Wednesday, March 25, 2020

ఆత్మలు...విశ్వం లో ఉన్న కోటాను కోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిల

ఆత్మలు...!

విశ్వం లో ఉన్న కోటాను కోట్ల ఆత్మలన్నీ

ఈ ఏడు ఆత్మ స్థాయిలలో

ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.

1. శైశవ ఆత్మ (అజ్ఞాని):-
దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.

2. బాల ఆత్మ (విపరీత జ్ఞాని):-
మేము చెప్పేదే కరెక్ట్
అని వితండ వాదం చేసేవారు.

3. యువ ఆత్మ (ప్రాపంచిక జ్ఞాని):-
పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.

4. ప్రౌఢ ఆత్మ (వేదాంతి):-
'అంతా దైవమే, అంతా మాయే,
మనం నిమిత్త మాత్రులం' అనేవాడు.

5. వృద్ధ ఆత్మ (యోగి):-
ధ్యానం చేస్తూ,
దివ్య దృష్టిని ఉత్తేజింప చేసుకున్నవాడు.
కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే ట్రిక్స్' అని అనుకునే వాడు.

6. విముక్త ఆత్మ (ఋషి /రాజర్షి):-
ఎంత మాత్రం మాట్లాడ కూడదు, సాధన చేయాలి అనే వాడు.
సాధన చేస్తూ తన దగ్గర కు వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.

7. పరిపూర్ణ ఆత్మ (బ్రహ్మర్షి):-
అన్ని చోట్లకు తిరుగుతూ, ప్రతి ఫలాపేక్ష లే కుండా ఆత్మ జ్ఞానాన్ని అందించే వారు.

ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో--
వారు
జనన మరణ చక్రమును దాటుతారు.

అలాంటి వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదు. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినో భవన్తు!🙏

No comments:

Post a Comment