*ఏదైనా కొనేముందు ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి*
అది నాకు అవసరమా?
ఎన్ని సార్లు ఉపయోగిస్తాను?
దీనిని వాడకపోతే నష్టం ఏమిటి?
ఈ మూడింటికి సంతృప్తికరమైన
సమాధానం ఉంటేనే కొనండి.
అలా కొన్నాళ్లు చేశారంటే అప్పటికి మీవద్ద మిగిలిన డబ్బే మీరేం చేయాలో చెబుతుంది.
*ఎవరితో ఎలా మాట్లాడాలి?*
తండ్రితో గౌరవంగా
తల్లితో సౌమ్యంగా
భగవంతునితో మౌనంగా
సోదరునితో సహృదయంగా
తోబుట్టువులతో అభిమానంగా
భార్యతో నిజంగా
పిల్లలతో ఉత్సాహంగా
నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా
అధికారులతో హుందాక
కార్మికులతో సౌమ్యంగా
స్నేహితులతో సరదాగా
వ్యాపారులతో కచ్చితంగా
*విజయం నీ చేతుల్లోనే ఉంది*
ఒకే రకమైన రాయి...
కొంతమంది దాన్ని రోడ్డుపై అడుగు వేయడానికి వాడతారు.
వ్యాపారి దాన్ని మెరుగులు దిగి, అందమైన విగ్రహంగా అమ్ముతాడు.
కళాకారుడు తన ప్రతిభతో దానిని అమూల్యమైన కళాఖండంగా మారుస్తాడు.
విజయవంతమైన వ్యక్తి అదే రాయిని అడుగురాయి కాకుండా, పునాది రాయిగా చేసుకుంటాడు.
వస్తువు ఒకటే... మన ఆలోచన మారితే, ఫలితం మారుతుంది!
నీ విజయాన్ని నీ ఆలోచనలు నిర్ణయిస్తాయి.
No comments:
Post a Comment