Thursday, November 20, 2025

 *
📗📕📗📕
నేడు చుక్కా (IIT) రామయ్య సార్ 100 వ జన్మదినోత్సవం... విద్యాదినోత్సవంగా అభిమానుల కితాబు సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, ప్రజా ప్రతినిధిగా బహుముఖ ప్రజ్ఞాశాలి..

చుక్కా రామయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగామ జిల్లా) గూడూరు గ్రామంలో 20నవంబర్ 1925లో జన్మించారు.

చుక్కా రామయ్య అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అసలు ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో చుక్కా రామయ్య అంటే తెలియని వారు ఉండవచ్చునేమో, కానీ ఐఐటి రామయ్య అంటే బహుశా తెలియని ఉండకపోవచ్చు. చుక్కా రామయ్య కంటే ఐఐటిగా ఆయన సుపరిచితుడు. దేశవ్యాప్తంగా ఐఐటి ప్రవేశాలకు శిక్షణ ఇచ్చే సంస్థలు ఎన్నో ఉన్నా, వ్యక్తులు ఎందరో ఉన్నా వాటిలో వేటికి, ఎవరికీ కూడా ఐఐటి ఇంటిపేరుగా మారిన దాఖలాలు లేవు.

ఈ అరుదైన ఖ్యాతి చుక్కా రామయ్య ఒక్కరికే సొంతం. ఐఐటి రామయ్య ఇన్సిస్టిట్యూట్‌లో శిక్షణ పొంది ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే వారి ఎదుగుదల వెనక చుక్యా రామయ్య పడిన కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలనే కారణమని చెప్పవచ్చు. చుక్కా రామయ్య పరిభాషలో చెప్పాలంటే ఐఐటిలో సీటు సంపాదించడానికి అభ్యర్థులు ఎంతగా కష్టపడుతారో, వారితో సమానంగా తాను ప్రతి ఏటా ఐఐటికి ప్రిపేర్ అయ్యేవాడినని చెబుతారు. ఒక విశ్రాంత ఉపాధ్యాయునిగా కాకుండా నిత్య విద్యార్థిగా చుక్కా రామయ్య పడిన కష్టానికి, పట్టుదలకు ఫలితమే ఆయన ఇంటి పేరు ఐఐటి రామయ్యగా మారడానికి కారణమైంది.

మీకు ఐఐటీ ఇన్సిస్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఒకరు అడిగితే, నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన తాను అప్పట్లో 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 53 ఏళ్లకే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాను. మా అమ్మాయి ఐఐటీకి ఎంపికైంది. ఆ సందర్భంగా అడ్మిషన్ ప్రక్రియకు అమ్మాయికి తోడుగా వెళ్లినప్పుడు అక్కడ 4 వందల మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. కానీ అందులో తెలుగువారు వేళ్లపై లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక ఐఐటీలో తెలుగు విద్యార్థులు లేకపోవడం ఏమిటి? అని ఆశ్చర్యపోయాను. అందులో నుంచి పుట్టిన ఆలోచననే ఐఐటీ కోచింగ్ సెంటర్ ప్రారంభించడానికి కారణమైంది అని అంటారు...
🙏👍

No comments:

Post a Comment