Saturday, January 30, 2021

భార్యాభర్తల బంధం బలపడాలంటే ఇలా చేయండి

బంధం ఏదైనా సరే అది గట్టి పడి నాలుగు కాలాల పాటు నిలవాలంటే దానికి ప్రేమ, సంరక్షణ, అర్ధం చేసుకునే గుణం కావాలి. అయితే, ముఖ్యంగా భార్యాభర్తల బంధం. ఎక్కువ మంది జంటలకి అర్ధం కానిది ఏమిటంటే ఇందు కోసం చేయవలసిన పని, పడాల్సిన కష్టం. రిలేషన్ షిప్‌లో మొదటి మెట్టు క్లియర్ కమ్యూనికేషన్. ఇందువల్ల అపార్ధాలకి తావు లేకుండా ఉంటుంది, అర్ధం చేసుకోవడానికి ఎక్కువ వీలు ఉంటుంది. ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్ షిప్‌లో ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలి. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా, అనుకోనిది జరిగినా ఆ పరిస్థితిని మర్చిపోయి క్షమించగలగాలి. ఏ బంధమైనా దానంతట అదే సాఫీగా నడిచిపోదు. దాన్ని పదిలంగా కాపాడుకోవడానికి కొంత కష్ట పడాలి, కష్టపడి ఆ బంధాన్ని నిలుపుకోవాలనే ఇష్టం ఉండాలి.


మనకి తెలిసిన వారిలో ఒకరి వివాహ బంధం ఎంత బావుందో అని మనకి అనిపిస్తే ఆ బంధం మొదట్నుంచీ అలా ఉండే అవకాశాలు చాలా తక్కువనీ, ఆ బంధం లో ఉన్న ఇద్దరూ ఆ వివాహ బంధాన్ని అలా ఉంచుకోవడానికి అవసరమైన పనులు చేశారనీ అర్ధం చేసుకోవాలి.

1. మీ పార్ట్నర్ యొక్క ఇష్టానిష్టాలని అర్ధం చేసుకోండి. ఇందువల్ల మీరు వారిని కూడా బాగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఫలితంగా, కొన్ని అనవసరమైన ఘర్షణల నుండి తప్పించుకోవచ్చు. 2. ఆరోగ్యకరమైన బంధానికి అవసరమైన వాటిలో ఒకరి స్పేస్ ని ఇంకొకరు గుర్తించడం, గౌరవించడం కూడా ఒకటని గమనించండి.

3.వివాహమైన కొత్తలో ఇంకా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు కాబట్టి ఎన్నో సర్ప్రైజులు వస్తూ ఉంటాయి. వాటికి సిద్ధంగా ఉండండి.

4. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలని దాచకండి. ఏదైనా ఎక్కడైనా తేడా వస్తే ప్రశాంతంగా కూర్చుని దాన్ని ఏం చేయాలో ఆలోచించుకోండి.

5. ఏవైనా ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటే, ఎందుకు అలా జరుగుతోందో ఆలోచించండి, అర్ధం చేసుకోండి.

6. కమ్యూనికేషన్ ఎంతో ముఖ్యమైనది. మీ భావాలను వీలున్నంత స్పష్టం గా కన్వే చేయండి. మీ ఫీలింగ్స్ ని అవతలివారు అర్ధం చేసుకునే విధంగా ఎక్స్ప్రెస్ చేయండి.

7. మీ పార్ట్నర్ తో సమయం గడపడానికి ప్రాముఖ్యతని ఇవ్వండి. ఒక్కొక్కసారి మీ పార్ట్నర్ ని వారిలా అంగీకరించడం మంచిది, ఇగో క్లాషులతో బంధాన్ని విచ్చిన్నం చేసుకోవడం కంటే. ఒక రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా అవ్వాలంటే కొన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ కావాలి, అందుకనే అనవసరమైన విషయాలు మీ ఎమోషన్స్ ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా కాపాడుకోవాలి. పునాది సరిగ్గా ఉన్న బంధాలు తరువాత వచ్చే సమస్యలని తట్టుకుని నిలబడగలుగుతాయి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment