Friday, May 20, 2022

భగవద్గీత

🍁 భగవద్గీత🍁

📚✍️ మురళీ మోహన్

👌 మన దేశంలో జ్ఞానం చెప్పే శ్రీ కృష్ణుడు లాంటి భగవంతుడికన్నా..
కోరికలు తీర్చే ఇతర దేవతలకే ప్రాముఖ్యత ఎక్కువ..

ఒకనాడు దేశంలో అందరి తలలో జ్ఞానం ఉండేది..
కానీ ఈనాడు భగవద్గీత జ్ఞానం అని చెప్పగానే మనుషుల మొకాల్లో నిర్లక్ష్యం ,నిరాశక్తి కనిపిస్తుంది. దాని పర్యవసానమే.
నేటి ఫలితంగా.. గతి తప్పిన సమాజం.
దేవుడి మార్గంలో వెళ్లే జ్ఞానం చెప్పే గురువుకన్నా...
మహిమలు చూపే బాబాలకే నేడు విలువ ఎక్కువ...
అందుకే మనుషులలో జ్ఞానులకంటే...
అజ్ఞానులే ఎక్కువ మంది ఉన్నారు.
అందుకే కావొచ్చు గీతలో శ్రీ కృష్ణుడు కూడా..
ఇదే మాటను ధ్రువీకరిస్తూ.
ఒక శ్లోకంలో అంటాడు...
"వేల కొలదిలో ఒకానొకడు నన్ను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు". అని.. కానీ ఈ సంఖ్య నేటికి సగటున
ప్రతీ లక్షమందిలో ఒకానొకడు కూడా నిజమైన
దైవం కోసం వెతకడం లేదు.
తమ కోరికలకో,సంతోషమైన జీవితానికో దేవుడిని
వేడుకుంటున్నారు.

జరిగేవన్నీ కర్మానుసారం అని గీత బోధిస్తుంది.
ఆ గీతా జ్ఞానం ప్రజల్లో లేకనే..ఒకడు తిరుపతి అని..మరొకడు అన్నవరం అని తిప్పలు పడుతూ.. అవస్థలతో దొబ్బుకుంటు... తోసుకుంటూ..డబ్బులు పెట్టి ప్రత్యేక దర్శనాలు చేసుకొని..అదే పెద్ద భక్తి అని భ్రమలో బ్రతికేస్తూ..అదేదో గొప్ప అని బావిలో కప్పలా బ్రతుకీడుస్తున్నాడు. మనకు సమయం లేదు..నిజమే.. కానీ ఆ కర్మలో నిన్ను ఇరికించిందే.. దేవుడు అని తెలుసుకోలేక.. ఈ బిజీ జీవితం గొప్పతనం అంతా నా తెలివి అని పొరబడి. నిత్యం ఆ కర్మ చక్రంలో తిరుగుతూ జీవితం ఖర్చు చేస్తూ..వృద్ధాప్యానికి చేరువై.. ఆజ్ఞానిగా చేస్తున్నాడు. దేవుడు నిన్ను వేలు,లక్షలు,కోట్లు,వజ్రకిరీటాలు..పెట్టుబడిగా పెట్టమని ఎక్కడ చెప్పలేదు. కేవలం "శ్రద్ద"అనే రెండక్షరాల పెట్టుబడి నీదైతే..మోక్షమనే ఫలం నీదవుతుంది అని గీతలో చెప్తాడు.
కానీ ఇవన్నీ మనిషి తెలియటం లేదు.. తెలియచెప్పే వారు లేరు.. ఒకవేళ ఉన్నా వారి మాటను విశ్వసించరు.
అందుకే దేశంలో జ్ఞానుల లిస్ట్ చిన్నదై..
అజ్ఞానుల లిస్ట్ పెద్దదై ఉంది. ఇటువంటి సమయాన్నే ఆసరాగా చేసుకొని ఆనాడు గీతాచార్యుడు భువిపైకి వచ్చి...
దుక్కితుడైన అర్జునుడిని ఉపయోగించుకొని...
సర్వ మానవులకు వర్తించే అతి రహస్యమైన దేవుడి జ్ఞానాన్ని
స్థాపించి వెళ్ళాడు. అన్ని ముందర ఉన్నా...
నేడు మనిషికి శ్రద్ద(ఆసక్తి) లేక.. కష్టాలకు ఏడుస్తూ...
నష్టాలకు కుంగిపోతూ...ఉంటున్నాడే కానీ..
ఒక్క క్షణం ఆలోచించి...ఈ బాధలనుండి బయట పడేసేందుకే కదా ఆనాడు శ్రీ కృష్ణుడు గీతా బోధ చేసింది ...
అని గుర్తుచేసుకోలేక...బాధలతో... ఆత్మహత్యలకు సైతంపాల్పడుతున్నాడు. వాస్తవానికి ఈనాటి యువతకి
కడుపుకి తినే ఆహారంలో పోషకాలు..అలవాట్ల వల్ల మానసిక క్రుంగబాట్లు కలగటం లేదు..యువత తలలో భగవద్గీత జ్ఞానం లేకనే.. అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా యువత చదువు.... సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా భగవద్గీత జ్ఞానం అత్యంత ముఖ్యమైనదని గ్రహించి...తెలుసుకొంటే ...అప్పుడే భారతదేశం తిరిగి,
జ్ఞానులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. 💐💐

సేకరణ

No comments:

Post a Comment