Sunday, January 31, 2021

అమ్మ నాదా??నీదా

అమ్మ నాదా??నీదా??🤱

రాజమ్మ ఒక తోటలో కూలీ చేసే యువతి... తండ్రి ఆలస్యంతో పెళ్ళి కూడా ఆలస్యంగా జరిగింది .. భర్త రంగయ్య పచ్చి తిరుగుబోతు... కష్టాలు పెరిగిపోయాయి రాజమ్మకి..ఏదో కూలీ పనిలో వచ్చిన డబ్బుతో సంసారం నడుపుకొంటున్నది.. అలా కాలం గడుస్తుంది.. ఇంతలో రాజమ్మ జీవితంలోకి అడుగుపెట్టారు నలుగురు కొడుకులు... సంతానం చూసి మురిసిపోయింది రాజమ్మ.కొడుకులు ప్రయోజకులై తనని ఉద్దరిస్తారని ఆశ రాజమ్మలో రోజురోజుకు పెరిగిపోతుంది..కాలగమనంలో సంతానను ప్రేమగా,ఏ లోటు లేకుండా చూసుకుంటుంది..

పిల్లలు పెరిగారు.. ప్రయోజకులయ్యారు...అందరికి పెళ్ళి చేసింది.. కోడళ్ళు సంసార బాధ్యతగా అత్తగారింటికి వచ్చారు.. కాలం గడిచిపోతూ ఉంది.. రంగయ్య మంచాన పడ్డాడు.. పక్షవాతం.. చిన్న ఇంటిలో సంసారం కష్టం ఐనది..ఉమ్మడి కుటుంబం ముక్కలైంది.. రంగయ్య బాధ్యత ఎవరికీ పట్టలేదు..రాజమ్మ మళ్ళీ కూలీ పనికి వెళ్లడం మొదలైంది..

రంగయ్య చనిపోయాడు... రాజమ్మ ఒంటరైంది..వేర్వేరు సంసారాలలో కొడుకులు రాజభోగాలుఅనుభవిస్తున్నారు..రాజమ్మ గోడు ఎవరికీ పట్టదు..కాయ కష్టంతోతనకడుపునింపుకుంటుంది..

చిన్నప్పుడు అమ్మ నాకు రా ..."అమ్మ నాది రా... "అని గొడవ పడ్డ చిన్నారి కొడుకుల అల్లరి మాటలు రాజమ్మను తడుముతున్నాయి.... అనుకోకుండా రాజమ్మ కళ్ళలో నీటి సుడులు తిరుగుతున్నాయి.. రాజమ్మ వయసు పైబడిన తరువాత కొడుకులని పిలిచి "నన్ను చూసుకోండిరా "అని అడిగింది .. కొడుకుల నుండి ఎలాంటి పిలుపులేదు.. !!!!

కాలంతో పోరాటం చేస్తూ రాజమ్మ ఇంకా బ్రతుకు మీద ఆశతో జీవితాన్నిగడుపుతుంది... ఆమె జీవితానికి దేవుడే దిక్కు అని అనుకుంటూ, కాలంచెల్లే రోజుల కోసం ఎదురుచూస్తోంది..

చివరిగా ఒక్కమాట ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు.. కాని అమ్మలేని జీవితం లేదు.. అమ్మ ఒకవేళ చిన్న వయసులో మనల్ని వదిలేసి ఉంటే,,,,,,ఈ సంసారం,సంస్కారం మనకు ఉండేవా???
ఆమె దైవం!!.. ఆమె మన బాధ్యత!! జాగ్రత్తగా చూసుకుందాం..

సమాజాన్ని మేల్కొలపడం కోసం ఒక చిన్న ప్రయత్నం.."ఇది కథ కాదు"..
✍🏻నీరజ వాకా

Source - Whatsapp Message

No comments:

Post a Comment