శంకరులు కన్నీరు పెట్టిన వేళ & మాతృభక్తి - EQ, IQ | The Emotional Story of Sri Adi Shankaracharya
Author Name:శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
Youtube Channel Url:https://www.youtube.com/@SRIRAVINDRAJYOTISHALAYAMS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2lFoPYfI7zY
Transcript:
(00:01) శ్రీమాత్రే నమః ఈరోజు జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరుల గురించి తెలుసుకోవడం వల్ల గాని లేదా వారు రచించినటువంటి స్తోత్రాలను మనము పారాయణం చేయడం వల్ల గాని వినడం వల్ల గాని కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అతే ప్రతి మనిషికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు మూడు ఉంటాయి. ఈ మూడు సరిగ్గా ఉంటే ఏ మనిషి అయినా సరే అత్యంత అభివృద్ధి సాధిస్తాడు.
(00:33) మొట్టమొదలు ఒక వ్యక్తికి ఉన్నటువంటి క్రియాశక్తి అంటే కర్మలను చేయగలిగేటువంటి ఏ మనిషి అయినా సరే చేసేటువంటి పనుల వల్లనే వ్యాపిస్తుంటాడు. ఒక మనిషి యొక్క పని ఇంత సమర్థవంతంగా ఎంత కరెక్ట్ గా ఉంటది అంతగా ఎక్కువగా వ్యాపిస్తాడు. ఒక వ్యక్తి కేవలము ఒక ఊరు లోపలనే సమర్ధవంతంగా ఉండి యాక్టివ్ గా ఉంటే ఊరు లోపలనే పేరు కటిస్తాడు.
(01:02) ఒకవేళ ఆయన కర్మలు మండలానికి విస్తరిస్తే మండలం అంతా కూడా తన పేరు తెలిసిపోతుంది. రాష్ట్రానికి విస్తరిస్తే రాష్ట్రంకు అంతా కూడా అంటే ఆయన ఆయన చేసేటువంటి కర్మలే ఆయన చేసేటువంటి పనులే ఆయనను విస్తరించేలాగా చేస్తుంటాయి. దీన్నే మనం క్రియాశక్తి అంటాం. అయితే ఇక రెండవది ఒక మనిషికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ అంటే ఎంత ప్రజ్ఞ ఉంది ఎంత తెలివితేటలు ఉన్నాయి ఎంత జ్ఞానం ఉంది అనేటువంటి విషయం కూడా ఆ వ్యక్తి యొక్క జీవితాన్నే మలుపు తిప్పుతుంటాయి.
(01:32) ఎప్పుడైతే సరైన జ్ఞానం ఉంటుందో అప్పుడే ఆ మనిషి తన జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతాడు ఇతరులను కూడా చక్కదిద్దగలుగుతాడు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఈక్యూ లెవెల్స్ అంటే ఒక మనిషి ఒక ఎమోషన్ విషయాలు అంటే ఎమోషన్ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది అతడు ఒక సమాజాన్ని ఎంతమందిని ఒప్పియగలుగుతాడు ఆ ఎంత ముందుకు వెళ్ళగలుగుతాడు ఎంత గొప్ప నాయకుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తుంది.
(02:04) అంటే ఈ మూడు సరిగ్గా ఉంచుకుంటే చాలు ఆ వ్యక్తి అత్యుత్తమంగా అభివృద్ధి సాధిస్తూనే ఉంటాడు. ఒకటి చేసేటువంటి కర్మ రెండు ఐక్యూ లెవెల్స్ సరైన విధంగా ఉండేటట్టు ఇవ్వడము ఎందుకంటే ఒక విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటామో ఆ విషయాన్ని అంతా బాగా మనం వాడుకోగలుగుతాం. అలాగే ఎమోషన్ బ్యాలెన్స్ అనేది అంటే ప్రతి ప్రతి చిన్న విషయానికి ఎప్పుడైతే మనం నోచుకోవడం అలవాటు చేసుకుంటామో అప్పుడు ఈక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నట్టు.
(02:35) ఏ విషయాన్నైనా సరే తనకు ఆనందకరంగా ఉండేటట్టే చూసుకుంటే అంటే బయట నుంచి వచ్చేటువంటి ఏ విషయం కూడా ఆ ఒక వ్యక్తి యొక్క ఆనందాన్ని ఎప్పుడైతే భంగపరచదో అప్పుడు అతని ఈక్వ లెవెల్స్ అధికంగా ఉన్నట్టు. అయితే ఈ మూడు విషయాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆ మనిషి అత్యంత అభివృద్ధి సాధిస్తుంటాడు. అయితే ఈ మూడు విషయాలే మనకు సంస్కృతం లోపల పరమాత్మకు మూడు లక్షణాలు ఉంటాయి అని చెప్పేసిని వేదాంత శాస్త్రం చెప్తుంది ఒకటి సత్ చిత్ ఆనందం సచ్చిదానంద స్వరూపం అని ఇక్కడ ఇవే లక్షణాలు ఎవరైతే ఒక ఆత్మజ్ఞానం పొందాడో లేదా తన గురించి తాను తెలుసుకున్నారో ఆ వ్యక్తికి కూడా ఇవే
(03:15) లక్షణాలు ఉంటాయి అంటే తన గురించి తాను ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటాడో ఆ వ్యక్తి కూడా ఈ మూడు లక్షణాలు ఆ పరమాత్మకు ఉన్న లక్షణాలే ఈ వ్యక్తికి కూడా ఉంటాయి ఇక్కడ ఈ సంస్కృతం లోపల సత్ అంటే ఏందంటే ఉండడం ఉండడం అంటే అంతటా వ్యాపించి ఉండడం ఇది ప్యూర్ కాన్షియస్నెస్ అనొచ్చు అయితే ఇదే క్రియాశక్తికి మూలం ఒక వ్యక్తి ఎంత కర్మల పట్టు ఉంటాడో అంటే అంత కాన్షియస్నెస్ ఉంటేనే అంత బాగా కర్మలు చేయగలుగుతాడు.
(03:46) అంటే ఈ సత్ అనేది క్రియాశక్తి యొక్క స్వరూపమే సత్ స్వరూపం ఇది దీనికి అధిదేవత నిజానికి ఈ మంత్ర శాస్త్రాలన్నీ కూడా మహాలక్ష్మీ దేవి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆదిశంకరుడు ఆత్మజ్ఞానం పొందాడు అని చెప్పేసి అన్నాం వారి జీవితాన్ని చూస్తే ఆయన ఆ కాలం లోపల ఎలాంటి వాహనాలు లేని సమయం లోపల భారతదేశం అంతా కూడా అనేకసార్లు పర్యటించి మరి తన కర్మల ద్వారా తన చేతల ద్వారా దేశాన్ని ప్రభావితం చేశారంటే ఆయన క్రియాశక్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి.
(04:20) అంటే కర్మలను చేయగలిగేటువంటి నైపుణ్యము ఎంత ఉంటే అంత దేశాన్ని ప్రభావితం చేయగలుగుతారు. అంటే ఆయన సత్త అనేది అక్కడ ఆత్మజ్ఞానం ఉందడం వల్ల అది అత్యుత్తమ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక రెండవది చిత్ అంటే జ్ఞానం ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఐక్యం అన్నాడు. ఇప్పుడు శంకరులు ఆదిశంకరులు ఆ కాలం లోపల ఉన్నటువంటి మహా మహా పండితులను తన జ్ఞానంతోని తర్కంతోని ఓడించి అద్వైత వేదాంత స్థాపన చేశారు.
(04:53) అంటే వారి ఐక్య లెవెల్స్ అంటే జ్ఞానశక్తి ఏ స్థాయిలో ఉందో మనం గమనించాలి. అంటే ఎంతటి ఐక్యం ఉంటే ఆ కాలం లోపల మరి పరమ ఎంతో గొప్పవారు పండితులు అయినటువంటి వ్యక్తులందరూ కూడా శంకరులు గొప్ప గొప్ప పండితులే శంకరులకు శిష్యులయ్యారు అంటే ఆయన ఐక్య లెవెల్స్ ఏ లెవెల్ ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక మూడవది మనం ఆనందం ఆనందం అంటే ఒక రకంగా ఇచ్చాశక్తి అంటే ఈక్యూ ఈక్యూ లెవెల్స్ దీన్ని ఇప్పుడు ఇప్పటి కాలం లోపల ఈక్యూ అని చెప్పేసి అని చెప్పొచ్చు అంటే ఇది ఎమోషన్స్ యొక్క మూల స్వరూపమే ఆనందం ఇప్పుడు మనం గమనించినమ అంటే మనకు ఎమోషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి బాగా సూక్ష్మంగా
(05:37) విభజిస్తే కేవలం రెండు రకాల ఎమోషన్స్ే ఉంటాయి ఎవరికైనా అందులోపల ఒకటి నాకు ఆనందం ఎక్కువైంది అని చెప్పేసి చెప్పేటి ఒక రకమైన ఎమోషన్స్ నాకు ఆనందం కూరబడింది ఆనందం లేదు ఆనందం తక్కుతలేదు అని చెప్పేసి చెప్పేటి రెండో రకం అంటే రెండే రకాలు ఆనందము ఉంది ఎక్కువైపోయింది అని చెప్పేసి చెప్పేటి ఆనందం లేకుండా అయిపోయింది అనేటువంటి రెండే రకాల ఎమోషన్స్ ఉంటాయి.
(06:00) నిజానికి ఈ రెండు రకాల ఎమోషన్స్ నుంచే ఇంకా మిగతా ఎమోషన్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా విభజించబడతాయి. కానీ ఆనంద స్వరూపం ఏందంటే ఈ ఎమోషన్స్ యొక్క మూలస్థానం అది అందుకే దానికి ఆనందం ఆ పరమాత్మ స్వరూపం లోపల కానీ ఆత్మజ్ఞాని స్వరూపం లోపల సత్ చిత్ ఆనందం అంటే ఒక కర్మ ఐక్యూ లెవెల్స్ ఏక్యూ లెవెల్స్ ఈ మూడు అత్యుత్తమ స్థితి లోపల ఉండడం ఇక అంతకన్నా గొప్ప స్థితి ఉండదు అంటే నిజమైనటువంటి తన గురించి తాను ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈ మూడు కూడా అత్యుత్తమ స్థితికి వెళ్తాయి.
(06:33) ఇక ఈక్యూ లెవెల్స్ అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఎవరినైనా ఒప్పించగలుగుతారు. ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క ఎమోషన్ అన్ని విషయాలు ఈ వ్యక్తులకు అర్థమైపోతాయి. ఈక్కి అత్యధికంగా ఉంటే ఆ వ్యక్తి చెప్తేనే అవతల వ్యక్తి వింటాడు. అంతేకాకుండా బయట ఇంతకుముందు చెప్పినట్లు బయట నుంచి వచ్చేటువంటి ఏ విషయం కూడా ఆ వ్యక్తి యొక్క ఆనందాన్ని ప్రభావితం చేయలేదు.
(06:58) అయ్యో మా నాన్న తిట్టే అని చెప్పేసి బాధపడం అమ్మ తిట్టే అని చెప్పేసి బాధపడడం లేదా బయట వ్యక్తులు ఏదో అన్నారు అని చెప్పేసి బాధపడడం ఇవన్నీ కూడా ఈక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది అంటే తన ఆనందాన్ని ఏది కూడా ప్రభావితం చేయలేదు. ఆ స్థితికి ఇది ఈక్యూ లెవెల్స్ అత్యధికంగా ఉన్నప్పుడు చేరుకుంటారు. ఇట్లాంటి అత్యుత్తమ స్థితిలో ఉన్నటువంటి ఆదిశంకరులు మరి దేశమంతా కూడా ప్రభావితం చేసి అందరినీ కూడా ఒప్పించగలిగారంటే మరి వారి యొక్క ఇచ్చాశక్తి అంటే ఈక్యూ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మనం అవగాహన వేసుకోవాలి.
(07:28) ఇక వారు అందించినటువంటి ప్రతి స్తోత్రం కూడా మంత్ర స్వరూపమే సాధారణమైనటువంటి మనమే సాధారణమైనటువంటి మన మానవుల యొక్క మాటలే ఒక వ్యక్తి లోపల కోపాన్ని రెచ్చగొడుతుంటాయి మనం మాట్లాడే మాటలు ఏవి వాడితే అవతల వ్యక్తి కోపపడతారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంటది. అంటే మన మాటలే కోపాన్ని రెచ్చగొడుతాయి ఇంకొంతమంది లోపల దుఃఖాన్ని కలిగిస్తాయి ఇంకో కొంతమంది లోపల మన మాటలే అభివృద్ధి కలిగేల ప్రేరణ కలిగిస్తాయి చివరికి ఈ మాటల వల్ల ధనాన్ని కూడా సంపాదించవచ్చు.
(07:55) మరి సాక్షాత్తు ఆత్మజ్ఞాని అత్యుత్తమ స్థితిలో ఉన్నటువంటి ఇచ్ఛా శక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి అంటే ఇంతకుముందు చెప్పినట్టు కర్మశక్తి ఐక్య లెవెల్స్ ఈక్య లెవెల్స్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి శంకరుల యొక్క గలం నుంచి వచ్చినటువంటి మాటలు లోక క్షేమం కోసం జాలివారినటువంటి స్తోత్రాలు ఎంతటి మహిమాన్వితమై ఉంటాయో మనం ఒకసారి ఆలోచించాలి.
(08:19) కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అత్యుత్తమైనటువంటి స్థితిని పొందినటువంటి మహానుభావుల గురించి విషయాలు చదివినా విన్నా అంటే ఆ వ్యక్తులతోన సహవాసమే అయితది. ఉదాహరణకు ఆదిశంకరు రచించినటువంటి ఒక స్తోత్రాన్ని మనం చదివామ అనుకో ఆ వ్యక్తి ఇప్పుడు లేకున్నా వారి యొక్క భావాలు అనేటువంటివి మన లోపల వ్యాపించి అది వారితోని సత్సంగత్వ సత్సంగత్వం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
(08:41) అంటే వారి లక్షణాలు మనకు ఎంతో కొంత వృద్ధి పొందుతుంటాయి. కాబట్టి ఎవరినైనా సరే ఒక బురదతోని సహవాసం చేస్తే బురుద అంటుతుంది. అదే గంధంతోని సహవాసం చేస్తే గంధం అంటుతుంది. మనం గమనించినా గాన ఒక బాగా లేజీ పర్సన్స్ తో మాట్లాడమ అనుకో అప్పటిదాకా మనం మనసు లోపల ఉదయం ఇవ్వగానే ఒక లేజీ పర్సన్స్ తోని ఒక గంట సేపు అర్ధ గంట సేపు మాట్లాడితే తర్వాత ఆ రోజు మనం చేయాలనుకున్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా పక్కక వెళ్ళిపోతాయి.
(09:05) ఒక కోపిష్టి ఆవేశపలతో మాట్లాడితే చేయలేకుండానే మనకు చిరాకు కోపం పెరుగుతుంటాయి. అంటే ఈ వ్యక్తుల యొక్క స్వభావం బట్టి ఆ స్వభావం యొక్క లక్షణం అనేది మన మనసు మీద కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ అత్యుత్తమ మహిమాన్వితమైనటువంటి ఆదిశంకరులు రచించినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఈ అద్భుత లక్షణాలను కూడా మన లోపల ప్రవేశపెడతాయి.
(09:24) అంటే వారి యొక్క మంచి లక్షణాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు శంకరుల యొక్క జీవితం లోపల ఒకానొక ఎమోషన్ విషయం అంటే వారి ఈక్యూ లెవెల్ సంబంధించినటువంటి ఒక ఒకానొక ఎందుకంటే ఇప్పట ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా మొత్తం 100 శాతం లోపల 20 శాతమే ఐక్యూ లెవెల్స్ ఒక మనిషి అభివృద్ధి సాధించాలంటే 20% ఐక్యూ 80% ఈక్యూ లెవెల్స్ బాగున్నప్పుడే ఆ వ్యక్తి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధిస్తాడు అంటే డబ్బు కావచ్చు ఇంకా అన్ని అన్ని రకాల అని సైన్సే చెప్తుంది.
(10:01) కాబట్టి ఈరోజు మనము ఆ శంకరుల యొక్క ఒకానొక ఎమోషన్ విషయం అది ఆయన తల్లితో ఉన్నటువంటి జ్ఞాపకాల విషయం గురించి తెలుసుకుందాం. ఆదిశంకరులు అది చిన్న వయసు లోపల ఎనిమిది సంవత్సరాల వయసు అప్పుడు పూర్ణ నది లోపల స్నానం చేస్తుంటాడు. అదే సమయం లోపల ఈ కథ మనందరికీ కూడా తెలిసిందే ఒక ముసలి ఆయన కాలును పట్టుకుంటుంది. పట్టుకొని ఆ నది లోపలికి లాగేస్తూ ఉంటుంది.
(10:31) అప్పుడు తాను ఇక చనిపోతాను అని చెప్పేసి గ్రహించినటువంటి శంకరులు అక్కడ వడ్డున తల్లి నిల్చొని ఉంటుంది. తల్లి కొడుకులు ఇద్దరు కూడా పూర్ణ నదికి వెళ్ళినప్పుడు శంకరుడు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ ముసలి ఆయన కాళ్ళను పట్టుకుంటుంది. ఇంకా చివరి క్షణాల లోపల తాను సన్యాసిగా మరణించాలని చెప్పేసి నిశ్చయించుకుంటాడు శంకరుడు అప్పుడు తన తల్లితో అంటాడు త్యజతి నూన మమముం చరణం చలో జల చరణోంభ తవా అనుమతేసమే అని అమ్మ నీవు అనుమతిస్తే నేను ఈ క్షణం లోపలనే అతుర సన్యాసం స్వీకరిస్తాను ఎందుకంటే సన్యాసం అనేది పునర్జన్మ ఒకవేళ ఇంకా ఏమంటాడంటే ఒకవేళ ఈ శరీరానికి ప్రారబ్ధం వల్ల ఈ శరీరం మరణించేది ఈ
(11:13) క్షణంగిట రాసి పెట్టింది ఉంటే నేను ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటానో అది పునర్జన్మ అవుతుంది. కాబట్టి ఈ ముసలి నన్ను వదిలి పెట్టవచ్చు కూడా అని చెప్పేసిఅని అంటుంటాడు అప్పుడు తల్లి ఒడ్డు నుంచి చాలా బాధపడుతుంటది అరుస్తుంటది అయ్యో ఎట్లా ఎట్లా అని చెప్పేసి అయితే సాధారణంగా ఈ అధుర సన్యాసం అనేది ఎట్లా తీసుకుంటారు అంటే ఇక ప్రాణాపాయ స్థితి లోపల ఉన్నప్పుడు మనిషి అంటే మరణం దరిదాపుల లోపల ఉన్నప్పుడు మోక్షం పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో తీసుకునేటువంటి సన్యాసాన్ని అతర సన్యాసం అంటారు.
(11:40) అంటే మానసికంగానే సాధారణంగా ఆ సన్యాసం తీసుకోవాలంటే చాలా పెద్ద క్రతువులు ఉంటాయి ఎన్నో హోమాలు చేయాలి ఇంకా ఎన్నో చేయాలి కానీ కేవలం మానసికంగానే నేను సన్యసించాను సన్యసించాను సన్యసిస్తున్నాను అని మూడు సార్లు చెప్పుకుంటే అది వెంటనే సన్యాస దీక్ష అయిపోతుంది. ఎరు ఎవరి దీక్ష బయట నుంచి ఇచ్చేటువంటి అవసరం లేదు. సాధారణ సమయం లోపల మాత్రం బయట నుంచి ఒక గురువు ఉండాలి సన్యాస దీక్ష చేయాలి.
(12:00) కానీ ఆపత్కాలం లోపల ఉండేటువంటి ఈ దీక్షను అతుర సన్యాసి ఉంటాడు. అప్పుడు ఆ తల్లి ఆవేదన పడుతుంటది పొడుగును నీళ్ల లోపలికి ముసలు గుంచుతున్నది. ఎప్పుడైతే శంకరుడు ఒకవేళ నేను సన్యాసం తీసుకుంటే మళ్ళీ బతుకుతాను కావచ్చు అని చెప్పేసి అంటాడో అప్పుడు పుత్రుని యొక్క ప్రాణం కాపాడడం కోసం ఆ తల్లి ఆయన తల్లి పేరు ఆర్యాంబ సరే అని చెప్పేసిని అనుమతిస్తుంది.
(12:20) అప్పుడు శంకరుడు మనస మూడు సార్లు స్మరించి సన్యాసం స్వీకరిస్తారు. అతే అద్భుతంగా మరుక్షణమే ఆ ముసల ఆయన కాలను వదిలిపెట్టిస్తుంది. అంటే ఒక రకంగా ఈ అధుర సన్యాసం వల్ల ఆయనకు పునర్జన్మ లభించింది నిజంగానే ఇక సన్యాసం ఎప్పుడైతే స్వీకరించిండో ఆ స్వీకరించిన తర్వాత సన్యాస నియమాలు ఖచ్చితంగా పాటించాల్సింది. సన్యాసి ఇంట్లో ఉండకూడదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళాలి సన్యాసికి ఎన్నో నియమాలు ఉన్నాయి.
(12:50) సన్యాసులు ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూనే ఉండాలి ఇంట్లో నివసించొద్దు కుటుంబంతో నివసించొద్దు ఆ బంధాలు అనేటువంటివి ఉండకూడదు. ఇక్కడ శంకరుడు ఎనిమిదేళ్ల ప్రాయం లోపలనే సన్యాసాన్ని స్వీకరించి ఇక ఇల్లు వదిలిపోయేటువంటి సమయం వస్తది. అప్పుడు ఆ కన్న తల్లి ఏం చేయలేదు ఆమె కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం ఉన్నది ఆమెకి ఈ నియమాలన్నీ కూడా తెలుసు ఇప్పుడు కన్నీళ్లతోని ఏడుస్తూ అడుగుతుంటుంది నాయనా నీవు వెళ్ళిపోతే నా అంతిమ గడియ లోపల నా పక్కన ఎవరు ఉంటారు నాయనా నా దేహానికి అగ్ని సంస్కారం ఎవరు చేస్తారు నాయనా అని చెప్పేసి అని అంటది. అప్పుడు శంకరులు
(13:27) తల్లికి ఒక అద్భుతమైనటువంటి మాట వాగ్దానం చేస్తాడు ఏమని అంత్యకాలే సముత్పన్నే స్మర్త్యోన్యోహం త్వయాంబికే ఆగమిశ్యామి తత్రవా యత్ర కుత్రాభి సంస్థితః అని అమ్మ నీకు అంత్యకాలం వచ్చినప్పుడు నన్ను స్మరించుకో నేను ఎక్కడ ఉన్నా సరే నీ దగ్గరికి నేను వస్తాను సంస్కారంతే కరిశ్యామి యథాశాస్త్రం యథావిధి నేను నీకు వచ్చి నీ మనసులో ఉన్నట్టుగానే శాస్త్రోక్తంగా అంత్యక్రియలను నేనే నిర్వహిస్తాను అని వాగ్దానం చేస్తాడు తల్లికి అప్పుడు శంకరుడు ఇక మరసటి రోజు వెళ్ళిపోవడానికి సిద్ధమైతాడు ఇంట్లో నుంచి వెలిపిస్తుంటే ఆమె వెలపేస్తే ఇలా అంటుంది నాయనా నువ్వు
(14:11) వెళ్ళిపోతే దుఃఖంతో నేను వెళ్ళిపోతే నా చేతులతో నీకు అన్నం ముద్దలు ఎప్పుడు తినిపిస్తాను ఆకలి వేస్తే నా బిడ్డ ఎవరిని అడుగుతాడు ఎంత కష్టాలు పడతాడు అని చెప్పేసిఅని బాధపడుతుంటది. చివరిగా శంకరుడు వెళ్ళే ముందు ఆ తల్లి ఆఖరి భోజనాన్ని వడ్డిస్తది. అత్యంత భక్తితోని శంకరుడు ఆ భోజనాన్ని స్వీకరిస్తారు. అది కేవలం ఒక అన్నం కాదుఅది ఆ తల్లి యొక్క మమ్మకారమే అప్పుడు తల్లి తన చేతులతోని శంకరుల అన్నం తినిపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
(14:39) ఆమె దుఃఖం చూసి శంకరుల యొక్క హృదయం కూడా ద్రవిస్తుంది. శంకరుడు వెళ్ళేటప్పుడు తల్లి కాళ్ళపై పడి నమస్కరించి అమ్మ నేను మరి భగవంతుని యొక్క ఆజ్ఞతోనే లోక కళ్యాణం కోసంని ఎందుకోసమో స్వామి ఈ రకంగా జరిగింది నేను సన్యాసం తీసుకున్నది లోక కళ్యాణం కోసమే కానీ నేను ఎప్పటికీ కూడా నీ కొడుకునే నీకు ఆకలి వేసినా బాధ వేసినా ఇంకా ఎటువంటి సందర్భంలో అయినా సరే నన్ను మనసులో తలుచుకో నీకు ఎప్పుడైతే తలుచుకుంటావో నన్ను నీకు నీ కొడుకు పక్కనే ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో పాటు ఏ లోటు లేకుండా కూడా జరిగి జరిగిపోతుంది అని ఓదారుస్తాడు.
(15:18) ఇట్లాంటి సత్య సంధులు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు మనం గమనిస్తే ఇప్పుడు తర్వాత శంకరులు ఇంటి గడప దాడుతున్నప్పుడు ఆ తల్లి ఆడప ఆ గడప దగ్గరనే ఏడుస్తూ కూలబడిపోతుంది. శంకరులు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలనేది సన్యాస నియం ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి చూడకూడదు.
(15:38) కానీ ఆ తల్లి రోదన వినిపిస్తుంటది ఆయన ఒక క్షణం ఆగి ఆకాశం వైపు చూసి ఆయన కూడా దుఃఖం వస్తుంటది. ఆ తల్లికి ఏ లోటు లేకుండా కాపాడమని ఆమెకు మానసిక ధైర్యాన్ని ప్రసాదించమని దేవతలను ప్రార్థించి శంకరులు అడుగు ముందుకు వేస్తాడు. మనం కూడా ఏదైనా ఒక సాధారణ ఊరికి వెళ్తేనే మన తల్లి మరి ఎన్నో సార్లు ఫోన్ చేస్తుంది నాయనా అన్న తిన్నావా అన్న తిన్నావా అని మరి శాశ్వతంగా ఇల్లును విడిచిపోతున్నటువంటి సన్యాసానికి వెళ్తున్నటువంటి ఆ ఎనిమిదేళ్ల పిల్లవాడు మళ్ళీ ఆ తల్లి ఎంత ఆవేదనతోని ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి.
(16:13) కాబట్టి అందుకు శంకరుడు ఎంతటి జ్ఞాన అయినా సరే ఆ తల్లి చేతి అన్నాన్ని మాత్రం ఆ మమకారాన్ని మాత్రం ఎప్పటి కూడా మర్చిపోలేదు. తర్వాత శంకరులు దేశంంతా కూడా పర్యటించారు సంవత్సరాలు గడిచిపోయాయి. అలా పర్యటిస్తూ పర్యటిస్తూ అద్వైత తత్వాన్ని బోధించారు. చివరికి జగద్గురువు కూడా అయ్యారు. తర్వాత ఇక్కడ ఒకరోజు కేరళ లోపల ఆర్యం దేవికి అంటే శంకరుల యొక్క తల్లికి అంత్యకడయలు సమీపించాయి.
(16:42) శంకరుల యొక్క మాట గుర్తుకు వచ్చింది. ఆమె ఆ శంకరులను స్మరించింది ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. చివరి క్షణం లోపల నన్ను తలుచుకొని నేను వచ్చి నీకు సంస్కారం చేస్తాను. అప్పుడు ఇక్కడ కూడా శంకరులు తన తల్లికి అంతిమ గడియలు సమీపించాయని తన యోగశక్తి చేత గ్రహించారు. లోకమంతా ఆయనను వేదాంతిగా పూజిస్తున్నా గాన ఆ క్షణంలో ఆయన కేవలం ఒక కుమారుడిగా మారిపోయాడు.
(17:06) ఇచ్చిన మాట కోసం వేల మైళల దూరాన్ని యోగశక్తుని దాటి తల్లి మంచం చెంతకు చేరుకున్నారు. అప్పుడు ఆ కొడుకుని చూడగానే ఆ ఆర్యంబ యొక్క మనసు చాలా కుదుటపడింది. ఇక్కడ శంకరుడు తల్లి మరణావస్థతో ఉండడం గమనించినటువంటి శంకరుడు మొట్టమొదలు ఆమెకు మోక్షం కలిగించినటువంటి ఉద్దేశం చేత జ్ఞాన మార్గం లోపల తత్వబోధ చేద్దాము అని అనుకున్నారు.
(17:29) కానీ ఆమెకు ఈ కఠినమైనటువంటి వేదాంతం మాటలు అర్థం కావు. ఆమె ప్రేమ మాత్రమే తెలిసినటువంటి వ్యక్తి సాధారణంగా మనుషులు రెండు రకాలు ఉంటారు కొంతమంది జ్ఞానం మీద ఆసక్తి ఉన్న మిగితా వాళ్ళందరూ కూడా ఈ హృదయంతోనే వ్యవహరిస్తుంటారు. అట్లా ఆ తల్లి కి జ్ఞానబోధ చేద్దాం అంటే కుదరనటువంటి విషయం అప్పుడు శంకరులు తల్లి కోసం అప్పటికప్పుడు రెండు అద్భుతమైనటువంటి స్తోత్రాలను ఆశువుగా దేవతలను ప్రార్థిస్తూ చెప్తాడు మొట్టమొదలు ముందుగా ఆయనకు శివభుజంగ ప్రయాత స్తోత్రం అనేది చదువుతాడు.
(18:00) అంటే ఆయనకు శివలోక దర్శనం చేపిస్తారు. ఆమె మనసు ఆ శివలోకానికి వెళ్లి అక్కడ శివగణాల యొక్క స్వరూపాన్ని చూసి ఆయన శివుని యొక్క రుద్ర గణాలను ఇవన్నిటిని చూసి ఆమె కొద్దిగా ఇట్లా భయపడుతూఉంటుంది. తర్వాత తర్వాత వెంటనే మళ్ళీ శంకరుడు మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అదే విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు కూడా తల్లి యొక్క అంత్యకాలం లోపల పటిస్తారు.
(18:25) అప్పుడు చతుర్భుజాలతోని శంక చక్ర గదాధరుడై వచ్చినటువంటి ఆ నారాయణుని చూసి ఆమె పరవశించి ప్రశాంతంగా మరి ప్రాణాలను వదులుతుంది. అయితే శాస్త్రం ఏమని చెప్తుందంటే ఎప్పుడైనా సరే పాప పరిహారం కోసం హరున్ని ఆరాధించాలి అంటే శివుణ్ణి ఎప్పుడైతే శివుణ్ణి ఆరాధిస్తామో మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకోసమే శంకరుడు ముందుగా తల్లి యొక్క అంతఃకరణ శుద్ధి కోసము ఒక వ్యక్తికి మోక్షం రావాలంటే ఉన్నటువంటి పాపము ఇదంతా కూడా భస్మం కావాలి.
(18:55) కాబట్టి తల్లి యొక్క అంతఃకరణ శుద్ధి కోసము జన్మ జన్మల పాపాలను హరించడానికి మరి సాక్షాత్తు శివున్నే అక్కడ మాకు ప్రార్థించుండు ఆదిశంకరుడు ఆ తర్వాత మోక్షకారకుడు ఎవరు అంటే విష్ణువు అందుకోసమే చివరి క్షణం లోపల ఎవరైతే నారాయణ నారాయణ అని చెప్పేసి స్మరిస్తారో వారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసిని శాస్త్రం చెప్తుంది.
(19:15) అందుకోసమే చివరిగా మోక్షకారకుడైనటువంటి విష్ణువుని ప్రార్థించారు. మొదలు శివుణని ఆరాధించి పాపాలన్నీ కూడా భస్మం చేసుకోవాలి. తర్వాత చివరి కాలంలో కూడా ఈ విష్ణు నామస్మరణ అయ్యా నిజానికి శివ కేశవుల మధ్య భేదమే లేదు ఎప్పుడైనా సరే వీరిఇద్దరు కూడా ఎప్పుడైతే ఈ సృష్టి విశ్వమంతా వ్యాపించేవాడు విష్ణువు శివుడు అంటే మంగళాన్ని ఇచ్చేవాడు కాబట్టి వీరిద్దరి మధ్య భేదం లేదు కానీ మన యొక్క అవసరం బట్టి ఆయా దేవతలను మనం ఆరాధిస్తుండాలి.
(19:41) తర్వాత ఇచ్చిన మాట ప్రకారం తల్లికి అంత్యక్రియలు చేయడానికి శంకరుడు సిద్ధమవుతాడు. అయితే అప్పుడు ఆ ఊరి లోపల చాలా మంది పెద్ద పెద్ద పండితులు ఉంటారు. ఒక సన్యాసి నియమం ఏందంటే ధర్మము సన్యాసి ఎప్పుడు కూడా ఈ ధర్మాలను ఈ కర్మకాండా అంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒక సన్యాసి అంత్యక్రియలు చేయకూడదు అని చెప్పేసిఅని ఆ గ్రామంలో ఉన్నటువంటి పండితులు గ్రామస్తులు బంధువులు అందరూ కూడా నువ్వు ఎట్లా ఎట్లా చేసేస్తావ్ అంత్యక్రియలు అని చెప్పేసి అడ్డు పడతారు.
(20:09) కనీసం చితి కోసం కట్టలు ఇవ్వడానికి నిప్పి ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. అప్పుడు ఈ ఆదిశంకరుడు తన తపోబలంతోని అరచేతినే మధించి అగ్నిని పుట్టించి ఇంటి వెనుక ఉన్నటువంటి అరటి తోటలనే ఆ తల్లికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అప్పుడు అంత పెద్ద వేదాంత మూర్తి అయినటువంటి శంకరులే తల్లి ప్రేమ గుర్తుకు వచ్చి ఆర్ద్రతతోని వెంటనే ఆశువుగా ఆయన మాతృ పంచకాన్ని ఆశువుగా చెప్తారు.
(20:38) ఇది ఈ మాతృ పంచకం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది మాతృ దేవతకు అర్చించినటువంటి మాతృ దేవతను అర్చించేటువంటి ఒక అక్షర నిరాజనం ఇది. ఇక్కడ మొత్తం ఐదు శ్లోకాలు ఉంటాయి. అందుకోసమే దీన్ని మాతృ పంచకం అంటారు మొదటి శ్లోకం లోపల ఏమని ఉంటుందంటే భావము అస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యత అని ఇంకా ఇలా పెద్దగా ఉంటుంది శ్లోకము కానీ దీని తాత్పర్యం ఏమందటంటే అమ్మ నేను పుట్టేటప్పుడు నీవు అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రసవ వేదనను నీవు పడినటువంటి నిద్ర లేని రాత్రులను నా మలమూత్రాల శయ్యపై నీవు పడుకొని నన్ను పెంచినటువంటి త్యాగాన్ని నేను
(21:15) స్మరిస్తున్నాను ఏ సంతానమైనా సరే నీవు ప్రసవించినటువంటి ఆ ఒక్క రాత్రి కష్టానికి ఎప్పటికి కూడా ఆ రుణాన్ని ముట్ట చెప్పలేదు. మాతృ ఋణాన్ని ఎవ్వరు కూడా తీర్చలేదు. అని చెప్పేసిని మొదటి శ్లోకం లోపల ఆ తల్లి ప్రసవ వేదం అంతా కూడా గుర్తు చేయించుకొని ఈయన ఆ తల్లి ఒక ప్రేమను గుర్తుచేసుకుంటాడు. తర్వాత రెండవ శ్లోకం లోపల గురోహ కులమదిగమ్య శిక్షతోహం అంటూ అమ్మ నేను గురుకులానికి వెళ్లి విద్య నేర్చుకొని తిరిగి వచ్చేసరికి నాకోసం నీవు దాచి ఉంచినటువంటి గోరు ముద్దలు నా రాక కోసము నీవు ఎదురు చూసినటువంటి ఆ కన్నులు గుర్తుకొస్తున్నాయమ్మా నీవు నా నోటికి అందించినటువంటి ఆ అమృతం
(21:54) లాంటి ముద్దల యొక్క రుణము ఈ మాతృణం నేను ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసిని తల్లును గుర్తు చేసుకుంటాడు. ఇక మూడవ శ్లోకం లోపల ముక్త్వామణిస్తవం అంటే ఇది చివరి క్షణాల గుర్తు చేసుకుంటూ ప్రాణాలు వదిలే ముందు అత్యంత నీరతంగా ఉన్నా గాని ఏమంటున్నదట అంటే ముక్త్వా మనిస్తం నాయనా నువ్వు నా ముత్యానివి నా మనివి నయనం మమేతి నాకంటే పాపం ఉన్నది రాజేతి నా రాజా నువ్వు నా రాజువు జీవేతి చిరంసుతేతి నాయనా చిరంజీవిగా ఉండు నాయనా అంటూ నన్ను దీవిస్తూనే ఉన్నావు అత్యంత అశక్త వదత్య తవాంతే అంబో మాతః కమల లాయదాక్షి అని అంటాడు అంటే ఇట్లా నన్ను ఎప్పుడు దీవిస్తూనే ఉన్నాను నీ నోరుతోని
(22:36) అటువంటి నీ తల్లి రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అని చెప్పేసిని నా తల్లిని గుర్తు చేసుకుంటాడు. ఇక నాలుగవ శ్లోకం లోపల నదత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా అంటూ ఉంటుంది అది అమ్మ నీవు మరణించే సమయం లోపల కనీసం నీ నోటి లోపల ఒక చుక్క నీరు కూడా నేను పోయలేకపోయానమ్మ నీ ఆఖరి కర్మలు చేయడానికి ఎందరూ అడ్డుపడినా గాని నేను నీ ఇచ్చినటువంటి మాట ప్రకారము మరి అగ్ని చేత ఈ అగ్ని చేత నా నీ యొక్క దేహాన్ని పునీతం చేస్తున్నాను ఇది ఈ అగ్ని నీ పాపాలన్నీ కూడా హరించి నీకు మోక్షాన్ని ఇచ్చుగాక అని నాలుగో శ్లోకం ఉంటుంది తర్వాత ఐదవ శ్లోకం లోపల అన్యాసాం
(23:16) మాతృణం యదిభవతి ముక్తిహి సులభత అంటే లోకంలో ఎందరో తల్లులు ఉండవచ్చు కానీ నా తల్లిగా నీవు పడినటువంటి కష్టము అనన్యమైనది నీవు నన్ను గర్భంలో మోసిన భారానికి నీవు చూపినటువంటి ఒక మమకారానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ధనము ఏ జ్ఞానం కూడా సరితోగదు అమ్మ నీకు ఇవే నా శతకోటి వందనాలు అని ఈ మార్త పంచనం ద్వారా ఆ తల్లిని ప్రార్థిస్తాడు ఆశువుగా చెప్తాడు అంటే తల్లిని గుర్తు చేసుకుంటూ మరి ఒక ఒకానొక అంత ఉద్వేగాలను జయించినటువంటి శంకరాచార్యులే మరి ఇట్లా ఇట్లా తల్లిని గుర్తు చేసుకుంటారు.
(23:55) నిజానికి మనం ఆలోచిస్తే సనాతన ధర్మ రక్షకుడైనటువంటి శంకరులు ఎప్పుడు కూడా ధర్మాన్ని అతిక్రమించారు. ఎందుకంటే ఎతులకు యతీనాం మాతృశుశ నదోషాయ కదాచ అని అంటే ఎతులు ఎప్పుడు కూడా తల్లికి సేవ చేయడం అనేది ఎప్పటికీ కూడా దోషం కాదు. నువ్వు ఎంత సన్యాసం తీసుకున్నా సరే ఇంత పెద్ద గొప్ప సన్యాసులైనా సరే కచ్చితంగా శాస్త్రం ఏమని చెప్పిందంటే తల్లికి నమస్కారం చేయాలి మొత్తం సాష్టాంగ నమస్కారం చేయాలనే చెప్పింది.
(24:18) తండ్రికి వాళ్ళు నమస్కారం చేయరు ఇప్పుడు కూడా మనం గమనిస్తే అందు సన్యాసులు అందరూ కూడా తండ్రికి నమస్కారం చేయరు కానీ తల్లికి మాత్రం తప్పనిసరి నమస్కారం చేయవలసిందే. ఎందుకంటే అది శాస్త్రం తల్లి సన్యాసం చేసుకున్న తల్లి విశేషతః అతురాణం సన్యాసేచ విధిస్మృతః ఇంకా అధుర సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళకు కొంత మాతృణం తీర్చుకునే విషయం లోపల కొద్దిగా సడలింపులు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ శంకరుడు మరి ప్రత్యక్షకరమైనటువంటి కట్టలతో చితిని తేర్చలేదు అంటే కేవలం తన యోగ శక్తి చేత యోగ అరచేత మదించే అగ్నిని పుట్టించాలి.
(24:49) అంటే బాహ్యమైనటువంటి అగ్నిని వాడకుండా శంకరుడు తన లోపల ఉన్నటువంటి మహత్యం చేత అంతరజ్ఞని బాహ్యజ్ఞగా మార్చి ఆ తల్లికి అంత్యక్రియలు చేశారు. కాబట్టి ఏ రకంగా చూసినా గాని ఈ సనాతన ధర్మ రక్షకుటువంటి శంకరులు ఎప్పుడు కూడా ధర్మాన్ని అతిక్రమించలేదు కానీ తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చారు. ఇది ఆ శంకరుల యొక్క ఎమోషన్ సంబంధించినటువంటి విషయం మరి అంత పెద్ద జ్ఞాని కూడా తల్లి విషయం లోపల ఎట్లా నడుచుకున్నాడో మనకు అర్థమవుతుంది.
(25:21) ఇక ఆ శంకరుల యొక్క క్రియాశక్తి జ్ఞానశక్తి మరియు ఇచ్చాశక్తి మన జీవితం లోపల కూడా ప్రసరించాలని కోరుకుంటూ అందుకోసం మనం ఏం చేయాలంటే వారు అందించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు మనకి ఎప్పుడు కూడా తోడ్పడుతూనే ఉంటాయి ఆ స్తోత్రాలు ఏ స్తోత్రం చదివినా గానీ అందులో ఉన్నటువంటి మంత్ర శక్తి వారి యొక్క సాహిత్య శక్తి వారి యొక్క మహత్యము తపశక్తి అన్నీ కూడా మనకు రోజు రోజు కొద్దిగా రోజు కొద్దిగా మన హృదయం లోపల ప్రవేశిస్తూనే ఉంటాయి ఎవరి ఎవరైనా సరే ఏ పుస్తకం చదివినా గాన ఆ రచ యొక్క ఆలోచనలు అనేటువంటివి మనలో ప్రవేశిస్తుంది. అట్లా అట్లాగే ఆదిశంకరులు
(25:55) జగద్గురువులైనటువంటి ఆదిశం యొక్క స్తోత్రాలు మనం నిరంతరం ఉపాసించుకుంటూ ఉపయోగించుకుంటూ మనమందరం కూడా శుభాలను పొందుదం గాక ఇక ఇక్కడ ఈ మాతృభక్తి విషయంలో కూడా మనకు చెప్పేది ఏందంటే లోకాన్ని జయించినటువంటి శంకరుడు కూడా అమ్మ ప్రేమమందు చిన్న పిల్లవాడై విలభించడం చూస్తుంటే మనక ఏమ అర్థమవుతుంది భక్తి కంటే కూడా జ్ఞానం కంటే కూడా ఈ జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రుల పట్ల మరి కృతజ్ఞత ఎంత పెద్దదో మనకు అర్థమవుతుంది.
(26:21) కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కొన్ని విషయాలు మనకు ఉన్నప్పుడు వాటి విలువ ఎప్పుడు కూడా అర్థం కాదు అందులోపల ఆరోగ్యము తల్లిదండ్రులు ఆరోగ్యం ఉన్నప్పుడు మనక ఏది కూడా అర్థం కాదు చేతులు కాళ్ళు ఇవన్నీ బాగానే ఉన్నప్పుడు అర్థం కాదు ఎప్పుడైతే మనకఏదనా చేతులు కాళ్ళు ఏదో ఆరోగ్యం కోల్పోయినమ అనుకోండి వాటి యొక్క విలువనే అర్థమవుతుంది తల్లిదండ్రులు కూడా అంతే వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ యొక్క విలువ మనక ఎప్పుడు కూడా అర్థం కాదు కానీ ఎప్పుడైతే లేరో అప్పుడే తల్లిదండ్రుల యొక్క విలువలు మనకు అర్థమైతు ఉంటుంది.
(26:48) కాబట్టి అట్లా కాకుండా వారు లేనప్పుడు గుర్తు చేసుకొని కాకుండా ఈ శంకరుల యొక్క విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందటంటే ఆ మాతృభక్తి అంత పెద్ద సన్యాసం తీసుకున్నా మాతృభక్తి ఆయన ధర్మము తల్లికి మోక్షం ప్రసాదించినటువంటి విషయం ఇవన్నీ మనం గమనిస్తే తల్లిదండ్రుల పట్ల ఎంత కృతజ్ఞత అనేది ఎంత పెద్దదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ శంకరుల యొక్క అనుగ్రహం మనందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ మరి వారి లోపల ఉన్నటువంటి ఆ కర్మ శక్తి తర్వాత జ్ఞాన శక్తి అంటే ఐక్యూ లెవెల్స్ ఈక్యూ లెవెల్స్ కూడా మనం కూడా వారి యొక్క మహత్తు లోపల కొంత భాగం మన లోపల కూడా వచ్చేసి మనమందరం
(27:22) కూడా మరి అన్ని రకాలుగా మరింత చక్కగా అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి శుభం భవతు శ్రీమాత్రే నమః
No comments:
Post a Comment