Friday, May 27, 2022

ఓ మంచిమాట

ఓ మంచిమాట
->ఆత్మ విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహం, ఈ మూడు గుణాలు మనిషి జీవితాన్ని ఎంతో శక్తివంతంగా తయారు చేసేస్తాయి.
->మేలుకున్న జ్ఞానిగా ఉండడం ఐశ్వర్యప్రదం. నిద్రపోతూ సోమరిగా జీవించడం అన్నిటికన్నా దరిద్రం.
->ఏకాగ్రత... ఆవేశాన్ని పవిత్రం చేసి, శాంతింపజేస్తుంది. మనిషి ఆలోచనలకి శక్తినందించి, స్పష్టమైన కల్పనని చిగురింపజేస్తుంది.
->మనస్సును నిర్మలంగా ఉంచుకోగలగడమే పవిత్రమైన మతసారం. తక్కినవన్నీ అర్థంలేని బాహ్య ఆడంబరాలే.
->కాలం ఎంతో విలువైనది. గతించిపపోయిన గతాన్ని భగవంతుడైనా తిరిగి సంపాదించి పెట్టలేడు.
->నాలుకను జయించితే నరలోకాన్ని జయించినట్లే.
->ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటిని మించి మహాసంగ్రామం లాంటిది.
->మన జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి ఏదో విధంగా మనకంటే గొప్పవాడై ఉంటాడు. అలా తారసపడ్డ ప్రతి వారి నుంచీ ఎంతో కొంత నేర్చుకోగలిగితే, మన జీవితం ధన్యమే.
->కోపంగా ఉండడం అంటే నిప్పును పట్టుకోవడమే. ఎదుటి వాళ్ళ మీదకు విసిరే లోపల అది నిన్నే దహించి వేస్తుంది.
->సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ ఆపూ ఉండదు.
->తాను ప్రవేశించిన పాత్ర యొక్క స్వరూపాన్ని పొందే నీటిలాగే, బుద్ధిమంతుడైన వ్యక్తి పరిస్థితులకి అనుగుణంగా తనని తాను సరిదిద్దుకుంటాడు.
->ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు. 1. రహస్యాన్ని కాపాడడం, 2. అవమానాన్ని మరచిపోవడం, 3. సమయాన్ని సద్వినియోగం చేయడం.
->కాళ్ళకు చెప్పులు లేదే అనే బాధ అసలు కాళ్ళే లేని వ్యక్తిని చూసే వరకే ఉంటుంది.
->వివేకవంతుడు ముందు ఆలోచించి తరువాత మాట్లాడతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు.



No comments:

Post a Comment