Friday, January 29, 2021

రైతులకి డ్రగ్ మాఫియాకి సంబంధం ఏమిటీ?

 నకిలీ రైతు ఉద్యమమానికి డ్రగ్ మాఫియా నిధులు సమకూరుస్తున్నది అని నేనంటే కొంతమంది తెగ ఆవేశపడ్డారు. రైతులకి డ్రగ్ మాఫియాకి సంబంధం ఏమిటీ అంటూ ! నా గత పోస్ట్ లోనే చెప్పాను డ్రగ్ వ్యాపారం వల్ల వచ్చిన నల్ల డబ్బు ఎలా చెలామణీ లోకి వస్తుందో. Udta పంజాబ్ అంటే తెలీని కుంకలకి అంతా విచిత్రంగా ఉంటుంది నిజాలు చెపితే. అసలు సమస్య MSP కానే కాదు ఒకవేళ నిజంగా MSP నే సమస్య అయితే పంజాబ్ ప్రభుత్వమే దానిని చట్టబద్ధం చేసి రైతుల దగ్గర నుండి కొనవచ్చు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలని పంజాబ్ లో అమలు చేయము అని అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించిన వాళ్ళు పంజాబ్ వరకు MSP ని ఎందుకు చట్టబద్ధం చేయరు ? 2019 ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ , ఆప్ పార్టీలు చేసిన వాగ్దానం ఇదే కదా ? డ్రగ్ మాఫియా, రైతు మార్కెట్ దళారీలు ఒకే నాణానికి రెండు ముఖాలు ఒకటి తీసేస్తే ఇంకోటి చెల్లదు. రెండు నెలలు రోజూ 1000 మందిని AC బస్సుల్లో తీసుకురావడం తీసుకువెళ్లడం లాంటి ఖరీదయిన పనులు డ్రగ్ మాఫియానే చేయగలదు అంతే కానీ నిజమయిన రైతు ఆ పని చేయలేడు. 

ఈ రోజు రైతుల పేరుతో చేసిన విధ్వంసానికి వాడిన మోడిఫై చేసిన ఒక్కో ట్రాక్టర్ ఖరీదు అక్షరాల 35 లక్షలు. మానస్టర్ ట్రక్కులకి వాడే పెద్ద పెద్ద టైర్లు ట్రాక్టర్లకి వాడారు ఎత్తైన బారికేడ్ల మీద నుండి వెళ్ళడానికి. ఇంతా చేస్తే మా అసలు లక్ష్యం నెరవేరినది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎవరి లక్ష్యం ? ఐఎస్ఐ via కెనడా MNC ల హస్తం కూడా ఉంది. 2018 లో కెనడా డ్రగ్స్ వాడకం మీద నిషేధం తీసేసింది ఎవరి కోసం? ఖాలిస్తాన్ వాదాన్ని తిరగదొడి దానిని నేరుగా మన దేశంపైన ప్రయోగిస్తున్నది ఎవరు ? ఐఎస్ఐ Via కెనడా లాబీ. అసలు నిజం ఏమిటో చదవండి. 

గత 10 సంవత్సరాలుగా మన దేశం చిరు ధాన్యాల తో పాటు పచ్చ బఠానీలు కెనడా నుండి దిగుమతి చేసుకుంటున్నది. మనం వాడుతున్న పప్పులు,చిరు ధాన్యాలు,బఠానీలు సింహా భాగం కెనడా నుండి దిగుమతి చేసుకుంటున్నవే అయితే కెనడా తో పాటు నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా దగ్గర కూడా కొంటున్నాము కానీ ఎక్కువగా కెనడా నుండే కొంటున్నాము. 2019-2020 సంవత్సరానికి కాను 11 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు[Pulses ], 4 లక్షల టన్నుల పప్పు కాయ ధాన్యాలు [lentils], 3.5 లక్షల పచ్చ బఠానీలు [yellow peas] దిగుమతి చేసుకున్నాము. 

2014 లో బిజేపి అధికారంలోకి రాగానే వీలున్ననంత వరకు మన దేశంలోనే పంట వేయాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం రైతులకి ప్రోత్సాహకాలు ప్రకటించింది. అసలు లక్ష్యం విదేశీ మారక ద్రవ్యం ని ఆదా చేయడం కోసమే. అలాగే దిగుమతుల మీద టాక్స్ పెంచి దిగుమతులని తగ్గించే ప్రయత్నం చేసింది. నిజానికి పైన చెప్పిన వాటిని మన దేశంలో చక్కగా పండించుకోవచ్చు తద్వారా దిగుమతుల మీద ఆధార పడడం తగ్గించుకోవచ్చు పైగా రైతులకి లాభదాయకంగా ఉంటుంది. దిగుమతి చేసుకునేబదులు మన రైతుల దగ్గరే కొంటె రెండు విధాలా లాభం. 

2020 ఫిబ్రవరి 13 న కెనడాలో జరిగిన ఒక సెమినార్ లో కెనడా వ్యవసాయ మంత్రి డేవిస్ మారిట్ [Davis Marit] [Saskatchewan, the largest pulses growing province of Canada] మాట్లాడుతూ భారత్ చేపడుతున్న దిగుమతుల మీద పన్ను పెంపు లాంటి చర్యలు కెనడా కి ఛాలెంజ్ అవుతుంది. మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాము, ఇప్పుడు భారత్ కనుక దిగుమతుల మీద పన్ను పెంచితే అది మా దేశానికి చాలా ప్రమాదం అవుతుంది. దీనిమీద మేము కొంచెం సీరియస్ గానే స్పందించాల్సిన అవసరం ఉండతూ ఒక హెచ్చరిక లాంటి వ్యాఖ్య చేశాడు ఆ సమావేశంలో . ఆ సెమినార్ ని భారత్ తరుపున Indian Pulses and Grains Association (IPGA) నిర్వహించింది అన్నది గమనార్హం. భారత్ కనుక మా చిరుధాన్యాలు,పప్పులు,బఠానీల మీద పన్ను పెంచితే మేము వేరే దేశాలలోని మార్కెట్ల ని వెతుక్కోవాల్సి ఉంటుంది ఇది మా ఎగుమతల మీద పెను ప్రభావం పడుతుంది అంటూ వాకృచ్చాడు డేవిస్ మరిట్ . ఇది పరోక్షంగా తమ MNC ల కోసం చేసిన హెచ్చరిక లాంటి వ్యాఖ్య. 

2017 నుండి కొన్ని పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాల దిగుమతుల మీద కొద్దిపాటి ఆంక్షలు విధించింది భారత ప్రభుత్వం ఇది స్థానిక రైతుల ప్రయోజనాలని కాపాడడానికే. భారత దేశం అతి పెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తి దారు మరియు దిగుమతి కూడా చేసుకుంటుంది. 

మన దేశ పప్పు ధాన్యాల డిమాండ్ వచ్చి 26 మిలియన్ టన్నులు అయితే ఉత్పత్తి అవుతున్నది 23 మిలియన్ టన్నులు అంటే కొరత 3 మిలియన్ టన్నులు అన్నమాట. ఈ 3 మిలియన్ టన్నులనే కెనడా నుండి దిగుమతి చేసుకుంటున్నాము. అయితే ఈ సంవత్సరం 26 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఇదే కెనడా ఆక్రోశానికి కారణం. ఈ సంవత్సరం కనుక లక్ష్యం నెరవేరితే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 

ఇంతకీ కెనడా నుండి దిగుమతి చేసుకుంటున్నది ఎవరు? కెనడాలో ఎల్లో విప్లవం పేరిట Saskatchewan ప్రావిన్స్ లో ఈ పంటలని సాగు చేస్తున్నది ప్రధానంగా సిక్కు రైతులు ఇది అతి పెద్ద కార్పొరేట్ వ్యవసాయం. 2007 నుండి Saskatchewan ప్రావిన్స్ లో సిక్కు రైతుల చేత ఈ పంటలు సాగు చేయబడుతున్నాయి. 

వీటిని దిగుమతి చేసుకుంటున్నది పంజాబ్ కి చెందిన ధనిక కుటుంబాలు వీళ్లలో అధిక శాతం కాంగ్రెస్ పార్టీ కి చెందిన వాళ్ళు కొంతమంది బాదల్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. గత పదేళ్లుగా వీళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించారు కేవలం దళారీ పనులతో . ఈ సంవత్సరం కెనడా నుండి దిగుమతులు ఉండకపోవచ్చు పైగా నూతన వ్యవసాయ చట్టాల వల్ల నష్టపోయేది ఈ గుప్పెడు కాంగ్రెస్ , బాదల్ మద్దతు దారులే. అటు కెనడా నుండి దిగుమతల వల్ల వచ్చే ఆదాయం తో పాటు ఇటు మండీల నుండి వచ్చే కమీషన్ కూడా పోతుంది. ఆందోళన పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న వాళ్ళు కేవలం పంజాబ్ కి చెందిన కాంగ్రెస్,బాదల్ లకి చెందిన కొద్దిమంది ధనవంతుల కిరాయి మూకలు. చాలా కొద్ది మంది హర్యానా కాంగ్రెస్ కి చెందిన దళారీల కిరాయి మూకలు. 

ఇంత జరుగుతుంటే మోడీ ,అమిత్ షా లు ఏం చేస్తున్నారు అని పోస్టులు పెట్టేవాళ్ళకి ఒక టిప్పణి ! సున్నితమయిన సమస్య అయితే ఎదుటివాడు తప్పు చేసేవరకు ఆగి ఆ తప్పుని పది మంది కళ్ళారా చూసెట్లు చేయడమే చాణక్య నీతి !

రేపు సుప్రీం కోర్ట్ లో ఏం చెపుతాడు ప్రశాంత్ భూషణ్ ? కొద్ది సేపటి కింద కాడి కింద పెట్టేశాడు. ఇక రామ్ నామ్ సత్య హై అన్నా చచ్చినవాడు తిరిగిరాడు అంటే దింపుడు కళ్ళెం ఆశలు లేవు ఏకంగా శవాన్ని తగలబెట్టడమే! ఇంటెలిజెన్స్ వాళ్ళు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు ఈ రోజు. ఇంతా చేస్తే వీళ్ళు చేసింది ఎర్ర కోట మీద జెండా ఎగురవేశారు అంతే ! మిగతా క్లైమాక్స్ రేపు కోర్టులో తెలుస్తుంది. ఆఫ్కోర్స్ కొత్త విషయం ఏముంటుంది? 

జైహింద్ !

No comments:

Post a Comment