Monday, March 30, 2020

"నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!

"నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!

జ్ఞానం అంటే ఉన్నది తెలియడమే. ఉన్నది అంటే కనిపించేదాని వెనుక ఉన్నదేదో తెలియడం. నేను అంటే మనసే. మనసంటే ఆలోచనలే. ఇది అర్ధమైతే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గితే నేను తగ్గుతుంది. నేను అదృశ్యమయ్యే కొద్ది ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది. సుఖం కోసం, సౌఖ్యం కోసం మరో దానిపై ఆధారపడే కొద్దీ నేను పెరుగుతుంది. నేను పెరిగే కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది. ఆధునికత పేరుతో మనిషి సాంకేతికపై ఆధారపడటమే ప్రస్తుత అజ్ఞానానికి కారణం. అంటే సాంకేతికత వద్దని కాదు. దాని అతివినియోగం, దుర్వినియోగం వద్దని భావం. ప్రాపంచిక విషయాలపై కాకుండా పరిపూర్ణ విశ్వాసంతో పరమాత్మను నమ్మితే, అహంకారంతో కూడిన నేను పోయి జ్ఞానం అంకురిస్తుంది. నేను అస్తమించడమే జ్ఞానం ఉదయించడం !

🕉 శ్రీ గురుభ్యోనమః

ఆత్మజ్ఞానం భగవంతుడు బహుమతి గా ఇచ్చేదే కానీ, మనం
అడిగి తీసుకునేది కాదు.

జ్ఞానం పొందాలంటే సుఖపడాలనే కాంక్ష పోవాలి. సుఖపడే రోజులు రావడం లేదు అనేది ఒక ఆపేక్ష. నీవు అనుకున్నా అనుకోక పోయినా జరిగేది జరిగి తీరుతుంది.

కలియుగంలో ఎవరిని ఎలా హింసించాలనే ఆలోచనలు ఉంటాయి. మనకు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉండాలి.

అందరినీ ఆయనే చూసుకుంటు న్నాడు. ఎవరిని హింసించినా భగవంతుని హింసిస్తున్నాము అనే భావన రావాలి.

ఈ దేహం ఎందుకు వచ్చిందో ఆ పనులు పూర్తి అయ్యేవరకు అది ఈ భూమి మీద తిరుగాడుతూనే ఉంటుంది. దేనికీ ఆందోళన వద్దు.


" అమృతవాహిని"

🌷🙏🌷

No comments:

Post a Comment