Friday, March 27, 2020

బాధలు, కష్టాల గురించి

🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️

27-03-2020

☀️ "అమర చైతన్యం" ☀️
( శ్రీ రమణ మహర్షి బోధనలు )

బాధలు, కష్టాల గురించి:

సృష్టి ఆరంభం నుంచి కష్టాలు, బాధలు, చెడ్డతనము ఉన్నాయి. ఋషులు ఈ స్థితిని ఎందుకు మార్చలేదు. రాక్షసులున్నారని వేదం చెప్పింది. ఏదో ఒక నిరోధకశక్తి కష్టాలను దుఃఖాన్ని సృజిస్తుంది. ఇదంతయు మానవుల మంచికి మరియు వికాశమునకు పనికి వచ్చింది. ప్రకృతిలోని మరొక శక్తి యొక్క పనియే ఇది.

ప్రశ్న: ప్రపంచంలోని బాధల వలన, చెడుల వలన ప్రయోజనమేమిటి ?

జవాబు: ప్రపంచంలో కష్టాలు లేకపోతే మనము మనము మన నిజస్వరూపాన్ని గురించి ఆలోచించము. దుఃఖమే మనిషికి భగవంతుడిని గుర్తు చేస్తుంది. జ్ఞానులకు తప్ప రాజు మొదలుకొని కూలివాని వరకు కూడా ఎంతోకొంత బాధ, దుఃఖము వుంటాయి. కొంచెం బాధలకే మనిషి భగవంతుడిని తలవడు. దెబ్బ కొంచెం గట్టిగా తగిలితేనే భగవంతుడు గుర్తుకువస్తాడు. మనకు ఈ శరీరం వచ్చింది మన నిజస్వరూపాన్ని (ఆత్మని) తెలుసుకొనుటకు మాత్రమే. సృష్టి యొక్క ప్రయోజనం నిన్ను నీవు తెలుసుకోవడమే. నీ నిజస్థితిలో మాయ అనేది లేదు. నీ గురించి నీవు తెలుసుకొనక పోవడమే నీవు చేసే పొరపాటు.

ప్రశ్న: ప్రపంచం పురోగమిస్తోందా..

జవాబు: ప్రపంచాన్ని నడిపే వాడొకడున్నాడు. అదీ అతని పని.
సృష్టి చేసినవాడే దానిని నడుపుతున్నాడు. మనకు అభివృద్ధి వుంటే ప్రపంచం కూడా అభివృద్ధి చెందినట్లే.. నీవెలాగో ప్రపంచం కూడా అలాగే. నిన్ను నీవు తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నందువల్ల నీకేమి ఉపయోగం.. ఆత్మజ్ఞానం లేక ప్రపంచ జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. ప్రపంచాన్ని ఆత్మదృష్టితో చూడు.

No comments:

Post a Comment