Thursday, November 20, 2025

 *ఆడవారు భర్త మీద  అలుగుతారు దేని కొరకు అనుకుంటున్నారు*
 
*భర్తతో బతిమిలాడించుకుంటారు  దేని కొరకు అని అనుకుంటున్నారు*

*భర్తతో ఓదార్పు పొందాలనుకుంటారు  దేనికొరకు అని అనుకుంటున్నారు*

*స్త్రీ అలుగుతుంది ప్రేమను నిర్ధారించుకోవడానికే*
*తన భర్తకు తన మీద ఎంత ప్రేమఆప్యాయత నమ్మకం ఉన్నాయా  అసలు ఉన్నవా లేవా అని ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూ ఉంటుంది*

*ఆడవారికి భర్త మీద అనుమానం ఎక్కువ*
*ఎక్కడ తన భర్తను ఇంకొక ఆడవారు ఎగరేసుకొని వెళ్తారో అని*

*లేకపోతే భర్త వేరే వారితో చనువుగా ఉంటున్నారా నన్ను పట్టించుకోవడం లేదా అని మాటిమాటికి ఫోన్ చేస్తుంటారు*

*ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని*
*ఎప్పుడు ఆరాలు తీస్తూ ఉంటుంది*

*ఇదంతా భర్త తన అదుపులోనే ఉన్నాడా లేదా అని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిత్యం*

*అందుకే అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటుంది.*

*ఆమె అలుగుతున్నది కోపంతో కాదు*
*నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో చూద్దాం అన్న భావంతో.*

*అలక అనేది ఒక పరీక్ష కాదు,ప్రేమలోని సున్నితమైన భాష.*
*ఆమె తన హృదయంలో  నువ్వు నన్ను ఎంతగా బుజ్జగిస్తావో చూస్తా అని అనుకుంటుంది.*
*అది ఆమెకు ప్రేమను స్పష్టంగా అర్థం చేసుకునే ఒక పద్ధతి.*

*అలక అనేది స్త్రీకి ఒక భావోద్వేగ ఆట*
 
*ఆమెకు బుజ్జగింపే ఆనందం.*
*భర్త ప్రేమతో మాట్లాడితే, తన మీద శ్రద్ధ చూపితే*
*ఆమె హృదయం తేలిపోతుంది. అందుకే ఆమెకు అలక అనేది ఒక ప్రేమ పరీక్ష*

*బతిమిలాడించుకోవడం  ఆమె ప్రేమలో భద్రత కావాలనే సంకేతం*
*ఆమె కోరేది క్షమాపణ కాదు,*

 *#ప్రేమ ధృవీకరణ.*
*నువ్వు బుజ్జగిస్తే, ఆమె మనసు చెబుతుంది:*
*ఇంకా నాకోసం ఆయనకు నామిద శ్రద్ధ ఉంది, ఆయనకు నామీద ప్రేమ తగ్గలేదు అని నిర్ధారణ చేసుకుంటుంది*

*అదే బతిమిలాడించుకోవడం ఆమె హృదయానికి ప్రేమ భరోసా. ఇంకా నేనంటే ఇష్టం పోలేదు అని నిర్ధారణ చేసుకుంటుంది*

*ఆమెను ప్రేమగా చూడకపోతే భర్త హృదయంలో ప్రేమ లేదేమో అందుకే నన్ను పట్టించుకోవడం లేదు అనే నిర్ణయానికి వస్తుంది  అందుకే ఆమె మాటిమాటికి టెస్ట్ చేసుకుంటుంది*

*ఆమె మారం బెట్టడం కూడా ఈ ప్రేమ స్పందనే*
*భర్త చూపిన ఓదార్పు, స్నేహం, బుజ్జగింపు చూసి తక్షణమే మెత్తబడిపోతుంది.*

*మగవారు ఆడవాళ్ళను అపార్థం చేసుకుంటారు మాటిమాటికి అలుగుతుంది మాటిమాటికి బుంగమూతి పెడుతుంది నాటి నాటికి బెట్టు చేస్తారు అని అనుకుంటారు*

*మొగుడు ఆమెను ఎంత  బతిమిలాడితే వారికి అంత ఆనందం కలుగుతుంది*

*ఆడవారికి ఎంత బుజ్జగిస్తే అంత ఆనందం కలుగుతుంది*

*ఆడవారు బెట్టు చేస్తారు  మగవారు కాస్త తగ్గి ఉంటే  ఆనందిస్తారు*

*ఆడవారు వాదిస్తూ ఉంటారు భర్త మీద గెలవాలని చూస్తారు భర్త మీద గెలుపు వారికి ఆదో సరదా సరే నీదే గెలుపు అంటే ఆనందిస్తారు*

*#స్త్రీ అలుగుతుంది ప్రేమను కొలవడానికి కాదు, ప్రేమను మరింత దగ్గర చేయడానికి.*

*ఇవన్నీ ఎందుకు చేస్తారంటే  భర్తను పరీక్షించడానికి తన మీద భర్తకు ప్రేమ అభిమానం నమ్మకం విలువ #గౌరవం ఉన్నావా లేవా అని నిరంతరం పరీక్ష చేసుకుంటారు.*

*పరీక్షలో వారు గెలిస్తే ఆనందిస్తారు  వారి పరీక్షలో ఏ కొంచెం అనుమానం వచ్చిన భర్తను పరీక్షించే ప్రయత్నం చేస్తారు.*

No comments:

Post a Comment