరాలకు జ్ఞాపకంగా
మహా వృక్షంలా నిలుస్తావు..!!
*కొప్పుల ప్రసాద్ 🖊️*
నంద్యాల
9885066235
No comments:
Post a Comment