Saturday, June 27, 2026

Comparison is a form of violence — Jiddu KrishnaMurti #share #like #subscribe #viral #ytshorts #yt

Comparison is a form of violence — Jiddu KrishnaMurti #share #like #subscribe #viral #ytshorts #yt

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y26xhJt55Q4



Transcript:
(00:07) నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. [సంగీతం] తను నాకంటే అందంగా ఉంది. నా పక్కింటివాడు కొత్త కారు తీసుకున్నాడు. నేను కొత్త మోడల్ కార్ తీసుకోవాలి. ఈ ఆలోచనలు వచ్చిన ప్రతిసారి [సంగీతం] లోపల ఏదో విరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక చిన్న నొప్పి, ఒక కనిపించని చీకటి కానీ నిజానికి అది బాధ కాదు [సంగీతం] పోలిక.
(00:29) ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని జీవించడం ఆపి ఇతరుల జీవితాలతో కొలవడం మొదలుపెట్టావు. జిడ్డు [సంగీతం] కృష్ణమూర్తి చెప్పాడు. పోలిక అనేది మనిషి తన చేతితో తాను చేసుకునే గాయం. పోలిక అనేది మనిషి పుట్టుకతో తెచ్చుకునే వ్యాధి కాదు అది సమాజం నేర్పిన అలవాటు. జిడ్డు కృష్ణమూర్తి చాలా [సంగీతం] స్పష్టంగా చెప్పాడు.
(00:49) తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చిన ప్రతిసారి ఆ పిల్లవాడి మనసులో ఒక కనిపించని గాయం ఏర్పడుతుంది. మీ అక్క ఎంత మర్యాదగా మాట్లాడుతుందో చూడు పక్కింటి పిల్లలకు ఎంత డిసిప్లిన్ ఉందో చూడు ఆ పోలిక నెమ్మదిగా అతని మనసులో స్థిరపడిపోతుంది. అప్పుడు అతను తనను తాను అంగీకరించడం మర్చిపోతాడు. పెద్దవాడైన తర్వాత కూడా అదే కథ కొనసాగుతుంది. ప్రతి అడుగులో ఇతరులతో పోల్చుకుంటాడు.
(01:11) ప్రతి విజయాన్ని ఇంకొకరి విజయంతో కొలుస్తాడు. ఎప్పుడు ఎవరో ఒకరు తనను మెచ్చుకోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే తన విలువను తనలో కాక ఇతరుల అభిప్రాయాల్లో వెతకడం నేర్చుకున్నాడు. బయట నుంచి వచ్చిన పోలిక లోపల గూడు కట్టుకుంది. [సంగీతం] జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు. తల్లిదండ్రులది ప్రేమ కాదు ఇది ఒక సూక్ష్మమైన హింస అని. మనిషి జీవితంలోనే కాదు దేశాల మధ్య కూడా ఇదే జరుగుతుంది.
(01:37) ఒక దేశం మరో దేశాన్ని చూసి అంటుంది. [సంగీతం] వాళ్ళక అంత శక్తి ఉంది. మాకు ఉండాలి. వాళ్ళకు అన్ని ఆయుధాలు ఉన్నాయి. మాకు కావాలి అక్కడ కూడా మూలం ఒక్కటే [సంగీతం] పోలిక జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు హింస కత్తితో మొదలు కాదు హింస మనసులో జరిగే పోలికతో మొదలవుతుంది అని యుద్ధాలు సరిహద్దుల దగ్గర మొదలు కావు అవి ముందుగా మనసుల్లో మొదలవుతాయి.
(01:56) మరి ఆ మనసుల్లోని మొదటి చిచ్చు పోలిక. [సంగీతం] జిడ్డు కృష్ణమూర్తి ఒక అద్భుతమైన ఆలోచన చెప్పాడు. అదే ఛాయిస్లెస్ అవేర్నెస్ తెలుగులో చెప్పాలంటే ఎంపిక లేకుండా గమనించడం [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ఒడ్డున కూర్చొని ఉన్నావు నువ్వు నదిని చూస్తున్నావు. మొదట అది కేవలం ఒక నది [సంగీతం] కానీ వెంటనే మనసు మాట్లాడటం మొదలు పెడుతుంది. నది అందంగా ఉంది.
(02:18) కానీ హిమాలయాల్లో నదులు ఇంకా అందంగా ఉంటాయో అక్కడ నీరు ఇంకా స్వచ్ఛంగా ఉంటాయో [సంగీతం] ఆ క్షణం నుంచి నువ్వు ఈ నదిని చూడడం ఆపేశావు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఛాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఏదైతే ఉందో దాన్ని అలాగే చూడ్డం. ఈ [సంగీతం] నది ఈ నదే. దీనిని ఇంకో నదితో కొలవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నువ్వు కూడా నువ్వే నిన్ను ఇంకొకరితో పోల్చాల్సిన అవసరం లేదు [సంగీతం] ఛాయిస్ లెస్ అవేర్నెస్ అంటే పోలిక లేకుండా నిన్ను నువ్వు గమనించడం అప్పుడు [సంగీతం] మనసు నిశ్శబ్దంగా మారుతుంది.
(02:50) పోలిక తెచ్చే అలజడి క్రమంగా కరిగిపోతుంది. ఎందుకంటే [సంగీతం] ప్రశాంతత అనేది ఇంకొకరిగా మారినప్పుడు రాదు. నిన్ను నువ్వు పూర్తిగా చూసినప్పుడు వస్తుంది. [సంగీతం] జిడ్డు కృష్ణమూర్తి చివరికి చెప్పిన సందేశం చాలా సులభం. కానీ దాని లోతు అపారం. నువ్వు ఉన్నది నువ్వే మరొకరిలా అవ్వాలని ప్రయత్నించడం అంటే నిన్ను నువ్వు నిరాకరించడం జిడ్డు కృష్ణమూర్తి ప్రకారం పోలికను ఆపడానికి ఎలాంటి పద్ధతి అవసరం లేదు ఎలాంటి సాధన అవసరం లేదు మొదట కావలసింది ఒక్కటే [సంగీతం] గమనించడం మనసు ఎప్పుడు పోల్చుకుంటుందో దాన్ని చూడడం ఎలాంటి తీర్పు లేకుండా ఆ గమనింపులోనే పోలిక [సంగీతం] శక్తి క్రమంగా కరిగిపోతుందని
(03:25) అతను చెప్పాడు. అప్పుడు మనిషి ఒక విచిత్రమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు. [సంగీతం] ఎందుకంటే అతను ఇక ఎవరికంటే ఎక్కువగా ఉండాలని ప్రయత్నించడం లేదు ఎవరికంటే తక్కువగా అనిపించుకోవడం కూడా లేదు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు సత్యం అనేది పోలిక ముగిసిన చోట మొదలవుతుంది. [సంగీతం] అక్కడ పోటీ లేదు అక్కడ అసూయ లేదు అక్కడ భయం లేదు అక్కడ ఉన్నది ఒక్కటే నీకు ఉన్నట్లుగా నువ్వు ఉండడం [సంగీతం]

No comments:

Post a Comment