Saturday, January 30, 2021

జీవిత సత్యాలు.

జీవిత సత్యాలు.

ఆకలితో ఉన్నప్పుడు దొరకని
’అన్నం’
అలసిపోయినప్ఫుడు దొరకని
’నీడ ‘
దుఃఖంలో రాని ‘బంధాలు’
కష్టంలో రాని ‘స్నేహాలు’
చనిపోయిన తర్వాత చూపించే
’ప్రేమ’
అన్ని వ్యర్ధమే....!!!


మనిషి జీవితం
తెల్లకాగితం లాంటిది.
అందులో
మంచి,చెడు రెండింటినీ
రాయొచ్చు ..!
మంచి ఉంటే
నలుగురూ
దాచుకుంటారు
చెడు ఉంటే
చించి పారేస్తారు.
జీవితం అంటే అంతే.•


◻️ఎవరో విలువ ఇవ్వలేదని

◻️మీ విలువ తగ్గించు కోకండి


◻️మీ జీవితం మీకెప్పుడు విలువైనదే

◻️మీకు నచ్చినట్టు హుందాగా బతికేయండి

◻️ఎందుకంటే గడిచిన క్షణాలు...మళ్లీ తిరిగి రావు


1)“కోపం రావడం మానవ సహజం.అయితే,దాన్ని ఎక్కడ,ఎప్పుడు, ఎవరి మీద ఎలా ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.”

2 ) “మాటలు నమ్మేవారికి అబద్దాలు సులువుగా చెప్పి నమ్మించొచ్చు. కాని, మనిషిని నమ్మేవారికి మాత్రం అబద్దాలు చెప్పి నమ్మించడం అతి కష్టం”.

3) మంచికి దగ్గరగా ఉంటే మనం బాగుంటాం.
చెడుకి దూరంగా ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు.

4) నీ బాధనుఅర్థం చేసుకోమనీ నీవు ఎవ్వరినీ అడగకు.ఎందుకంటే వాళ్లు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు .

కొంతమంది మనం బాగుపడితే చూడలేరు మరియు బాధపడుతుంటే ఓదార్చలేరు,

తమ తప్పులు దాచుకుని,ఎదుటివారి తప్పులను వెతుకుతారు. వారిని దుారంగా ఉంచడం మంచిది

👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment