Tuesday, May 31, 2022

కనుక చెడ్డని వదిలి మంచిని పట్టుకోండి. తరిస్తారు.

చెడు చేసినవారిని వెంటనే మరచిపోండి
మంచి చేసినవారిని జీవితకాలం గుర్తుపెట్టుకోండి.
ఇలా చేశాడు కనుకే రాముడిని దేవుడు అన్నారు.

ఎవరో మీ దగ్గర ఓ పదివేలు తీసుకొని ఇచ్చే అవకాశం ఉండి కూడా ఎగ్గోట్టాడు. వాడిని అక్కడితో వదిలేయండి. వాడి బుద్ది బయటపడింది కదా!

ఎవరో ఒకపూట భోజనం పెట్టారు. ఆ పూటకి ప్రాణం నిలబడింది కనుక జీవితకాలం గుర్తుంచుకోండి. ఎన్ని చేసిన పొట్టకోసమే కదా! అలాగని భోజనం పెట్టినవారినే కాదు. మాట సాయం, ధన సాయం ఇలా అవసరంలో ఎవరు ఎలా ఆదుకున్నా వారిని గుర్తుంచుకోండి. ఏదో ఒక మేలు చేయండి. లేదంటే మీరు కూడా పైవాడి లాగా కృతఘ్నులు అవుతారు.

నా జీవితంలో నేను నిలబడడానికి ఎందఱో సాయం చేశారు. వారందరికీ ఎదో ఒకటి చేశాను. కాకపోతే కొందరికి చాలాదూరంలో ఉండడం వలన ఇవ్వలేకపోయాను. పోయ్యేలోపు ఖచ్చితంగా ఎదో ఒక మేలు చేసే తీరుతాను.

అందరూ ఒకటి గుర్తుంచుకోండి. పోయేలోపు అందరి ఋణాలు తీర్చేయాలి. లేదంటే ఆ ఋణం చెల్లించడానికి మళ్ళి జన్మేత్తి రావాలి. ఋణానుబంధం అంటారు కదా! అదే ఇది.

ఒక్కొక్కరు ఇంటి నుండి కదలరు. కానీ భార్య వలనో, బిడ్డల వలనో కాలం గడిపేస్తాడు.
మరొకరు పుట్టిన కొన్నాళ్లకే మరణిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు శోకం కలిగించి పోతారు. వారి ఋణం అంతవరకే.
ఇంకొకరు భార్య రూపంలో వేధిస్తూ ఉంటుంది. పూర్వజన్మ వేధింపుల ప్రభావం ఈ ఋణం.

ఏమి లేదండి. ఒకరు మన మీద పడి తింటున్నా, మరొకరు బాధిస్తున్నా, మరొకరు తనంతట తానుగా అన్ని భరిస్తూ మిమ్మల్ని సంతోషపెడుతున్నా దానికి కారణం ఋణానుబంధమే.
మనతో కనెక్ట్ అయ్యేవారందరూ ఎదో ఒక కారణం లేకుండా మాత్రం కనెక్ట్ అవ్వరు.

కనుక చెడ్డని వదిలి మంచిని పట్టుకోండి. తరిస్తారు. చెడునే తలుస్తూ కూర్చుంటే మానసిక వ్యథ, తద్వారా అనారోగ్యం తప్ప ఏమి ఉపయోగం లేదు. ఎవరో ఎదో అన్నారని భాదపదవద్దు. దానికి కారణం ఉంటుంది. మనకి మనం మంచిగానే కనిపిస్తాం, మీలో నుండి మీరు బయటికి వచ్చి అ పరిస్థితిని గమనిస్తే తప్పు చేశామా! ఒప్పు చేశామా! అనేది బోధపడుతుంది.

సేకరణ

No comments:

Post a Comment