Wednesday, March 25, 2020

భక్తి భావం

ఓం నమశ్శివాయ🙏

భక్తి భావం🙏
వ్రతాలు చేస్తే వరాలు లభిస్తాయని ,
పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయని ,
అర్చనలు ,అభిషేకాలూ చేస్తే దేవుడు కరుణిస్తాడని అందరూ అనుకోవడం సహజం .
కష్టాలూ ,రోగాలు ,బాధలు కలిగినప్పుడు ,
నేనేమి తప్పులూ ,అన్యాయము చేశానని
దేవుడు మాకీ దుర్గతి కలుగచేసాడని ,
చాలామంది ఆవేశంగా మాట్లాడతారు .
అయితే హృదయమునిండా భక్తిభావంతొ
చేసే చిన్న పాటి సేవ అయినా భగవంతుడు కరుణిస్తాడు .
పుక్కిటి నొటితో శివలింగాన్ని శుభ్రం చేసి ,
కాలి చెప్పులతో వాడిన పువ్వులను తొలగించి ,
భక్తిని చాటుకున్న బోయవాడైన తిన్నడిని
నీలకంఠుడు కరుణించలేదా ?
భక్తితో శబరి ఎంగిలి పండ్లను శ్రీరామచంద్రునికి సమర్పించి ఆ వైకుంఠవాసుని అవతార కృపకు పాత్రులు కాలేదా ?
పట్టెడు అటుకులను ఆప్తమిత్రుడైన శ్రీకృష్ణునికి అర్పించి అఖండమైన సంపదలు పొంది కుచేలుడు భాగ్యవంతుడు కాలేదా ?
భగవంతునికి ఎంత అడంబరంగా ,
ఆర్భాటంతో ఖర్చుపెట్టి పూజలు ,నైవేద్యాలు
అలంకరణలు ,కానుకలు సమర్పించి కార్యక్రమములు చేశారన్నది ముఖ్యం కాదు .
మీ పూజలో ,సేవలో భగవంతుని పై ఏమేరకు
ఎంతసేపు భక్తి భావంతో మనసు లగ్నం చేసి
పూజలు చేశారన్నది ముఖ్యం .
స్వార్ధచింతన లేని నిష్కళంక భక్తి కి
భగవంతుడు దాసుడైపోతాడు .
భక్తుని హృదయమందిరంలో
సదా కొలువై ఉంటాడు ఆ పరమాత్ముడు🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

No comments:

Post a Comment