Friday, January 29, 2021

భగవంతుని దర్శనం కావాలంటే....?!

🙏 భగవంతుని దర్శనం కావాలంటే....?! 🙏

📚✍️ మురళీ మోహన్

🍃🌺భగవంతుని చూడాలంటే రోజూ ఎంత సమయం పూజ ,జపం, చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఏ మంత్రాన్ని ఎంత సాధనచేయాలి????
అని కొంతమంది అడుగుతూ ఉంటారు....

🍃🌺మరికొంతమంది దేవుడుంటే చూపించండి,దాని కోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం,చూపించగలరా అనికూడా ప్రశ్నిస్తుంటారు. ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం.

🍃🌺ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే
"దేవుడున్నాడా"అని మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు.

🍃🌺దానికి రామకృష్ణ పరమహంస గారు "దేవుడు వున్నాడు" అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు,

🍃🌺దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవటంతో మీరు చూశారా ? అంటూ మరొక మొండి ప్రశ్న వేశారు.

🍃🌺అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చిరునవ్వుతో దేవుడిని చూశాను. చూస్తున్నాను. నిన్నెలా చూస్తున్నానో ఆయనను అలాగే చూస్తున్నాను అన్నారు.

🍃🌺దానికి వివేకానంద గారు మరి నేను చూడాలంటే ఏమిచేయాలి ? అని అడిగారు గురుదేవులను...

🍃🌺గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్లో ముంచి ఒక నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదలి పెట్టారు.

🍃🌺తర్వాత ప్రశాంతంగా వివేకానంద ను చూస్తూ నీకు ఇప్పుడేమనిపించింది, అంటూ అడిగారు.

🍃🌺గురుదేవా మీరు నీటి తొట్టి లో నన్ను ముంచినప్పుడు "ఇంకొక్క క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేనని భయంవేసింది, ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదనిపించింది" అన్నారు వివేకానందులు.

🍃🌺వెంటనే గురుదేవులు వివరిస్తూ శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి, నీవు లేకుంటే నేను బ్రతకలేననే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది వివరించారు పరమగురువు.

🍃🌺అంత సాధన చేయాలి భగవద్దర్శనం కోసం కానీ మనమో కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనపడాలంటే ఎలా...

🍃🌺స్వామీ నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను. మిగతా సమయంలో నాబుద్ధి అలా..అలా.. గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది,మరినువ్వు నాకు కనపడతావా, అంటే ఆయన నీకెలా కనపడతారు??

🍃🌺 నీకు భగవద్దర్శనం కావాలంటే ప్రతీ క్షణం ఆయన యందే నీ మనసు లగ్నం అయిఉండాలి
నువు బౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా అతని స్మరణలోనే ఉండాలి .

🍃🌺అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతీ క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతిక్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ చేయనక్కర లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది.

🍃🌺అందుకే వివేకానందులవారంటారొకచోట నీ పూజలు జపతపాలు, సాధనలూ ఏవీ..ఏవీ.. భగవంతుని దర్శింపజేయలేవు కేవలం ఆయన కరుణతప్ప అని కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ వుంటే మన మనస్సు పవిత్రమై, ఆయనను వదలి వుండలేని ఆర్తి మనలో కలుగుతుంది.

🍃🌺అప్పుడు లేగదూడ పిలుపువిన్న గోమాతలా పరుగుపరుగున ఆయనే వస్తాడు మనకేంటి తొందర ...



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

Source - Whatsapp Message

No comments:

Post a Comment