Tuesday, November 4, 2025

 🦚🦚🦚🦚🦚🦚🦚

*“మనసుకి హత్తుకునేలా* *మాట్లాడేవారు కొందరు,*
*మనసు నొచ్చుకునేలా* *మాట్లాడేవారు మరికొందరు.*
*మనస్పూర్తిగా మాట్లాడేవారు* *ఇంకొందరు* 
*ఇలా అందరి మధ్య సాగే* *జీవన ప్రయాణమే మన జీవితం.”*
*“చెట్టు విలువ ఎండాకాలంలో,*
*గురువు విలువ కష్టంలో,*
*దైవం విలువ ఆపదలో,*
*స్నేహితుడి విలువ బాధలో* *తెలుస్తుంది.*
*అందుకే ఉన్నప్పుడే ఏదైనా* *కాపాడుకోవాలి.”*

*“ఒంటరిగా ఉన్నప్పుడు* *ఆలోచనలు జాగ్రత్త,*
*నలుగురిలో ఉన్నప్పుడు* *మాటలు జాగ్రత్త.”*

*“సంపదలెన్ని ఉన్నా తృప్తిలేని జీవితం వ్యర్ధం.*
*పూరి గుడిసే బ్రతుకైనా కంటి* *నిండా నిద్రపోయే* *మనిషి జీవితం ధన్యం.”*

*“పదిమంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా,*
*ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు.”* 📚

*“ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో.*
*గడుపుతున్న ఈ క్షణం మాత్రమె మనది.*
*నిన్న అనేది తీరిపోయిన ఋణం,*
*రేపు అనేది దేవుడిచ్చిన వరం.” ⏳*

*“మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా,*
*భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చెయ్.*
*అంతా మంచే జరుగుతుంది.” 🙏*

*🙏 సర్వేజనాః సుఖినో భవంతు 🙏*

🦚🦚🦚🦚🦚🦚🦚

No comments:

Post a Comment