మీకు ఇష్టమైన వాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది?|| vswriting's ✍️|| stimulate death
Author Name:Vs Writing's
Youtube Channel Url:https://www.youtube.com/@vswritings
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0jh-kiUpoxY
Transcript:
(00:04) ఒక క్షణం ఆలోచించండి రేపు పొద్దున మీరు నిద్ర లేచేసరికి మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీ పక్కన లేకపోతే వాళ్ళ ఫోన్ కి మీరు ఎన్ని సార్లు రింగ్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తుంటే అసలు ఈ ప్రపంచంలోనే వాళ్ళు లేరు అని మీకు అర్థమైతే ఆ క్షణం మీ మనసులో కలిగే ఆ భయంకర రమైన శూన్యం ఆ నరకం ఎలా ఉంటుంది? మనం ఆ పరిస్థితిని అస్సలు ఊహించలేం కదా అపచారం దరిద్రం ఇలాంటివి ఇప్పుడెందుకు అని ఆ ఆలోచననే తుడిచేస్తాం.
(00:50) కానీ నీకు బాగా ఇష్టమైన వాళ్ళు చచ్చిపోవడానికి ముందే ఒకసారి నీ ఆలోచనలో వాళ్ళని చంపేయ్. అప్పుడే అప్పుడే నీకు వాళ్ళ అసలైన విలువ తెలుస్తుంది. సాధారణంగా మనిషి ఒక సమస్యను రెండు రకాలుగా అనుభవిస్తాడు. ఒకటి ఆలోచన ద్వారా రెండు అనుభవం ద్వారా ఉదాహరణకు మీరు రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నారు. హటాత్తుగా తలుపు వెనుక ఏదో శబ్దం వినిపించింది.
(01:29) మీ మనసు వెంటనే అక్కడ ఎవరో దొంగ ఉన్నాడనో ఏదో భయంకరమైన రూపం ఉందనో ఊహించడం మొదలు పెడుతుంది. నిజానికి మీరు అక్కడ దేన్ని చూడలేదు. కానీ ఆ ఆలోచన మీలో వనుకు పుట్టిస్తుంది. చెమట పట్టేలా చేస్తుంది. కానీ మీరు ధైర్యం చేసి వెళ్లి ఆ తలుపు తీశారు. నిజంగానే అక్కడ మీరు ఊహించిన ఆకారం నిలబడి ఉంది. అప్పుడు కలిగేది నిజమైన భయం. ఇక్కడ ఆలోచన సృష్టించిన భయానికి నిజంగా చూసినప్పుడు కలిగే భయానికి మధ్య మన మెదడులో జరిగే చలనం ఒకటే
(02:16) మనం ప్రేమించే వ్యక్తులు ఎప్పటికీ మనతోనే ఉంటారనే ఒక భ్రమలో బ్రతుకుతాం మనం అందుకే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళ మీద కోపపడతాం. వాళ్ళకి సమయం ఇవ్వం కానీ వాళ్ళు మరణించకముందే ఒక్కసారి మీ మనసులో వాళ్ళ మరణాన్ని విజువలైజ్ చేయండి. వాళ్ళ గొంతు ఇక మీకు వినబడదు. వాళ్ళ స్పర్శ ఇక లేదు. ఆ వ్యక్తి కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే.
(02:52) ఈ మానసిక మరణాన్ని మీరు అనుభవించినప్పుడు మీ లోపల ఒక తెలియని ప్రకంపన మొదలవుతుంది. ఆ క్షణం మీకు అర్థమవుతుంది. వాళ్ళు నా జీవితంలో ఎంత ముఖ్యమం ఆ భయమే మిమ్మల్ని మేలుకొలుపుతుంది. ఇది నిజానికి నెగిటివిటీ కాదు క్లారిటీ చాలామంది అంటారు మంచి జరుగుతుందని అనుకోవాలి. కానీ ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఎందుకని కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా పోయిన తర్వాత ఏడవడం బలహీనత.
(03:32) అది పోకముందే పోయినట్టు ఊహించి దాని విలువ తెలుసుకొని బ్రతకడం జ్ఞానం. తలుపు వెనక ఏదో ఉంది అని భయపడుతూ కూర్చోవడం కంటే అక్కడ ఏముందో ముందే ఊహించి సిద్ధపడడం మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ నెగిటివ్ విజువలైజేషన్ మిమ్మల్ని డిప్రెషన్ లోకి నెట్టదు. మిమ్మల్ని మరింత ప్రేమగా కృతజ్ఞతగా ఉండేలా చేస్తుంది. కుదిరితే ఈరోజే నిశశబ్దంగా ఉండే ఒక గదిలోకి వెళ్లి ఇది ప్రాక్టీస్ చేయండి.
No comments:
Post a Comment