Wednesday, March 25, 2020

మనం సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కోకుంటే ఏమవుతుంది? చెడు కర్మ చేస్తే దానధర్మాలు చేస్తే అది పోతుందా?

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 12 🌹
🌻 Chapter - కర్మ - 2 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ

Q:-- మనం సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కోకుంటే ఏమవుతుంది? చెడు కర్మ చేస్తే దానధర్మాలు చేస్తే అది పోతుందా?

A:-- దానధర్మాలు చేసినా చెడు కర్మ ఎదుర్కోవాల్సిందే. చెడు కర్మలు చేసి దానధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము అనేది అబద్దం. మనం ఏ కర్మ అయినా నిస్వార్థంగా, ఫలితం ఆశించకుండా చేయాలి. అప్పుడే ఉన్నత ఆవరణ లేదా స్వర్గం అనవచ్చు, ఆ లోకానికి చేరుతాము.

మనం చెడు పనులు చేసి, దాన్ని కప్పిపుచ్చు కోవడానికి, దానధర్మాలు చేస్తే బాలన్స్ అయిపోతుంది అనుకోవడం అసత్యం. మనం ఏ భావనతో ఆ కర్మ చేసామన్నదే ముఖ్యం.

2. రెండవది:-- మనం సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కోవాలి.

మనం అనారోగ్యంతో ఉన్నామనుకోండి, మనకు సహాయం చేయడానికి ఎవరన్నా వచ్చారనుకోండి, మనం నిరాశ, నిస్పృహ తో, ఎప్పుడూ గొణుగుతూ, విసుక్కుంటూ, ఫిర్యాదు చేస్తూ, ఉంటే అది ఇంకా వారికి కర్మ add అవుతుంది.

ఎందుకంటే సహాయం చేయడానికి వచ్చిన వారి జీవితం కూడా వారి ప్రవర్తన తో నాశనం చేస్తారు కాబట్టి, అనగా వారి ప్రశాంతత ను పోగొడతారు కాబట్టి, ఇది ఇంకా కర్మను వారికి పెంచుతుంది.

ఎవరైతే బాధను హుందాగా, చిరునవ్వు తో అనుభవిస్తారో, దైవము పట్ల గౌరవం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, వారే కర్మ పరీక్షలో నెగ్గినట్లు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment