Wednesday, March 18, 2020

కరోనా అనేది ఒక పెండామిక్, ఇది పాశ్చత్య దేశాలు వారి వారి ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చెయ్యడానికి వేసే ఒక పన్నాగం.

This is something intresting

మన భరత భూమి మీద ఈ ఒక్క రోజులో 27,777 మంది ఆకలి చావులతో చనిపోతే లేని హడలు, కేవలం 77 మందికి కొరోనా సోకింది అని, ఓ తెగ హడావుడి చేస్తున్నాం !

మరోసారి ఏకగ్రీవంగా మేమందరం గుంపు గొర్రెలం అని నిరూపించుకుంటున్నాం...
ఎలా అంటారా? రెండే రెండు నిమిషాలు చదవండి.

కరోనా అనేది ఒక పెండామిక్, ఇది పాశ్చత్య దేశాలు వారి వారి ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చెయ్యడానికి వేసే ఒక పన్నాగం. మన భారత దేశం కూడా అందులో ఒక చిన్న భాగం. ఇది అనాదిగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం.
ప్రతి 10 సంవత్సరాలకు వచ్చే ఈ సినిమాకి మొదటిగా కధ రాసేది "బడా కార్పొరేట్స్. తర్వాత ప్రొడ్యూస్ చేసేది "బడా బ్యాంకులు", దర్శకత్వ బాధ్యతలు చేపట్టేది, "మెడికల్ మాఫియా, బయో సైంటిస్టులు".

సినిమా రిలీజ్ దగ్గరకు రాగానే అడ్వర్టైస్మెంట్స్ మరియు మార్కెటింగ్ చేసేది "పబ్లిక్ మీడియా , టీవీ చాన్నాళ్లు , సోషల్ మీడియా". ఇకపోతే, ప్రేక్షకులు. అది మనమే, గుంపుల గుంపులుగా బతుకుతున్న గొర్రెలం.

పది సంవత్సరాలు కష్టపడి తీసి, రిలీజ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ మాములుగా ఉండవు. ఓపికగా కింద చదవండి.

1.మొదటిగా: "దేశా ద్రవ్యోల్బణం మీద దెబ్బ పడుద్ది. ఎంత అంటే మళ్ళీ కోలుకోవడానికి పక్కాగా 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మొదటిగా పాపం మన గొర్రెలు దాచుకున్న వారి సేవింగ్స్ ను తీసుకెళ్లి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, mutual ఫండ్స్ మీద బొమ్మ పడుతుంది. ఒక్కసారిగా గీత గిర్రుమంటూ కిందకు కుదేలుఅవ్వుద్ది. మన గొర్రెలు భే అని అరవడం తప్ప ఏమి చెయ్యలేరు.

2.రెండు: కమర్షియల్ బిజినెస్ అయిన ఫుడ్, క్లోతింగ్, ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్, డొమెస్టిక్ అమ్మక, కొనుగోళ్లు, ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంపోర్ట్స్, ఎక్సపోర్ట్స్ ఇలా అన్ని కలిసి దేశ ఆర్ధిక బలం మీద కొడుతోంది. దీనికి సపోర్ట్ గా లోకల్ స్టేట్ గవర్మెంట్స్ కూడా నిధులు పొలోమంటూ ఖర్చుపెడతాం, అని కాకమ్మ కబుర్లు చెప్పి,వారి 5 సంవత్సరాల పదివి కాలంలో సంపాదించలేని డబ్బు కేవలం మూడు లేదా నాలుగు నెలలు ఆడే ఈ సినిమా కాలంలో నొక్కేస్తారు . ఎందుకంటే మళ్ళీ వచ్చే ఎలెక్షన్స్లో బాగా ఖర్చుపెట్టాలిగా!.

3.మూడోది: ఇన్సూరెన్సు బిజినెస్. వామ్మో దీనిగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది, ఎందుకంటే దేశ ఒక వంతు ఆర్ధిక బలం ఈ కార్పొరేట్ కంపెనీల్లోనే ఉంటుంది. ఈ పెండమిక్ సినిమా అదే కరోనా అనే ఈ సినిమా ఆడుతున్నప్పుడు, సంవత్సరాలు కొద్దీ కడుతున్న హెల్త్, టెర్మ్ ఇన్సురన్సులు ...మన గొర్రెలకు ఎటువంటి వ్యాధి వచ్చి హాస్పిటల్ కి వెళ్తే ఎక్కడా లేని టర్మ్స్ అండ్ కండిషన్లు పెడతాయి,క్లెయిమ్ చేసిన మొత్తంలో కేసుల్లో క్లెయిమ్ confirm రేషియో 54%కన్నా తక్కువ ఉంటుంది...మాములు రోజుల్లో ఈ రేషియో 87%కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఒక్కసారిగా కిందకు రాగానే ఇన్సూరెన్సు కంపెనీలు లక్షల కోట్లు ఆర్జిస్తాయి, అది కూడా కొన్ని రోజుల్లో మాత్రమే.

4.నాల్గవది: ఎయిర్ ట్రావెల్ మరియు ట్రాన్స్పోర్టేషన్. ఇది చాలా పెద్ద బిజినెస్, ఈ కరోనా ఆడుతున్నత కాలం అడుక్కుతింటుంది. దాని ప్రభావం మళ్ళి దేశ ఆర్ధిక బలం మీద పడుతుంది. అంటే దాన్ని రికవర్ చెయ్యడానికి వారి వారి చార్జీలు పెద్ద మొత్తంలో రాబోయే కాలంలో పెంచేస్తారు.

5.ఐదవది: దేశ ఆకలి చావులు: ఇది ఒక్కసారిగా పెరిగిపోతుంది, ఎందుకంటే ఇంపోర్ట్స్, ఎక్సపోర్ట్స్, వ్యవసాయ ,డొమెస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఇండుస్త్రీల మీద పేడేల్మని చెంపదెబ్బ పడుద్ది , మరో విషయం, ఈ hunger Index రేట్ తగ్గింది అంటే, దేశాల మధ్య అంతర యుద్ధం జరుగుతుంది అని అర్ధం. ఒక్కసారి గూగుల్ లో "hunger deaths in india" అని సెర్చ్ చెయ్యండి, సగటున ఒక సంవత్సర కాలంలో కోటిమంది పైగా చనిపోతున్నారు. అంటే రోజుకు తక్కువలో తక్కువ 27,777 చనిపోతున్నారు. అందుకే మొదట్లో తిట్టా. కేవలం 77 పాజిటివ్ కరోనా కేసులు వచ్చాయని ఈ ముండా మీడియా అరుస్తుంటే మన చేతుల్లో ఉన్న సొల్లు ఫోనులు లో మెసేజ్ లు హడలు దొబ్బుతున్నాయి. వాటిని చూసి ఓ గజగజ వణికి చస్తున్నాం. ఈ భయంలో కేవలం ఒకే ఒక్క శాతం మనవంతుగా రురల్ ఏరియా, సిటీల్లో ఆకలికి తట్టుకోలేక చనిపోతున్న వారిమీదో, పర్యావరణ వినాశనం మీదో ఉంటె ఎంత బాగుణ్ణు.

చెప్పడం మర్చిపోయా...మీకు గుర్తుందా, కరోనా రాక ముందు చాలా దేశాల్లో పర్యావరణ వినాశనం మీద పెద్ద పెద్ద చర్చలు జరిగేవి, అవి ఇప్పుడు కనుమరుగయ్యాయి. అదికూడా కార్పొరేట్లు రాసుకున్న కధలో భాగమే, ఎందుకంటే ప్రకృతి మీద మనకు ప్రేమ పెరిగిందీ అంటే భారత హిందుత్వ వైవిద్యం తెలిసిపోయి అద్భుతంగా, ఆనందంగా బ్రతకడం మొదలుపెడతాం, మనం గుంపుల గొర్రెలం కార్పొరేట్ చేతిలో ఉన్న కొరడా మాట వినడం మానేసి మన దారి మనం చేసుకుంటాము, మరి గొర్రెల కాపరి అయిన కార్పొరేట్లు, మెడికల్ మాఫియా ఊరుకుంటాయా? ఇదిగో ఇలా 10 సంవత్సరాలకు ఒక సారి కొత్త కొరడాతో కొట్టడం మొదలు పెడతాయి. దీన్నే "పెండామిక్ కొరడా" అని అన్ని దేశాలు ముద్దుగా పిలుచుకుంటాయి.

6.ఆరవది: ఇదే అదనుగా మెడికల్ మాఫియా ఒక్కసారిగా సరికొత్త వాక్సిన్ ను కనుగొంటాయి, మొదట్లో చాలా రహస్యంగా బడా బాబులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ వాక్సిన్, ఈ సినిమా బాగా ఆడి కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించి, వారి వారి కార్పొరేట్ ఆర్థిక విలువను విపరీతంగా పెంచుకుంటాయి. ఆ తర్వాత సినిమాను కొద్దిరోజుల్లో netflix లో ఉచితంగా రిలీజ్ చేసినట్లు, అన్ని దేశాలకు ఉచిత వాక్సిన్ అంటాయి, ఆ దెబ్బకు గజగజ వణుకుతున్న గుర్రెలకు ఆ కార్పొరేట్ రక్కసి వదిలిన వాక్సిన్ ను మహా ప్రసాదంగా భావించి శతకోటి దండాలు పెట్టి, వారిని దేవుళ్లను చేసేస్తాయి. అంతే సినిమా కధ సమాప్తం. మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రిలీజ్ కు సిద్ధం.

గుర్తుపెట్టుకోండి నిజం ఎప్పటికీ చేదుగానే ఉంటుంది. అందరూ అనుకుంటున్నారు మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో అప్పుడు భూమి సర్వవినాశనం అవుతుంది అని, బుర్రలు లేని గొర్రెల్లారా ఆ యుద్ధం రెండు నెలల క్రితం చైనాలో హువాన్ అనే ఒక పట్టణంలో మొదలైయింది. ఇప్పుడు బాంబులు లేవు, అంతా బయో-బాంబులు మాత్రమే. ఎందుకంటే బాంబులతో దేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థల ఆస్తులు సర్వనాశనం అవుతాయి, మరి అలాంటప్పుడు ఎందుకు యుద్దాలు జరుగుతాయి?. ఇలాంటి కరోనానో, ఎబోలానో, నిఫా అనో చెత్త పనికిమాలిన పేర్లు పెట్టుకుంటూ మన గొర్రెల జీవితాలను నాశనం చెయ్యడానికి వస్తాయి.

ఇలాంటివి ఏమీ తెలియకుండా హయ్యో కరోన, అమ్మో కరోన అని అని భయం మళ్ళీ...పోరా నీ మట్టి బుర్ర....సరే భయమేమి లేదు...పక్కవాళ్లకు మీకు తోచినంత అవగాహన కల్పించండి. టెన్షన్ పడొద్దని చెప్పండి... మన భయమే వాళ్ళ ఆయుధం, గుర్తుపెట్టుకోండి...ఏమీ జరగదు మనకు... ముందు ఆ కరోనా న్యూస్ బంద్ చెయ్యండి, ప్రశాంతంగా ఉండండి.మళ్ళీ కలుద్దాం. 🤝తాడి చిన్నారెడ్డి🤝

No comments:

Post a Comment