Tuesday, November 4, 2025

 అక్షర హారాలు -చక్కని సూత్రాలు
----------------------------------------------------
కడలిలాంటి  బ్రతుకులో
ఆటుపోట్లు సహజమే
మానుకో  తడబడడం
నేర్చుకో  నిలబడడం

కొంతమంది మాత్రమే
చెపుతారు బ్రతుకు పాఠము
మరికొందరు నేర్పుతారు 
మరువలేని గుణపాఠము

జీవితమే విచిత్రము
భయపడకు ఏమాత్రము
చేయాలోయ్! సాహసము
చేరాలోయ్! తుది గమ్యము

వింత వింత మనుషులతో
ఉంటున్నాం! మనమంతా
కలసి మెలసి జీవిస్తే
హర్షిస్తుంది జగమంతా
-బాలబంధు గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580

No comments:

Post a Comment