గురుకర్తవ్యం
గురు శిష్య సంప్రదాయం పేరిట ఇటీవలి కాలంలో సాగుతున్న పరస్పర వంచన, దోపిడీలను చూచి ఎందరో స్వచ్ఛమైన యోగులు ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించారు. కానీ కొత్త గురువులు ఎప్పటికప్పుడు వెలుస్తూనే ఉన్నారు. తమ తమ ప్రయోజనాలను ఆశించిన శిష్యకోటి వారి చుట్టూ పోగవుతూనే ఉన్నారు. ఒక వర్గం వారి మనుగడ మరొక వర్గం మీద ఆధారపడుతుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇలాంటి ఆధ్యాత్మిక పరిశ్రమలు వెదజల్లే కాలుష్యమంతా ఇంతా కాదు. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ పరస్పర దోపిడీని, వంచననూ నిశితంగా విమర్శించేవారు. తాను ఎవరికీ గురువును కాననీ, తనకు అనుచరులంటూ ఎవరూ లేరంటుండేవారు. తాను చెప్పేది అర్థం చేసుకుని అలాంటి అవగాహనతో జీవించేవారిని చూచి సంతోషించేవారు.
అరుణాచల రమణుడు కూడా ఈ 'గురు'పదాన్ని అవతలికి విసిరేశాడు. పాల్ బ్రంటన్ ఆయనతో, “మిమ్మల్ని నేను గురువుగా భావించడాన్ని మీరెందుకు అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, “నీకు గురువు ఉండాలనే ఈ తీవ్రమైన కాంక్ష ఎక్కడిది? నిన్ను ముందుకు నడిపించేది నీలోనే ఉన్నదని నేను చెప్తుంటే నాకు గురువు ఉండాలనే నీ పట్టదల ఏమిటి?” అని ఎదురు ప్రశ్నవేశారు.
నిజంగా మీ మేలు కోరేవాడెవడూ, తాను మీ గురువునని చెప్పుకోడు. మిమ్మల్ని వాడుకోడు, వంచించడు, మైత్రీ భావంతో మిమ్మల్ని తరింపజేస్తాడు.
గురునామం స్వీకరించినా, స్వీకరించకపోయినా, మిమ్మల్ని ఉద్ధరించాలని గాఢంగా కోరుకున్న శ్రీ నిసర్గదగ్గ మహరాజ్ గురు కర్తవ్యాన్ని ఎలా నిర్వచించాడో చూడండి.
పృచ్ఛకుడు : మీరూ, మీ పూర్వపు గురువులూ పరంపరానుగతంగా దత్తాత్రేయుని అవతారంగా మేము భావించవచ్చునా?
నిసర్గదత్త : మీరు ఏది నమ్మదలుచుకుంటే అది నమ్మండి. మీ నమ్మకాన్ని అనుసరించి మీరు కర్మనాచరిస్తే, అందుకు తగిన ఫలితాలు మీకు దక్కుతాయి. కానవీటి వేటికీ నేనేమాత్రం ప్రాధాన్యమివ్వను.
నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది నేను నాకది చాలు. వేరొకరు ఎంత గొప్పవారైనప్పటికీ, వారితో నన్ను పోల్చుకోవాలనిగాని, వారిలో ఐక్యమవ్వాలని గానీ నాకు లేదు. అలాగే ఏవో పురాణ గాథలను వాస్తవాలుగా భావించే స్థితిలో లేను. నా వరకు నాకు ఈ కనిపించే అజ్ఞానం, దీని నుండి విముక్తిని గురించే నా శ్రద్ధ అంతాను.
తమ శిష్యుల్లోని మనస్సులలోనూ, హృదయాలలోనూ ఉండే అజ్ఞానాన్ని విచ్ఛేదం చేయడమే గురువుయొక్క అసలు కర్తవ్యం. శిష్యుడు ఇదంతా ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత రుజువు చేసుకోడానికై ఆచరించవలసిన కర్మ యావత్తూ అతడు స్వయంగా ఆచరించు కోవలసిందే కానీ, ఒకరి తరఫున మరొకరెవరూ చేసిపెట్టగలిగిలేరు. శిష్యుడు గనక సరిగా ఆచరించలేకపోతే, అతడికి విషయం సుబోధకం కాలేదన్నమాట.
పృ : పూర్తిగా నిరాశ జనింపజేసే శిష్యులు కూడా మీకు తారిసిల్లుతూంటారను కుంటాను.
ని : సంపూర్తిగా నిరాశ కలిగించే శిష్యుడంటూ ఉండడు. ఆటంకాలను అధిగమించే వీలున్నది. జీవితం సరిచేయలేనటువంటిది, మరణం ఎలాగూ అంతం చేస్తుంది. కానీ గురువుకు అపజయమంటూ లేదు.
పృ : మీకీ భరోసా ఎలా కలిగింది?
ని : మరేంలేదు. గురువున్నూ, మనిషి అంతరంగంలోని వాస్తవమూ - రెండూ కూడా మనసుకు విముక్తి కలిగించి మనిషిని కడతేర్చడానికనే పాటుపడుతున్నాయి. వాటికి అపజయమనేది ఉండే వీలులేదు. ఏ బండరాళ్ళయితే వాటికి అవరోధాలుగా పరిణమిస్తాయో, వాటి ఆధారంగానే అవి తమకవసరమైన వారధి నిర్మించుకో గలుగుతాయి.
మానవుడిలో ఉండేదంతా చైతన్యమొక్కటే అనుకోరాదు. గురువుతోనూ, అంతరంగం తోనూ మరింతగా సహకరించే ‘లెవెల్స్' (మట్టం) ఎన్నో ఉన్నాయి. గురువు ఈ 'లెవెల్స్ నన్నిటినీ బాగా ఎరిగున్నవాడు కాబట్టి, అతడికుండే శక్తి ఓర్పూ అపారమైనవి కాబట్టి, గురువుకు ఓటమి లేదు.
నిజమైన గురువు నిన్ను ఎన్నటికీ పలుచన చేయడు. నీ నుండి నిన్ను వేరు చేయడు. నిరంతరం నీలోని సంపూర్ణతను నీకు గుర్తుచేస్తూ, నీలోన నీవు తరచి చూచుకునేట్లు ప్రోత్సహిస్తుంటాడు. వెలుపలి నుండి నువ్వు కోరదగింది ఏదీలేదనీ, ఆఖరికి గురువైన తాను కూడా అనవసరమేననీ, విసుగూ విరామం లేకుండా గుర్తుచేస్తుంటాడు.
కానీ తనంతట తానే గురువుగా ప్రకటించుకున్నవాడికి తనని గురించిన చింతే ఉంటుంది కానీ, శిష్యుల శ్రేయస్సు యెడల ఉండదు.
పృ : గురువుల్ని మార్చడం తప్పులేదంటారా?
ని : మార్చితే తప్పేమిటి? గురువులు మైలురాళ్ళ వంటివారు. ఒక దరి నుండి మరొక దరికి వెళ్ళడం సహజమే. ప్రతి ఒక్క గురువూ కూడా మైలురాయిలాగా దిక్కునూ దూరాన్నీ సూచిస్తుంటాడు.
ఇక నిత్యమూ శాశ్వతమూ అయిన సద్గురు వంటావా, అతడు సాక్షాత్తూ నువ్వు ప్రయాణిస్తున్న ఆ మార్గమే. నీ మార్గమే నీ లక్ష్యమని, ఎల్లవేళలా దానినే నువ్వు అంటి పెట్టుకుని ఉండడం సంభవిస్తే ఇక సమస్యేలేదు. నువ్వు ఆ మార్గంమీద చేసే ప్రయాణం ఏ లక్ష్యాన్ని చేరడానికి కాదు సుమా, కేవలం ఆ సౌందర్యాన్ని అనుభవించడానికి, ఆ జ్ఞానాన్ని కనుగొనడానికి మాత్రమే ఈ ప్రయాణం. అప్పు డీ జీవితం భారమనిపించదు ఎంతో సహజంగా సరళంగా ఒక మహదానందంగా రూపొందుతుంది.
# యోగులుఅవధూతలు
# YoguluAvadhutalu
# అమృతధారఖడ్గధార
No comments:
Post a Comment